
మీర్జాపూర్: సీఆర్పీఎఫ్ జవాన్ సహా నలుగురు కలసి 15 సంవత్సరాల వయసున్న పాఠశాల విద్యార్థినిని ఎత్తుకెళ్లి గ్యాంగ్‌రేప్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో సోమవారం జరిగింది. నిందితుల్లో ఒకడైన జై ప్రకాశ్ సోదరి హాలియా గ్రామంలో ఉంటుందని, దీంతో తరచూ వచ్చేవాడని, ఈ నేపథ్యంలో ఈ విద్యార్థినితో పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. అయితే సోమవారం రాత్రి 10 గంటలకు విద్యార్థిని తల్లికి జై ప్రకాశ్ ఫోన్ చేసి ఇంటి బయటికి రావాలని కోరగా, వచ్చిన బాధితురాలిని బలవంతంగా పోలీస్ లోగో ఉన్న కారులో హాలియా అడవిలోకి తీసుకెళ్లి నలుగురు గ్యాంగ్‌రేప్ చేశారని బాధితురాలి తండ్రి పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో సీఆర్పీఎఫ్ జవాను మహేంద్ర యాదవ్, గణేశ్ ప్రసాద్ బింద్, లవకుశ్ పాల్, మాజీ జైలర్ కుమారుడు జై ప్రకాశ్ మౌర్యలు ఉన్నారు. బాధితురాలితో సహా నిందితులను వైద్య పరీక్షల కోసం పంపినట్లు మీర్జాపూర్ ఎస్పీ ధరమ్‌వీర్ సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment