
వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో ఉన్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, జవాన్ సినిమాతో ఆకట్టుకున్నాడు. బీవీఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావటంతో గ్యాప్ తీసుకోకుండా తన కొత్త సినిమాను మొదలెట్టేస్తున్నాడు. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. కరుణాకరన్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.
ఈ నెల 12 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేయస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈసినిమాకు గోపీసుందర్ సంగీతమందించనున్నాడు.