‘లవ్‌ యూ మామయ్య’ | Sai Dharam Tej Tweet About Chiranjeevi | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 10 2018 1:07 PM | Last Updated on Sun, Jun 10 2018 1:17 PM

Sai Dharam Tej Tweet About Chiranjeevi - Sakshi

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ తాజా చిత్రం ‘తేజ్‌ ఐ లవ్‌ యూ’. నిన్న (జూన్‌ 9) జరిగిన ఆడియో ఫంక్షన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ రాకతో ఈ ఫంక్షన్‌కు క్రేజ్‌ ఏర్పడింది. వేడుకలో చిరు ప్రసంగం కూడా అందరిని ఆకట్టుకుంది. కే ఎస్‌ రామారావు, తనకు మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకోవడం, తొలిప్రేమ సినిమా గురించి మాట్లాడుతూ పవన్‌ టాపిక్‌ తీయడం మెగా అభిమానులను అలరించింది. 

అయితే ఈ వేడుకకు హాజరైనందుకు చిరంజీవికి మెగా మేనల్లుడు ధన్యవాదాలు తెలియజేశారు. వేడుకలోనే ధన్యవాదాలు తెలిపినప్పటికీ మళ్లీ ఈ రోజు సోషల్‌ మీడియా వేదికగా తన కృతజ్ఞతలను తెలియజేశారు. ‘ థ్యాంక్యూ సో మచ్‌ మామయ్య.. మీరు ఫంక్షన్‌కు వచ్చి మా జీవితాల్లో నింపిన ఆనందాలను మా జీవితాంతం గుర్తు చేసుకుంటూ ఉంటాం. లవ్‌ యూ మామయ్య- తేజ్‌ ఐ లవ్‌ యూ బృందం’ అంటూ భావోద్వేగంగా ట్వీట్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement