Tej I Love You Audio Launch: Chiranjeevi Chief Guest for Sai Dharam Tej Movie - Sakshi
Sakshi News home page

Published Wed, Jun 6 2018 11:22 AM | Last Updated on Wed, Jun 6 2018 3:17 PM

Sai Dharam Tej Tej I Love You Audio Release - Sakshi

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం తేజ్‌ ఐ లవ్‌ యు. ప్రేమ కథల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్‌ బ్యానర్ పై కేయస్ రామారావు, వల్లభలు నిర్మిస్తున్నారు. ఇటీవల వరుస ఫ్లాప్‌ లతో ఇబ్బందుల్లో పడ్డ సాయి ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే ఎలాంటి ప్రయోగాల జోలికి పోకుండా తన వయసు తగ్గ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. జూన్‌ 9న ఆడియో రిలీజ్ వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సాయి ధరమ్‌ తేజ్‌ సరసన అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌ గా నటించిన తేజ్‌ ఐ లవ్‌ యు సినిమాను జూన్‌ 29న రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement