‘తేజ్‌’ ప్రీమియర్‌ క్రికెట్‌ లీగ్‌  | Tej I Love You Movie First Song Will Be Released On 2nd June | Sakshi
Sakshi News home page

Published Thu, May 31 2018 8:09 PM | Last Updated on Thu, May 31 2018 8:22 PM

Tej I Love You Movie First Song Will Be Released On 2nd June - Sakshi

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం ‘తేజ్‌ ఐ లవ్‌ యూ’ సినిమాతో బిజీగా ఉన్నారు. గత కొంత కాలం నుంచి ఈ మెగా హీరో నటించిన సినిమాలు ఆశించినంత స్థాయిలో విజయం సాధించడం లేవు. మాస్‌ సినిమాలు తీసి ప్రేక్షకులకు బోర్‌ కొట్టించిన ఈ హీరో ప్రస్తుతం లవ్‌స్టోరీతో మన ముందుకు రాబోతున్నాడు. ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌, పోస్టర్స్‌పై పాజిటివ్‌ కామెంట్స్‌ వస్తున్నాయి. 

కరుణాకరన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని తన గత సినిమాల్లానే మంచి ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా జూన్‌ 2న ఆర్జే ( రెడియో జాకీ) వర్సెస్‌ తేజ్‌ ఐ లవ్‌ యూ టీమ్‌ క్రికెట్‌ లీగ్‌ ఆడబోతోంది. గెలిచిన వారి చేతుల మీదుగా ఈ మూవీలోని మొదటి సాంగ్‌ను విడుదల చేయించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘అందమైన చందమామ’ అనే ఈ ఫస్ట్‌ సాంగ్‌ను ఎవరు రిలీజ్‌ చేస్తారో వేచి చూడాలి. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement