కరుణాకరన్
‘‘నా ప్రతి సినిమాలో ‘తొలిప్రేమ’ హ్యాంగోవర్ కనిపిస్తుంటుందని అంటుంటారు. ఎందుకంటే నేను కరుణాకరన్‌ని కాబట్టి. అది నా స్టైల్. జనాలకు ఏది నచ్చుతుందో అది చేయడం డైరెక్టర్ పని. ‘తొలిప్రేమ’ని ఇప్పటికీ గుర్తు చేస్తుంటే భయంగా అనిపిస్తుంటుంది. ఫస్ట్ క్లాస్‌లో స్టేట్ ఫస్ట్ వచ్చాం. ఆ నెక్ట్స్ మళ్లీ స్టేట్ ఫస్ట్ ఎందుకు రాలేదు? అని అడిగితే స్టూడెంట్స్‌కు ప్రెషర్‌గా ఉంటుంది. నాక్కూడా సేమ్’’ అన్నారు కరుణాకరన్. సాయిధరమ్ తేజ్, అనుపమ జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మించిన ‘తేజ్ ఐ లవ్ యు’ శుక్రవారం రిలీజైంది. శనివారం కరుణాకరన్ మీడియాతో మాట్లాడారు.
► ‘సినిమా బావుంది, చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంద’ని రిలీజైన రోజు నుంచి ఫోన్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఏ సినిమాకైనా ప్రేక్షకుల ఈలలే బెస్ట్ కాంప్లిమెంట్స్. ‘తేజ్’ సినిమా ఏ హాలీవుడ్ సినిమాకు ఇన్‌స్పిరేషన్ కాదు. నా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘ఎందుకంటే ప్రేమంట’, ఇప్పుడు ‘తేజ్’లో హీరోయిన్‌లు గతం మర్చిపోతారన్నది కావాలని రిపీట్ చేయలేదు. అది స్క్రీన్ ప్లేలో ఒక భాగం. ‘డార్లింగ్’లో ‘ఫస్ట్ హాఫ్ అబద్ధం’ అనే స్క్రీన్‌ప్లేతో నడుస్తుంది. అలా ఒక్కొక్క లవ్ స్టోరీని ఒక్కో స్టైల్‌లో చెప్పడానికి ప్రయత్నిస్తుంటా.
► లవ్ స్టోరీకి మ్యూజిక్ ఇంపార్టెంట్. అందుకని నా సినిమాలో హీరోలకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సినిమా చూడటానికి ఆడియన్స్ వచ్చినప్పుడు మంచి విజువల్స్, మ్యూజిక్, రొమాన్స్ ఉంటేనే ఎంటర్‌టైన్ అవుతారు. ఆండ్రూ విజువల్స్ చాలా బాగా చూపించారు. గోపీ సుందర్ అద్భుతమైన సంగీతం అందించారు. నా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ కూడా బాగా కష్టపడ్డారు. వీళ్లంతా లేకపోతే నేను లేను.
► ఇప్పటివరకు ఆడియన్స్ నన్ను గుర్తు పెట్టుకున్నది ‘తొలిప్రేమ’ వల్లనే. ఒక స్టాండర్డ్ సెట్ చేసింది ఆ సినిమా కాబట్టి నా ప్రతి సినిమాను అదే సినిమాతో కంపేర్ చేస్తుంటారు. వణుకు వచ్చేస్తుంటుంది. నేను కూడా ‘తొలిప్రేమ’ కంటే మంచి సినిమా తీయడానికి ప్రయత్నిస్తుంటాను. నా కథకు తగ్గట్టు సాయిధరమ్ తేజ్, అనుపమ అద్భుతంగా చేశారు.
► మా ఫ్యామిలీ మొత్తం 32మంది ఉంటారు. బాబాయిలు, మావయ్యలు, ఇలా చాలా మంది ఉంటాం. మా పిన్ని కూడా నన్ను కొడుకులానే చూస్తుంటారు. అదే నా సినిమాల్లో చూపిస్తాను. నా సినిమాకు వెళ్తే అందరూ ఎంజాయ్ చేయాలి. నా లైఫ్‌లో జరిగే బెస్ట్ మూమెంట్స్‌ని నా సినిమాలో వాడేస్తాను. అందులో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో ‘వద్దు సరోజా...’ ఎపిసోyŠ ఒకటి. మంచి మూమెంట్స్ అన్ని డైరీలో రాసుకొని కావాల్సినప్పుడు వాడుకుంటాను (నవ్వుతూ). నా ఫస్ట్ లవ్ స్టోరీ డిజాస్టర్. నాది అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు మేమిద్దరం లవ్‌లో ఉన్నాం.
► కేయస్ రామారావుగారు లెజెండ్. ఆయనతో సెకండ్ టైమ్ వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. 45 సినిమాలు చేశారు. ఎప్పటినుంచో సినిమాలు తీస్తున్నారు. కథ విని మంచి సలహాలు ఇస్తారు. నెక్ట్స్ సినిమా గురించి ఇంకా ఏం అనుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment