Sai Dharam Tez
-
ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది: నాగ చైతన్య
Naga Chaitanya First Reaction After Divorce: టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత-నాగ చైతన్య తమ వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పి ఎంతో మంది అభిమానులకు నిరాశ మిగిల్చారు. గత కొన్ని రోజలుగా వార్తలు వస్తున్నా అవి నిజం కాకపోతే బాగుండు అని అటు అక్కినేని అభిమానులు సహా ఎంతోమంది నెటిజన్లు కోరుకున్నారు. కానీ ఆ వార్తలనే నిజం చేస్తూ ఇక భార్య భర్తలుగా కొనసాగలేమని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చదవండి: Samantha: అందుకే సమంత విడాకులు తీసుకుందా? ఇక విడాకుల అనంతరం వీరిద్దరి సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ పెరిగింది.ఎప్పుడు ఏం మాట్లాడతారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా విడాకుల ప్రకటన అనంతరం నాగ చైతన్య తొలిసారిగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది..లాట్స్ ఆఫ్ లవ్ అంటూ ట్వీట్ చేశారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న హాస్పిటల్ బెడ్‌పై నుంచే ట్వీట్ చేశారు. తాను కోలుకుంటున్నానని, త్వరలోనే మీ ముందుకు వస్తా వంటూ సాయి తేజ్ ట్వీట్ చేయడంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నాగ చైతన్య సైతం సాయి తేజ్ తొందరగా కోలుకుంటున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. చదవండి: విడాకులపై స్పందించిన ఆర్జీవీ.. వైరల్ అవుతున్న ట్వీట్ So happy to see this tej !! Lots of love — chaitanya akkineni (@chay_akkineni) October 3, 2021 -
రిపబ్లిక్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఫోటోలు
-
ఇస్మార్ట్ స్పీడ్
‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ హిట్ కొట్టారు ఇస్మార్ట్ భామ నభా నటేశ్. ఇప్పుడు ఇస్మార్ట్ స్పీడ్‌లో షూటింగ్స్ చేస్తున్నారామె. లాక్డౌన్లో ఒక్కో సినిమా చిత్రీకరణ జరుగుతుంటే నభా నటేశ్ ఒక చిత్రాన్ని పూర్తి చేసి ఇంకో సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు. సాయి తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సోలో బతుకే సో బెటర్’ సినిమాలో హీరోయిన్గా చేశారామె. ఇటీవలే ఆ సినిమా మిగిలిన భాగాన్ని పూర్తి చేశారు. అలాగే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా చేస్తున్న ‘అల్లుడు అదుర్స్’లో హీరోయిన్గా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఇది కాకుండా ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌లో హీరోయిన్గా చేయనున్నారు. నవంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుందని టాక్. -
మానవతా దృక్ఫథం చాటుకున్న హీరో
సాక్షి, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని సినీ హీరో సాయి దరమ్ తేజ్ తన చేతుల మీదుగా తీసుకొని వెళ్లి ఆసుపత్రిలో అడ్మిట్ చేసి మానవత్వం చాటుకున్నారు. అయితే ప్రమాదానికి గురైన వ్యక్తి అతని స్నేహితుడే కావడం గమనార్హం. వివరాలు.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 52లో ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి టైర్ స్కిడ్ అయి కింద పడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్లున్న సాయి ధరమ్ తేజ్ ప్రమాదాన్ని చూసి కిందకు దిగి ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తి తన స్నేహితుడు, మ్యూజిక్ డైరక్టర్ అచ్చు అని తెలుసుకొని స్వయంగా వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కాగా, మానవత్వంతో స్పందించిన హీరో వ్యక్తిత్వాన్ని మిగతా వాహనదారులు, ప్రయాణీకులు ప్రశంసించారు. -
తేజ్‌కు మళ్లీ సుప్రీమ్ డేస్ వస్తాయి
సాయిధరమ్‌తేజ్, కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా, ‘నేను శైలజా’ ఫేమ్ కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘చిత్రలహరి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవి శంకర్ నిర్మించారు. ఏప్రిల్ 12న విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. కిషోర్ తిరుమల మాట్లాడుతూ – ‘‘అడగ్గానే వాయిస్ ఓవర్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్‌గారికి థ్యాంక్స్. అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కిషోర్ ఈ టైటిల్ చెప్పగానే బాగా నచ్చింది. ఏప్రిల్ మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తాం. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సాయి ధరమ్ తేజ్‌కు మళ్లీ ‘సుప్రీమ్’ డేస్ వస్తాయి అనే నమ్మకం ఉంది’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘మంచి పాత్ర కోసం చూస్తున్న తరుణంలో కిషోర్‌గారు ఈ పాత్రను ఇచ్చారు. ప్రేక్షకుడు నవ్వుతూనే ఇంటికి వెళ్తాడు’’ అన్నారు సునీల్.‘‘కిషోర్‌గారు కథ ఎంత బాగా చెప్పారో అంతే బాగా తీశారు. సునీల్ అన్న కామెడీని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీ’’ అన్నారు సాయిధరమ్. ‘‘కిషోర్‌గారు నా పాత్రను బ్యూటి ఫుల్‌గా డిజైన్ చేశారు. సాయిధరమ్, కల్యాణితో వర్క్ చేయడం హ్యాపీ’’ అన్నారు నివేదా. -
ప్రేక్షకుల ఈలలే గొప్ప కాంప్లిమెంట్స్
‘‘నా ప్రతి సినిమాలో ‘తొలిప్రేమ’ హ్యాంగోవర్ కనిపిస్తుంటుందని అంటుంటారు. ఎందుకంటే నేను కరుణాకరన్‌ని కాబట్టి. అది నా స్టైల్. జనాలకు ఏది నచ్చుతుందో అది చేయడం డైరెక్టర్ పని. ‘తొలిప్రేమ’ని ఇప్పటికీ గుర్తు చేస్తుంటే భయంగా అనిపిస్తుంటుంది. ఫస్ట్ క్లాస్‌లో స్టేట్ ఫస్ట్ వచ్చాం. ఆ నెక్ట్స్ మళ్లీ స్టేట్ ఫస్ట్ ఎందుకు రాలేదు? అని అడిగితే స్టూడెంట్స్‌కు ప్రెషర్గా ఉంటుంది. నాక్కూడా సేమ్’’ అన్నారు కరుణాకరన్. సాయిధరమ్ తేజ్, అనుపమ జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మించిన ‘తేజ్ ఐ లవ్ యు’ శుక్రవారం రిలీజైంది. శనివారం కరుణాకరన్ మీడియాతో మాట్లాడారు. ► ‘సినిమా బావుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంద’ని రిలీజైన రోజు నుంచి ఫోన్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఏ సినిమాకైనా ప్రేక్షకుల ఈలలే బెస్ట్ కాంప్లిమెంట్స్. ‘తేజ్’ సినిమా ఏ హాలీవుడ్ సినిమాకు ఇన్స్పిరేషన్ కాదు. నా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘ఎందుకంటే ప్రేమంట’, ఇప్పుడు ‘తేజ్’లో హీరోయిన్లు గతం మర్చిపోతారన్నది కావాలని రిపీట్ చేయలేదు. అది స్క్రీన్ ప్లేలో ఒక భాగం. ‘డార్లింగ్’లో ‘ఫస్ట్ హాఫ్ అబద్ధం’ అనే స్క్రీన్‌ప్లేతో నడుస్తుంది. అలా ఒక్కొక్క లవ్ స్టోరీని ఒక్కో స్టైల్లో చెప్పడానికి ప్రయత్నిస్తుంటా. ► లవ్ స్టోరీకి మ్యూజిక్ ఇంపార్టెంట్. అందుకని నా సినిమాలో హీరోలకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సినిమా చూడటానికి ఆడియన్స్ వచ్చినప్పుడు మంచి విజువల్స్, మ్యూజిక్, రొమాన్స్ ఉంటేనే ఎంటర్టైన్ అవుతారు. ఆండ్రూ విజువల్స్ చాలా బాగా చూపించారు. గోపీ సుందర్ అద్భుతమైన సంగీతం అందించారు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా బాగా కష్టపడ్డారు. వీళ్లంతా లేకపోతే నేను లేను. ► ఇప్పటివరకు ఆడియన్స్ నన్ను గుర్తు పెట్టుకున్నది ‘తొలిప్రేమ’ వల్లనే. ఒక స్టాండర్డ్ సెట్ చేసింది ఆ సినిమా కాబట్టి నా ప్రతి సినిమాను అదే సినిమాతో కంపేర్ చేస్తుంటారు. వణుకు వచ్చేస్తుంటుంది. నేను కూడా ‘తొలిప్రేమ’ కంటే మంచి సినిమా తీయడానికి ప్రయత్నిస్తుంటాను. నా కథకు తగ్గట్టు సాయిధరమ్ తేజ్, అనుపమ అద్భుతంగా చేశారు. ► మా ఫ్యామిలీ మొత్తం 32మంది ఉంటారు. బాబాయిలు, మావయ్యలు, ఇలా చాలా మంది ఉంటాం. మా పిన్ని కూడా నన్ను కొడుకులానే చూస్తుంటారు. అదే నా సినిమాల్లో చూపిస్తాను. నా సినిమాకు వెళ్తే అందరూ ఎంజాయ్ చేయాలి. నా లైఫ్‌లో జరిగే బెస్ట్ మూమెంట్స్‌ని నా సినిమాలో వాడేస్తాను. అందులో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో ‘వద్దు సరోజా...’ ఎపిసోyŠ ఒకటి. మంచి మూమెంట్స్ అన్ని డైరీలో రాసుకొని కావాల్సినప్పుడు వాడుకుంటాను (నవ్వుతూ). నా ఫస్ట్ లవ్ స్టోరీ డిజాస్టర్. నాది అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు మేమిద్దరం లవ్‌లో ఉన్నాం. ► కేయస్ రామారావుగారు లెజెండ్. ఆయనతో సెకండ్ టైమ్ వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. 45 సినిమాలు చేశారు. ఎప్పటినుంచో సినిమాలు తీస్తున్నారు. కథ విని మంచి సలహాలు ఇస్తారు. నెక్ట్స్ సినిమా గురించి ఇంకా ఏం అనుకోలేదు. -
అందరికంటే సినిమానే గొప్ప
‘‘నిన్నే ఫైనల్ కాఫీ చూశాం. సినిమా చాలా బాగా వచ్చింది. తేజు, లావణ్య బాగా చేశారు. నేను అందర్నీ బాగా చూసుకుంటాను. కల్యాణ్ గారు నన్నో గాజు బొమ్మలా చూసుకున్నారు. ఖచ్చితంగా ‘ఇంటిలిజెంట్’ సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు వీవీవినాయక్. సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా వినాయక్ పలు విశేషాలు పంచుకున్నారు. ► ఈ సినిమాలో ఒక సోషల్ ఇష్యూను టచ్ చేశాం. మైండ్ గేమ్స్ మీద సినిమా ఉంటుంది. అందుకే ‘ఇంటిలిజెంట్’ అని పెట్టాం. నా స్టైల్లోనే ఫుల్ కమర్షియల్ మీటర్లో ఉంటుంది. సాయిధరమ్, నేను, కల్యాణ్... మా ముగ్గురిలో ఎవరు ఇంటిలిజెంట్ అంటే సి.కల్యాణ్ గారే (నవ్వుతూ). ► ఆకుల శివ మంచి కథ అందించారు. తమన్ సూపర్ మ్యూజిక్ అందించాడు. జానీ, శేఖర్ మాస్టర్లు డ్యాన్స్‌లు బాగా కంపోజ్ చేశారు. కాంబినేషన్ ప్రెష్‌గా ఉంటుందని తేజ్‌కు జోడీగా లావణ్య త్రిపాఠిను తీసుకున్నాం. తను కుడా చాలా బాగా చేసింది. సినిమా టెంపోకు అడ్డు రాకూడదని కేవలం నాలుగు పాటలే పెట్టాము. నా మునుపటి సినిమా ఖైదీ నెం.150లో కూడా నాలుగు పాటలే ఉన్నాయి. ► ఈ సినిమాతో ఎంత పెద్ద కమర్షియల్ కథనైనా మోయగలడు అనే నమ్మకం తీసుకొచ్చాడు తేజ్. తనని హీరోగా ఫిక్స్ చేశాక ‘చమక్ చమక్’ సాంగ్‌ను రీమిక్స్ చేయాలనుకున్నాను. చిరంజీవిగారి పాటల్లో అది నా ఫెవరేట్ సాంగ్. అడిగిన వెంటనే ఇళయరాజాగారు పాటను మాకు ఇచ్చారు. ► మెగా ఫ్యామిలిలో నాలుగో హీరోతో చేశాను. చిరంజీవిగారితో సినిమా అంటే సెట్లో అందరం చాలా టెన్షన్‌గా ఉంటాం. చరణ్, బన్నీ విషయానికి వస్తే వాళ్లను ఠాగూర్’ సినిమా అప్పుడు నుంచి చూస్తున్నాను. చరణ్ చాలా సౌమ్యుడు. బన్నీ చాలా హార్డ్ వర్కింగ్. తేజ్, వరుణ్‌తేజ్ ఒకేసారి వస్తున్నారు. ఇది అనుకోకుండా జరిగింది. బాగుంటే రెండు సినిమాలు ఆడతాయి. సినిమాకు హీరో, దర్శకుడు, నిర్మాత.. ఎవరు గొప్ప అంటే నా దృష్టిలో అందరికంటే సినిమానే గొప్ప. ► బయట కథలతో సినిమా ఎందుకు తీస్తున్నానంటే, ఒక్కో కథకు చాలా టైమ్ పడుతుంది. రాఘవేంద్రరావుగారు ఓసారి అన్నారు. ఎప్పుడూ మన కథలే కాదు బయట కథలు కూడా చేయాలి. లేకపోతే మన ఐడియాలే రిపీట్ అవుతాయని. బయట కథలు చేస్తే కొత్త యాంగిల్ ఓపెన్ అవుతుంది. ► మా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి నాకా ఆలోచన లేదు. దర్శకుడిని కావాలనుకోలేదు.. అయ్యాను. సో... డెస్టినీకు వేరే ప్లాన్స్ ఏం ఉన్నాయో నాకు తెలీదు. ► రెండేళ్ల తర్వాత కొత్తవాళ్లతో సినిమా తీస్తాను. అప్పుడే ప్రొడక్షన్ హౌస్ ప్లానింగ్స్ కూడా చెబుతా. స్టార్స్‌తో అయినా కాబోయే స్టార్స్‌తో సినిమా అయినా నాకు టెన్షనే. బేసిక్‌గా సినిమా అంటేనే టెన్షన్. ఈ మధ్యన ఎవరో ఎయిర్‌పోర్ట్‌లో ఒ వ్యక్తి ‘సుమోలు గాల్లో లేస్తేనే మీ సినిమాలా ఉంటుంది సార్’ అన్నారు. ప్రతి సినిమాలోనూ సుమోలు గాల్లో ఎలా లేపుతాం (నవ్వుతూ). సినిమా సినిమాకు గ్యాప్ కావాలని తీసుకోం. రైటర్స్ కొరత కూడా అనను. టాలెంట్ ఉన్నవాళ్లకు అవకాశాలు రావట్లేదు. అవకాశం ఉన్నవాళ్లకు మంచి కథలు సెట్ కావట్లేదు. ► నా తర్వాత సినిమా ఏంటో నాక్కూడా తెలియదు. ‘అదుర్స్ 2’ వర్క్‌వుట్ చేద్దామనుకున్నాం. బట్ సెట్ అవ్వలేదు. కానీ తప్పకుండా ఉంటుంది. మహేశ్‌తో సినిమా చేద్దామనుకున్నాను కానీ మంచి కథ చెప్పలేకపోయా. -
ఆ పాట రీమిక్స్ అనగానే టెన్షన్ పడ్డా
‘‘ఒక్కో డైరెక్టర్ టేకింగ్ ఒక్కో విధంగా ఉంటుంది. ‘ఇంటిలిజెంట్’ విషయానికొస్తే వినాయక్‌గారి టేకింగ్ భిన్నంగా అనిపించింది. నా క్యారెక్టర్‌కి ఎక్కువ నటనకు స్కోప్ ఉంది. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నాను’’ అని హీరోయిన్ లావణ్య త్రిపాఠి అన్నారు. సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా లావణ్య చెప్పిన విశేషాలు... ►‘ఇంటిలిజెంట్’లో నా పాత్ర పేరు సంధ్య. అమెరికాలో చదువుకుని, ఇండియా వచ్చి తండ్రికి బిజినెస్‌లో సహాయం చేస్తుంటా. సంధ్య కొంచెం కోపిష్టి. రియల్ లైఫ్‌లో నేనలా కాదు. హీరో తన ఇంటెలిజెన్స్‌తో విలన్లని ఎలా ఎదుర్కొన్నాడన్నదే కథ. అందుకే సినిమాకి ఆ టైటిల్ పెట్టారు. ►తేజ్ (సాయిధరమ్ తేజ్) ఎప్పుడూ ఫన్నీగా ఉంటాడు. మంచి డ్యాన్సర్. నేను పని చేసిన హీరోల్లో తేజ్ చాలా కంఫర్ట్. నా గత సినిమాల కంటే ఈ చిత్రంలో ఎక్కువ డ్యాన్సులు చేశా. అందుకోసం బాగా ప్రాక్టీస్ చేశా. ►వినాయక్‌గారు చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయనకు కావాల్సింది మా చేత సులభంగా రాబట్టుకున్నారు. మమ్మల్నందర్నీ చిన్న పిల్లల్లా చూసుకున్నారు. కల్యాణ్‌గారికి సినిమా అంటే ప్యాషన్. ఎప్పుడూ సెట్స్‌లోనే ఉంటూ షూటింగ్‌ను ఎంజాయ్ చేసేవారు. ►చిరంజీవిగారి ‘చమకు చమకు..’ పాట రీమిక్స్ అనగానే కొంత టెన్షన్ పడ్డా. చిరంజీవిగారు చేసిన ఆ సాంగ్ రీమేక్ అంటే టెన్షన్ ఉంటుంది కదా. నేను ఆయన అభిమానిని. చిరంజీవిగారు, విజయశాంతిగారి స్థాయిలో చేయడం సాధ్యం కాదు. ప్రేక్షకులకు నచ్చేలా చేయడానికి మా ప్రయత్నం చేశాం. ►భిన్నమైన కథలను ఎంచుకునే వీలు హీరోయిన్లకు తక్కువ. ఆ విషయంలో హీరోలకు మంచి అడ్వాంటేజ్. కథానాయికలకు కూడా భిన్నమైన కథలు ఎంచుకునే అవకాశం రావాలని కోరుకుంటున్నా. నా మటుకు నేను వచ్చిన కథల్లో నటిగా నాకు మంచి పేరు తెచ్చేవి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ►నేను కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నాననే వార్తలు వచ్చాయి. అన్ని వార్తల్లోనూ నిజం ఉండకపోవచ్చు. నాకు కొందరితో విభేదాలు వచ్చాయని కూడా ప్రచారం జరిగింది. అది కూడా నిజం కాదు. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటున్నాను. -
అటు లవ్... ఇటు ఫైట్
సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కరుణాకరన్ దర్శకత్వంలో కేయస్ రామారావు ఓ చిత్రం నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. చక్కని ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఒకవైపు ఈ ప్రేమకథలో నటిస్తోన్న సాయిధరమ్ మరోవైపు ఓ యాక్షన్ మూవీలో నటించడం విశేషం. సాయిధరమ్ తేజ్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో ఈ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ఫస్ట్ ‘ఇంటెలిజెంట్’ అని టైటిల్ అనుకున్నారనే వార్త వినిపించింది. ఇప్పుడు ‘ధర్మాభాయ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రం కోసం యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారట. ఇందులో తేజ్ సాఫ్ట్వేర్ కుర్రాడిగా నటిస్తున్నారట. అటు లవ్.. ఇటు యాక్షన్ మూవీస్‌లో నటిస్తూ సాయిధరమ్ ఫుల్ బిజీ. -
తేజ్ ఏ రోజూ సెకండ్ టేక్ తీసుకోలేదు – వీవీ వినాయక్
‘‘చిరంజీవి, పవన్‌కల్యాణ్ కలిస్తే సాయిధరమ్ తేజ్. మా సినిమా కోసం 40 రోజులు షూటింగ్ చేశాం. ఏ రోజూ తను సెకండ్ టేక్ తీసుకోలేదు. అంత ఫోకస్‌గా ఉన్నాడు’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా బీవీయస్ రవి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జవాన్’. ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించారు. ఈ సినిమా ప్రీ–రిలీజ్, పాటల విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఖుషి, బద్రి’ సినిమాల ఇన్స్పిరేషనే ‘జవాన్’ టైటిల్ సాంగ్. రవి మంచి రచయిత. స్నేహితుడు రవి కోసం స్క్రిప్ట్ విషయంలో కొరటాల శివ సపోర్ట్ చేయడం హ్యాపీ. తేజ్, నేను చేసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. ఆ సక్సెస్ జర్నీ ‘జవాన్’తో మరోసారి కంటిన్యూ అవుతుంది. తమన్ ఎక్స్ట్రార్డినరీ రీ–రికార్డింగ్ ఇచ్చాడు. డిఫరెంట్ అప్రోచ్‌తో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘బీవీయస్ రవి నా కాలేజ్‌మేట్. కృష్ణ కూడా నాకు ఎంతో కావాల్సిన వ్యక్తి. తేజ్ చాలా పాజిటివ్ హీరో. నాకు కావాల్సిన వీరందరూ కలిసి చేస్తున్న ‘జవాన్’ హిట్ అవ్వాలి’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ. బీవీయస్ రవి మాట్లాడుతూ– ‘‘తేజ్‌కి ఈ కథ చెప్పగానే సినిమా చేస్తానన్నాడు. నేను ఎంతో నిజాయతీతో, నిక్కచ్చిగా తయారు చేసుకున్న పాత్ర ఇది. అంతే నిజాయతీగా తేజ్ కష్టపడ్డాడు. ఇంటికో జవాన్ ఉండాలని చెప్పే సినిమా ఇది. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది’’ అన్నారు. సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ– ‘‘నేను తినే ప్రతి మెతుకుపైనా మా మావయ్యల (చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్) పేర్లు ఉంటాయి. మా ఫ్యామిలీకి చిరంజీవి, పవన్ మావయ్యలు ఎలా జవాన్లుగా నిలబడ్డారో, అలా ప్రతి ఫ్యామిలీకి ఓ జవాన్ అండగా ఉంటాడు. కృష్ణగారు మేకింగ్‌లో రాజీపడలేదు’’ అన్నారు. -
ధైర్యం... బలం అవే ఆయుధం
ఓ యువకుడి ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కుటుంబం, మరొకటి దేశం! రెండిటిలో ఏదో ఒక్కదాన్నే ఎంచుకోవాల్సిన టైమ్‌లో అతను ఏం చేశాడనే కథతో రూపొందుతోన్న సినిమా ‘జవాన్’. ఇంటికొక్కడు... అనేది ఉపశీర్షిక. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు బీవీయస్ రవి దర్శకుడు. ఈరోజు దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా హీరో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కమర్షియల్ చిత్రమిది. ఓ మధ్య తరగతి యువకుడు తనకెదురైన కష్టాలను మనోధైర్యంతో, బుద్ధిబలంతో ఎదుర్కొని కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనేది చిత్రకథ’’ అన్నారు.‘‘సాయిధరమ్ తేజ్‌కి తగ్గ కథ. షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరుగుతోంది. సినిమా బాగా వస్తోంది’’ అన్నారు ‘దిల్’ రాజు. నిర్మాత కృష్ణ మాట్లాడుతూ – ‘‘మా ధైర్యం ‘దిల్’ రాజు గారే. ఆయన ముందుండి మా సినిమాను నడిపిస్తున్నారు. ఇటీవల ఇటలీలో రెండు పాటలు చిత్రీకరించాం. రేపటి నుంచి హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ తీస్తాం. జూలై కల్లా చిత్రీకరణ పూర్తిచేసి, ఆగస్టులో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. తమిళ హీరో ప్రసన్న విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్, సంగీతం: ఎస్.ఎస్. తమన్.