
సాక్షి, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని సినీ హీరో సాయి దరమ్ తేజ్ తన చేతుల మీదుగా తీసుకొని వెళ్లి ఆసుపత్రిలో అడ్మిట్ చేసి మానవత్వం చాటుకున్నారు. అయితే ప్రమాదానికి గురైన వ్యక్తి అతని స్నేహితుడే కావడం గమనార్హం. వివరాలు.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 52లో ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి టైర్ స్కిడ్ అయి కింద పడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్లున్న సాయి ధరమ్ తేజ్ ప్రమాదాన్ని చూసి కిందకు దిగి ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తి తన స్నేహితుడు, మ్యూజిక్ డైరక్టర్ అచ్చు అని తెలుసుకొని స్వయంగా వెళ్లి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. కాగా, మానవత్వంతో స్పందించిన హీరో వ్యక్తిత్వాన్ని మిగతా వాహనదారులు, ప్రయాణీకులు ప్రశంసించారు.