
‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ హిట్ కొట్టారు ఇస్మార్ట్ భామ నభా నటేశ్. ఇప్పుడు ఇస్మార్ట్ స్పీడ్‌లో షూటింగ్స్ చేస్తున్నారామె. లాక్‌డౌన్‌లో ఒక్కో సినిమా చిత్రీకరణ జరుగుతుంటే నభా నటేశ్ ఒక చిత్రాన్ని పూర్తి చేసి ఇంకో సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు. సాయి తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సోలో బతుకే సో బెటర్’ సినిమాలో హీరోయిన్‌గా చేశారామె.
ఇటీవలే ఆ సినిమా మిగిలిన భాగాన్ని పూర్తి చేశారు. అలాగే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా చేస్తున్న ‘అల్లుడు అదుర్స్’లో హీరోయిన్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఇది కాకుండా ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌లో హీరోయిన్‌గా చేయనున్నారు. నవంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుందని టాక్.
Comments
Please login to add a commentAdd a comment