
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. కాగా ‘బుక్ మై షో’లో అత్యధిక టికెట్లు బుక్ అయిన ఇండియన్ సినిమాగా ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ పేర్కొన్నారు.
‘‘12.15 మిలియన్+టిక్కెట్ సేల్స్ (దాదాపు కోటీ 20 లక్షలు)తో ‘బుక్ మై షో’లో హయ్యస్ట్ సేల్స్ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమా 12.01 మిలియన్ల టిక్కెట్ సేల్స్ రికార్డును సాధించింది. ‘కల్కి 2898 ఏడీ’ విడుదలైన కేవలం 20 రోజుల్లోనే ‘జవాన్’ రికార్డును దాటింది. వీకెండ్‌తో పాటు వీక్ డేస్‌లోనూ మా సినిమా వసూళ్లు చాలా స్టడీగా ఉన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment