Ticket sales
-
'దేవర' రికార్డ్.. రిలీజ్‌కి ముందే అన్ని కోట్ల వసూళ్లు!
తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అనుకోని విధంగా రద్దయింది. ఇవన్నీ కాదన్నట్లు ట్రైలర్స్ చూసి సోషల్ మీడియాలో ట్రోలింగ్. దీంతో చాలామంది 'దేవర'పై తక్కువ అంచనాలు వేశారు. కానీ ఊహించని విధంగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. మన దేశం, ఓవర్సీస్లో విడుదలకి ముందే కోట్ల వసూళ్లు సాధిస్తోంది.(ఇదీ చదవండి: 'దేవర' ఓటీటీ.. ఆ రెండు హిట్ సినిమాల రూట్లో!)ఆదివారం రెండో ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. సోమవారం నుంచి టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో టికెట్స్ సేల్ ద్వారా రూ.18 కోట్ల మేర వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్లోనూ ప్రీమియర్స్ పడకముందే రెండున్న మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది. అంటే దాదాపు రూ.17 కోట్లు అనమాట.సినిమా రిలీజ్‌కి మరో రోజు గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఇండియా, ఓవర్సీస్లో రూ.20 కోట్ల సేల్ దాటేయడం పక్కా అనిపిస్తోంది. మరోవైపు తొలిరోజు కలెక్షన్స్‌లోనూ 'దేవర' రికార్డులు సృష్టించడం గ్యారంటీ. ఎందుకంటే అర్థరాత్రి 12, 1 గంట నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోలు పడబోతున్నాయి. హిట్ టాక్ వస్తే మాత్రం 'దేవర'ని ఆపడం కష్టమవుతుంది.(ఇదీ చదవండి: ‘దేవర’ నిర్మాతలకు ఏపీ హైకోర్టు షాక్!) -
Prabhas: ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త రికార్డు
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. కాగా ‘బుక్ మై షో’లో అత్యధిక టికెట్లు బుక్ అయిన ఇండియన్ సినిమాగా ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ పేర్కొన్నారు.‘‘12.15 మిలియన్+టిక్కెట్ సేల్స్ (దాదాపు కోటీ 20 లక్షలు)తో ‘బుక్ మై షో’లో హయ్యస్ట్ సేల్స్ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమా 12.01 మిలియన్ల టిక్కెట్ సేల్స్ రికార్డును సాధించింది. ‘కల్కి 2898 ఏడీ’ విడుదలైన కేవలం 20 రోజుల్లోనే ‘జవాన్’ రికార్డును దాటింది. వీకెండ్‌తో పాటు వీక్ డేస్‌లోనూ మా సినిమా వసూళ్లు చాలా స్టడీగా ఉన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. రేపటి నుంచి టికెట్ల విక్రయం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 23న జరుగనున్న ఇండియా, ఆస్ట్రేలియా టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కోసం 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి పేటీఎం (insider.in) లింక్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు విక్రయించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా 17, 18 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలోని ‘బి’ గ్రౌండ్, వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తామని తెలిపారు. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల 22వ తేదీ వరకు, అదేవిధంగా విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలోని ‘బి’ గ్రౌండ్ లో ఉన్న కౌంటర్ లో 23వ తేదీ వరకు రీడీమ్ చేసుకోవచ్చని తెలిపారు. టికెట్ ధరలు ఇలా.. రూ. 600/–, రూ. 1,500/–, రూ. 2000/–, రూ. 3,000/–, రూ. 3,500/–, రూ. 6000/– విలువ గల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మ్యాచ్ తేదీ: నవంబర్ 23 ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20 -
Ind Vs Pak: నిమిషాల్లోనే టికెట్లు ఫినిష్
మెల్బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కు మరో 8 నెలల 6 రోజుల సమయం ఉంది. అయితే అభిమానులు మాత్రం ఇప్పటి నుంచే ఆ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తాజా ఉదాహరణ టికెట్ల విక్రయం... ప్రపంచ కప్ మెగా టోర్నీని ప్రత్యక్షంగా స్టేడియాల్లో తిలకించే ఫ్యాన్స్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం మధ్యాహ్నం నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచింది. అక్టోబర్ 23న ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో జరిగే భారత్, పాక్ మ్యాచ్ టికెట్ల కోసం అంతా ఎగబడ్డారు. ఫలితంగా నిమిషాల వ్యవధిలోనే ఐసీసీ తమ వెబ్సైట్లో ‘హౌస్‌ఫుల్’ (అలొకేషన్ ఎగ్జాస్టెడ్) బోర్డు పెట్టింది. దాదాపు 90 వేల సామర్థ్యం గల ప్రతిష్టాత్మక ఎంసీజీ మైదానంలో టికెట్ల కోసం ఉన్న క్రేజ్ చూస్తే భారత్, పాక్ మ్యాచ్ విలువేమిటో అర్థమవుతుంది. 2007 నుంచి 2016 వరల్డ్‌కప్ వరకు ఇరు జట్ల మధ్య జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 2021లో తొలిసారి పాక్‌ను విజయం వరించింది. -
‘అజహర్ స్టాండ్’
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత హెచ్‌సీఏ అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ పేరిట ఒక స్టాండ్ ఏర్పాటు చేయనున్నారు. హెచ్‌సీఏ అపెక్స్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నార్తర్న్ పెవిలియన్‌లోని స్టాండ్స్‌లలో ఒకదానికి అజహర్ స్టాండ్‌గా వ్యవహరిస్తారు. డిసెంబర్ 6న భారత్, వెస్టిండీస్ మధ్య ఇక్కడ జరిగే తొలి టి20 మ్యాచ్ సమయంలో అధికారికంగా స్టాండ్‌కు పేరు పెడతామని హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ వెల్లడించారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ క్రికెటర్లు అర్షద్ అయూబ్, వెంకటపతిరాజులను భవిష్యత్తుల్లో ఇదే తరహాలో గౌరవిస్తామని కూడా ఆయన చెప్పారు. మరో వైపు సౌత్ పెవిలియన్ బ్లాక్‌లోని ఒక లాంజ్‌కు హెచ్‌సీఏ మాజీ సంయుక్త కార్యదర్శి ఆర్.దయానంద్ పేరు పెట్టనున్నారు. గరిష్ట విలువ రూ. 12,500/– టి20 మ్యాచ్ కోసం నేటినుంచి టికెట్ల అమ్మ కాలు ప్రారంభిస్తున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహర్ ప్రకటించారు. క్రికెట్ పరిపాలకుడిగా ఇది తనకు తొలి మ్యాచ్ అని, దీనిని విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. టికెట్లను ఆన్లైన్లో ఠీఠీఠీ. ్ఛఠ్ఛిn్టటnౌఠీ. ఛిౌఝలో కొనుగోలు చేయవచ్చు. టికెట్ల ధరలను రూ.800, రూ.1000, రూ.1500, రూ.4000, రూ.5000, రూ.7500, రూ.10000, రూ.12500గా నిర్ణయించారు. -
ఐపీఎల్ ఫైనల్ టికెట్ల అమ్మకంలో మాయాజాలం
-
నేటి నుంచి వైజాగ్ ప్లే ఆఫ్ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు
సాక్షి, విశాఖపట్నం: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా జరుగనున్న రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు సంబంధించి ఆన్లైన్ టికెట్ల అమ్మకాలు శుక్రవారం ప్రారంభమవుతాయని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) కార్యదర్శి సీహెచ్ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఈనెల 8న ఎలిమినేటర్ మ్యాచ్... 10న క్వాలిఫయర్–2 మ్యాచ్ జరుగుతాయి. టికెట్లను www.eventsnow.com వెబ్సైట్లోకి లాగిన్ అయి కొనుగోలు చేయాలి. బీసీసీఐ టికెట్ల ధరలను రూ. 500, 1000, 1500, 1750, 3500, 7500గా నిర్ణయించింది. తొలి అంతస్తులోని కార్పొరేట్ బాక్స్‌లో ఒక్కో టికెట్ రూ. 9000కు.. రెండో అంతస్తులోని కార్పొరేట్ బాక్స్‌లో ఒక్కో టికెట్ రూ. 5000కు లభిస్తాయి. -
ఇది మొదటిసారి కాదా?
దుర్గగుడిలో దర్శనం టికెట్ల స్కాంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా బయట పడటం ఇదే ప్రథమం కాదని, గతంలోనూ పలుమార్లు టికెట్ల స్కాంను గుర్తించినా.. పూర్వపు ఈవోలు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. తాజా ఉదంతంలో కేవలం కౌంటర్లో టికెట్లను విక్రయించిన సిబ్బందే కాకుండా టికెట్లను స్కానింగ్ చేసే సిబ్బందితో పాటు త్రిలోక్ సంస్థకు చెందిన ఐటీ టెక్నీషియన్ కీలక పాత్ర పోషించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ) : దుర్గగుడి టికెట్ల స్కాంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఘటనపై దుర్గగుడి ఈవో వి. కోటేశ్వరమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు సమాచారం. ఘాట్ రోడ్డు కౌంటర్ నుంచే టికెట్లు జారీ దుర్గగుడి ఘాట్ రోడ్డుతో పాటు మహా మండపం వద్ద రూ. 300, రూ.100 టికెట్లు విక్రయించే కౌంటర్లను త్రిలోక్ సంస్థ నిర్వహిస్తోంది. శనివారం మధ్యాహ్నం ఘాట్ రోడ్డులోని కౌంటర్ నుంచే టికెట్లను విక్రయించినట్లు ఆలయ ఈవో విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది. కేవలం ఘాట్ రోడ్డులోని కౌంటర్లోనే ఈ తరహా అక్రమాలకు పా ల్పడ్డారా.. లేక మిగిలిన కౌంటర్లలోనూ ఈ తరహా అక్రమాలు జరిగాయా అనే దిశగా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. అంతా కలిసే చేశారా..! తాజా ఘటనలో కేవలం కౌంటర్లో టికెట్లు విక్రయించిన సిబ్బంది పాత్ర మాత్రమే ఉందనుకునే వీలులేదని పలువులు వ్యాఖ్యానిస్తున్నారు. కౌంటర్లో విక్రయించిన టికెట్లను అమ్మవారి ఆలయం చిన్న గాలి గోపురం వద్ద ఉన్న స్కానింగ్ కౌంటర్ వద్ద స్కాన్ చేశారు. ప్రతి కార్డుకు ఇచ్చిన బార్కోడ్ స్కాన్ చేసినప్పుడు కంప్యూటర్లో ఆ కార్డు వివరాలు సరిపోల్చుతాయి. అయితే స్కానింగ్‌లోని సిబ్బంది ఈ విషయాన్ని గమనించలేదా..? లేక స్కానింగ్ కౌంటర్లో సిబ్బంది టికెట్ల విషయం తెలిసి.. కావాలని తప్పించారా? అనేది తేలాల్సి ఉంది. కౌంటర్లో పని చేసే సిబ్బంది, టికెట్లు స్కానింగ్ చేసే సిబ్బంది ఇద్దరు త్రిలోక్ వారు నియమించిన వారు కావడంతో ఇటువంటి అక్రమాలు బయటకు రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సీరియల్ నంబర్‌ను గుర్తించేది ఏలా..? రూ. 100, రూ.300 టికెట్ల యాక్సిస్ కార్డులపై ముద్రించే బార్ కోడ్ కింద సీరియల్ నంబర్ సృష్టంగా లేకపోవడమే అక్రమాలకు ఆస్కారం కల్పించిందన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి యాక్సెస్ కార్డుకు ఒక గుర్తింపు నంబర్ ఉంటుంది. యాక్సెస్ కార్డుపై ముద్రించే బార్ కోడ్ కింద ఆ రోజు విక్రయించిన టికెట్ల సీరియల్ నంబర్‌ను ముద్రిస్తారు. అయితే టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు యాక్సిస్ కార్డుపై ఉన్న నంబర్‌ను మాత్రమే గమనిస్తుంటారు. అయితే ఇదే స్లిప్పై చిన్నవిగా ఉన్న సీరియల్ నంబర్ కింద మరో మారు తేదీ, నెల, ఏడాదిని కూడా ముద్రిస్తున్నారు. ఈ సీరియల్ నంబర్లను గుర్తించ వీలు లేకపోవడమే ఇటువంటి అక్రమాలను అటు భక్తులు కానీ, ఆలయ అధికారులు గానీ గుర్తించే అవకాశం లేకుండా పోతున్నారు. టికెట్ల జారీ ఇకదేవస్థాన సిబ్బందితోనేనా? రూ. 100, రూ. 300 టికెట్ల కౌంటర్లను నిర్వహించే బాధ్యత ఇక దేవస్థానం తీసుకోనున్నట్లు సమాచారం. శుక్రవారం టికెట్ల స్కాం బయట పడిన వెంటనే ఆలయ ఈవో వి. కోటేశ్వరమ్మ త్రిలోక్ అధికారులతో సమావేశమై వెంటనే కౌంటర్ల నిర్వహణ నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఒకటి రెండు రోజులలో నగదు లెక్కల వివరాలను దేవస్థానానికి అప్పగించిన తర్వాత కౌంటర్లలో వ్యవహారం తేలే అవకాశాలు ఉన్నాయి. -
తొలి గంటలోనే 1.2 లక్షల టికెట్ల అమ్మకాలు
రియో డి జనీరో: వచ్చే ఏడాది బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో నిర్వహించునున్న ఒలింపిక్స్ 2016 టికెట్ల కోసం క్రీడాభిమానులు ఎగబడుతున్నారు. ఆన్లైన్ లో ఉంచిన తొలి గంటలో ఒలింపిక్స్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తొలిగంటకే 1.2 లక్షల టికెట్ల విక్రయాలు జరిగాయని ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. అందులో ఎక్కువగా ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ గేమ్స్ టికెట్లకు అధిక డిమాండ్ ఉందని చెప్పారు. కాగా, తొలి 8 గంటల వ్యవధిలో 2.4 లక్షల టికెట్లు అమ్ముడయినట్లు చెప్పారు. కాగా ఇతర దేశాల వారు మాత్రం అధికారిక విక్రయదారుల నుంచి మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని ఈవెంట్ ఆర్గనైజర్స్ సూచించారు. స్వదేశం బ్రెజిల్ కోసం రెండు లక్షల టికెట్లు కేటాయించామని, తొలి రెండు లక్షల మందికి మాత్రమే ఈ అవకాశం అభిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. రియో డి జనీరో, సావో పోలో, మినాస్ గెరేస్, పరానా ఏరియాల వాళ్లు టికెట్లు కొనుగోలులో మంగళవారం అగ్రస్థానంలో ఉన్నారు. 518 గేమ్స్‌కు గానూ ఇంకా 400 మ్యాచ్‌లకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. రియో ఒలింపిక్స్ 2016 ఆగస్టు 5-21 తేదీల మధ్య నిర్వహించనున్న విషయం విదితమే. దక్షిణ అమెరికాలో జరగనున్న తొలి ఒలింపిక్ గేమ్స్ ఇవే కావడం గమనార్హం. -
సచిన్ '200 టెస్టు' టిక్కెట్ల విక్రయానికి బ్రేక్
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ వీడ్కోలు, చరిత్రాత్మక 200వ టెస్టు టిక్కెట్ల విక్రయానికి బ్రేక్ పడింది. సోమవారం ఆన్లైన్లో టిక్కెట్లను విక్రయానికి ఉంచిన కాసేపటికే సాంకేతిక కారణాల వల్ల వెబ్సైట్ పనిచేయడం మానేసింది. దీంతో టిక్కెట్లను గురువారం నుంచి అమ్మాలని నిర్ణయించారు. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే భారత్-వెస్టిండీస్ రెండో టెస్టు అనంతరం సచిన్ కెరీర్‌కు గుడ్ బై చెప్పనున్నాడు. దీంతో సచిన్ చివరి మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు అమితాసక్తి చూపుతున్నారు. టిక్కెట్ల ధరలను 500, 1000, 2500 రూపాయలుగా నిర్ణయించారు. ఆన్లైన్లో ఒక్కొక్కరికి రెండేసి టిక్కెట్లను మాత్రమే విక్రయించనున్నారు. ముంబై క్రికెట్ సంఘం అధికారిక వెబ్సైట్ KyaZoonga.Comలో టిక్కెట్లను అందుబాటులో ఉంచుతారు.