సచిన్ '200 టెస్టు' టిక్కెట్ల విక్రయానికి బ్రేక్
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ వీడ్కోలు, చరిత్రాత్మక 200వ టెస్టు టిక్కెట్ల విక్రయానికి బ్రేక్ పడింది. సోమవారం ఆన్లైన్లో టిక్కెట్లను విక్రయానికి ఉంచిన కాసేపటికే సాంకేతిక కారణాల వల్ల వెబ్సైట్ పనిచేయడం మానేసింది. దీంతో టిక్కెట్లను గురువారం నుంచి అమ్మాలని నిర్ణయించారు.
ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే భారత్-వెస్టిండీస్ రెండో టెస్టు అనంతరం సచిన్ కెరీర్కు గుడ్ బై చెప్పనున్నాడు. దీంతో సచిన్ చివరి మ్యాచ్ను వీక్షించేందుకు అభిమానులు అమితాసక్తి చూపుతున్నారు. టిక్కెట్ల ధరలను 500, 1000, 2500 రూపాయలుగా నిర్ణయించారు. ఆన్లైన్లో ఒక్కొక్కరికి రెండేసి టిక్కెట్లను మాత్రమే విక్రయించనున్నారు. ముంబై క్రికెట్ సంఘం అధికారిక వెబ్సైట్ KyaZoonga.Comలో టిక్కెట్లను అందుబాటులో ఉంచుతారు.