'దేవర' రికార్డ్.. రిలీజ్‌కి ముందే అన్ని కోట్ల వసూళ్లు! | Jr NTR Devara Movie Pre-Sales And Collection | Sakshi
Sakshi News home page

Devara Pre Sale: ఇక్కడ 20.. అమెరికాలోనూ 20కి పైనే!

Published Wed, Sep 25 2024 1:46 PM | Last Updated on Wed, Sep 25 2024 2:51 PM

Jr NTR Devara Movie Pre-Sales And Collection

తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అనుకోని విధంగా రద్దయింది. ఇవన్నీ కాదన్నట్లు ట్రైలర్స్ చూసి సోషల్ మీడియాలో ట్రోలింగ్. దీంతో చాలామంది 'దేవర'పై తక్కువ అంచనాలు వేశారు. కానీ ఊహించని విధంగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. మన దేశం, ఓవర్సీస్‌లో విడుదలకి ముందే కోట్ల వసూళ్లు సాధిస్తోంది.

(ఇదీ చదవండి: 'దేవర' ఓటీటీ.. ఆ రెండు హిట్ సినిమాల రూట్‌లో!)

ఆదివారం రెండో ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. సోమవారం నుంచి టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో టికెట్స్ సేల్ ద్వారా రూ.18 కోట్ల మేర వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్‌లోనూ ప్రీమియర్స్ పడకముందే రెండున్న మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది. అంటే దాదాపు రూ.17 కోట్లు అనమాట.

సినిమా రిలీజ్‌కి మరో రోజు గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఇండియా, ఓవర్సీస్‌లో రూ.20 కోట్ల సేల్ దాటేయడం పక్కా అనిపిస్తోంది. మరోవైపు తొలిరోజు కలెక్షన్స్‌లోనూ 'దేవర' రికార్డులు సృష్టించడం గ్యారంటీ. ఎందుకంటే అర్థరాత్రి 12, 1 గంట నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోలు పడబోతున్నాయి. హిట్ టాక్ వస్తే మాత్రం 'దేవర'ని ఆపడం కష్టమవుతుంది.

(ఇదీ చదవండి: ‘దేవర’ నిర్మాతలకు ఏపీ హైకోర్టు షాక్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement