ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్టీఆర్ 'దేవర' మేనియానే. ఆన్‌లైన్‌లో పెట్టిన టికెట్స్ పెట్టినట్లు సేల్ అయిపోతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' లాంటి హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఉత్తరాదిలోనూ అంచనాలు బాగానే ఉన్నాయి. సరే ఇవన్నీ పక్కనబెడితే 'దేవర' ఓటీటీ స్ట్రీమింగ్ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
(ఇదీ చదవండి: ‘దేవర’ నిర్మాతలకు ఏపీ హైకోర్టు షాక్!)
ఇప్పుడొస్తున్న సినిమాల్ని కొనే విషయమై ఓటీటీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కొన్నిసార్లు హిట్ సినిమాలు కూడా మరీ నెలరోజుల్లోనే వస్తున్నాయి. కొన్నిసార్లు మాత్రం దాదాపు రెండు నెలల తర్వాత స్ట్రీమింగ్ అవుతున్నాయి. 'హనుమాన్', 'కల్కి' చిత్రాలు ఇలా 8 వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి వచ్చాయి. ఇప్పుడు వీటినే 'దేవర' ఫాలో అయిపోతున్నాడు.
'దేవర' ఓటీటీ హక్కుల్ని ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.155 కోట్లు పెట్టి మరీ అన్ని భాషల హక్కుల్ని కొనుగోలు చేసిందని టాక్. మరోవైపు ఉత్తరాదిలోనూ మల్టీఫ్లెక్స్‌ల్లో సినిమా ప్రదర్శితం కావాలంటే కచ్చితంగా 8 వారాల ఓటీటీ నిబంధన పాటించింది. 'దేవర' నార్త్ మల్టీఫ్లెక్స్‌ల్లో షోలు పడుతున్నాయి. కాబట్టి దాదాపు 50 రోజుల తర్వాత ఓటీటీలోకి రావడం గ్యారంటీ.
(ఇదీ చదవండి: ఫ్యాన్ వార్స్ చేయొద్దు.. 'దేవర'పై నిర్మాత పోస్ట్ వైరల్)
Comments
Please login to add a commentAdd a comment