ఫ్యాన్ వార్స్ చేయొద్దు.. 'దేవర'పై నిర్మాత పోస్ట్ వైరల్ | Producer Naga Vamsi Advice NTR Fans On Devara Movie Release | Sakshi
Sakshi News home page

Devara Movie: అభిమానుల మధ్య గొడవ.. సలహా ఇచ్చిన నిర్మాత

Sep 25 2024 10:41 AM | Updated on Sep 25 2024 11:19 AM

Producer Naga Vamsi Advice NTR Fans On Devara Movie Release

ఎన్టీఆర్ 'దేవర' మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ తెరవగా.. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో ఈ మూవీపై ఇప్పటికే ట్రోలింగ్ ఆగట్లేదు. మిగతా హీరోల అభిమానులు కొందరు ఇప్పటికీ 'దేవర'పై ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ విషయమై నిర్మాత నాగవంశీ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఫ్యాన్ వార్స్ వద్దని సలహా ఇచ్చారు.

‍'తారక్ అన్న చాలా గ్యాప్ తర్వాత మంచి ఎమోషనల్ కంటెంట్‌తో వస్తున్నారు. అతడి వరకు మనకు గుడ్ కంటెంట్ రెడీ చేశాడు. చాన్నాళ్ల తర్వాత ఆంధ్రాలోనూ బెన్‌ఫిట్ షోలు పడుతున్నాయి. ఈ సందర్భంగా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు (ఫ్యాన్స్) కాస్త బాధ్యతతో ప్రశాంతంగా ఉండండి. అనవసరమైన ఫ్యాన్ వార్స్ చేయొద్దు. ఇలా ట్రోల్ చేయడం వల్ల మీకు సరదాగా అనిపిస్తుందేమో గానీ తర్వాత అది మన హీరోలకే ఇబ్బందిగా మారొచ్చు'

(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి)

'అందరి హీరోల ఫ్యాన్స్‌కు ఒకటే చెబుతున్నా. ఫ్యాన్ వార్స్ ఆపండి, సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్, సినిమా గురించి నెగిటివ్‌గా చెప్పడం లాంటివి ఈ సినిమాతోనైనా ఆపేద్దాం. అలానే సినిమా చూసేవాళ్లందరూ వాటిని వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. మీ పక్కనోళ్లని కూడా వీడియోలు తీస్తుంటే ప్రోత్సాహించొద్దు' అని నిర్మాత నాగవంశీ పోస్ట్ పెట్టారు.

'గుంటూరు కారం' సినిమా తీసిన నిర్మాత నాగవంశీ.. 'దేవర' సినిమా తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొన్నారు. ఈ సంస్థ ద్వారా ఆంధ్రా, తెలంగాణలో థియేటర్లలో రిలీజ్ కానుంది. గతంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో నాగవంశీ ఓ సినిమా అనౌన్స్ చేశారు. కాకపోతే అది సెట్స్‌పైకి రాలేదు.

(ఇదీ చదవండి: 'భారతీయుడు' హీరోయిన్ విడాకులు.. భర్తకు ఇష్టం లేకపోయినా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement