'భారతీయుడు' హీరోయిన్ విడాకులు.. భర్తకు ఇష్టం లేకపోయినా! | Actress Urmila Matondkar Files For Divorce From Husband Mohsin After 8 Years Of Marriage, Deets Inside | Sakshi
Sakshi News home page

Urmila Matondkar Divorce: ఎనిమిదేళ్ల పెళ్లి బంధానికి ఎండ్ కార్డ్

Published Wed, Sep 25 2024 8:22 AM | Last Updated on Wed, Sep 25 2024 9:22 AM

Actress Urmila Matondkar Divorce With Husband Mohsin

రాంగోపాల్ వర్మ 'రంగీలా' సినిమాతో దేశవ్యాప్తంగా హీరోయిన్‪‌గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఊర్మిళ మతోండ్కర్. హిందీతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి పేరు సంపాదించింది. ఇప్పుడు ఈమెనే విడాకుల కోసం అప్లై చేసింది. భర్తకు ఇష్టం లేకపోయినా సరే ఈమె విడిపోవాలని అనుకుంటోందట. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ముంబైలో పుట్టి పెరిగిన ఊర్మిళ.. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. 'కర్మ' మూవీతో పరిచయమైంది. కొన్నాళ్ల తర్వాత హీరోయిన్‌గా మారింది. రాంగోపాల్ వర్మ తీసిన 'రంగీలా'.. ఈమెకు ఎక్కడలేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీని తర్వాత జుదాయి, సత్య తదితర చిత్రాలతో స్టార్ అయిపోయింది. తెలుగు తమిళంలోనూ అంతం, గాయం, భారతీయుడు, అనగనగా ఒక రోజు లాంటి మూవీస్ చేసింది.

(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి)

పెళ్లి-ఫ్యామిలీ విషయానికొస్తే.. 2014లో ఓ పెళ్లిలో కశ్మీరి బిజినెస్‌మ్యాన్ మోసిన్ అక్తర్‌ని కలిసింది. అలా మొదలైన వీళ్ల పరిచయం రెండేళ్లు తిరిగేసరికి పెళ్లి అనే బంధంగా మారింది. ముంబైలోని ఊర్మిళ ఇంట్లో అతికొద్ది మంది సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఇప్పటివరకు అంటే దాదాపు ఎనిమిదేళ్ల పాటు బాగానే ఉన్నారు. గత కొన్నాళ్ల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. నాలుగు నెలల క్రితం కోర్టులో విడాకుల కోసం ఊర్మిళ అప్లై చేసిందట. తాజాగా ఈ విషయం బయటపడింది. సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటోందని, కానీ భర్త ఇది నచ్చకపోవడంతో విడాకులు తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

2018లో చివరగా 'బ్లాక్ మెయిల్' సినిమాలో కనిపించిన ఊర్మిళ.. 2019లో రాజకీయాల్లోకి వెళ్లింది. తొలుత కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత ఏడాది శివసేన పార్టీలో చేరిపోయింది. అక్కడ కూడా అచ్చిరాకపోవడంతో తిరిగి సినిమాల్లోకి రావాలనుకుంటోంది. ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు ఊర్మిళ జడ్జిగా వ్యవహరిస్తోంది.

(ఇదీ చదవండి: 'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ))

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement