యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి | Shocking Facts Revealed In Youtuber Harsha Sai Police Case Latest Updates Inside | Sakshi
Sakshi News home page

Harsha Sai Case Updates: హర్షసాయిపై అత్యాచారం కేసు.. రహస్యంగా వీడియోలు తీసి

Published Wed, Sep 25 2024 9:17 AM | Last Updated on Wed, Sep 25 2024 11:37 AM

Youtuber Harsha Sai Police Case Latest Updates

యూట్యూబర్ హర్షసాయిపై ఓ అమ్మాయి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఇతడిపై అత్యాచారం కేసు నమోదైంది. బాధిత యువతి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు.. హర్షసాయిపై 328, 376 (2) 354 , 376ఎన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే బాధిత యువతి స్టేట్‌మెంట్‌ని రికార్డు చేశారు. అలానే కొండాపూర్‌లోని ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. కేసు నమోదు అయినప్పటి హర్షసాయి పరారీలో ఉన్నాడు. ఇతడి తండ్రి రాధాకృష్ణ కూడా అందుబాటులో లేరు.

చాలామంది డబ్బులు, వస్తువులు పంచుతూ వాటిని వీడియోలుగా తీసి యూట్యూబ్‌లో పెట్టే హర్షసాయికి మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఇతడిని అభిమానించే వాళ్లు బోలెడు మంది. అలాంటిది ఇతడిపై ఇప్పుడు ఓ యువతి కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. ముంబైకి చెందిన ఈమె సినిమా అవకాశాల కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. తెలుగు రియాలిటీ షోలోనూ పాల్గొంది. ఆ తర్వాత ప్రైవేట్ పార్టీలో హర్షసాయి కలిశారు. ఫ్రెండ్‌షిప్ పేరు చెప్పి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అలా నమ్మబలికి అత్యాచారం కూడా చేశాడు.

(ఇదీ చదవండి: 'భారతీయుడు' హీరోయిన్ విడాకులు.. భర్తకు ఇష్టం లేకపోయినా!)

యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా నగ్నచిత్రాలు సేకరించి ఆమెని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అంతకుముందే వీళ్లిద్దరి హీరోహీరోయిన్లుగా గతేడాది సెప్టెంబరులో ఓ సినిమా మొదలైంది. ఆ తర్వాత ఏకంగా రూ.2 కోట్లు వరకు ఆమె దగ్గర నుంచి తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఈమెని మోసం చేశాడు. దీంతో బాధిత యువతి పోలీసులని ఆశ్రయించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న హర్షసాయి, అతడి తండ్రి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరో ట్విస్ట్
అయితే ఈ కేసులో కీలక ట్విస్ట్ ఇప్పుడు బయటపడింది. తనని హీరోగా పెట్టి తీసే 'మెగా' సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసమే హర్ష సాయి ఇంతలా తెగించాడట. ఈ సినిమాకు బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది. కాపీ రైట్స్ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. బాధితురాలికి మత్తు మందు ఇచ్చి హర్షసాయి అత్యాచారం చేశాడు. ఆ వీడియోలని సీక్రెట్‌గా రికార్డ్ చేశాడు. కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతానని బెదిరించినట్లు సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది.

(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా చీప్ బిహేవియర్.. బండారం బయటపెట్టిన యష్మి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement