
సాక్షి, విశాఖపట్నం: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా జరుగనున్న రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు సంబంధించి ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాలు శుక్రవారం ప్రారంభమవుతాయని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) కార్యదర్శి సీహెచ్ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఈనెల 8న ఎలిమినేటర్ మ్యాచ్... 10న క్వాలిఫయర్–2 మ్యాచ్ జరుగుతాయి.
టికెట్లను www.eventsnow.com వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి కొనుగోలు చేయాలి. బీసీసీఐ టికెట్ల ధరలను రూ. 500, 1000, 1500, 1750, 3500, 7500గా నిర్ణయించింది. తొలి అంతస్తులోని కార్పొరేట్ బాక్స్‌లో ఒక్కో టికెట్ రూ. 9000కు.. రెండో అంతస్తులోని కార్పొరేట్ బాక్స్‌లో ఒక్కో టికెట్ రూ. 5000కు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment