
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 23న జరుగనున్న ఇండియా, ఆస్ట్రేలియా టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కోసం 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి పేటీఎం (insider.in) లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు.
అదేవిధంగా 17, 18 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలోని ‘బి’ గ్రౌండ్, వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తామని తెలిపారు.
ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన వారు వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల 22వ తేదీ వరకు, అదేవిధంగా విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలోని ‘బి’ గ్రౌండ్ లో ఉన్న కౌంటర్ లో 23వ తేదీ వరకు రీడీమ్ చేసుకోవచ్చని తెలిపారు.
టికెట్ ధరలు ఇలా.. రూ. 600/–, రూ. 1,500/–, రూ. 2000/–, రూ. 3,000/–, రూ. 3,500/–, రూ. 6000/– విలువ గల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
మ్యాచ్ తేదీ: నవంబర్ 23
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20
Comments
Please login to add a commentAdd a comment