Gopinath Reddy
-
ప్రతిభ ఉన్న వారికే గుర్తింపు.. ఏపీఎల్-3 వేలంలో వాళ్లు సైతం!
సాక్షి, విశాఖపట్నం: ప్రతిభ ఉన్న వారికే గుర్తింపు దక్కుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి అన్నారు. అదే విధంగా క్రికెట్లో క్రమశిక్షణ ఎంతో అవసరం అని పేర్కొన్నారు.వీడీసీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపు ముగింపు సమావేశం శనివారం జరిగింది. విశాఖలోని డా. వైఎస్సార్ ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ప్రతిభ కలిగి.. గుర్తింపులేని క్రికెటర్లకు రైజింగ్ స్టార్స్ పేరుతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇటీవల చక్కటి వేదిక కల్పించాం.దీంతో ఏసీఏ విడుదల చేసిన వేలం అర్హత జాబితాలో లేని ఆటగాళ్లకు మరో అవకాశం వచ్చింది. ఇందులో భాగంగా మరోసారి ట్రయల్స్ నిర్వహించి ప్రతిభ చూపిన ఏడుగురికి ఏపీఎల్–3 వేలంలో స్థానం కల్పించాం’’ అని తెలిపారు.అదే విధంగా... ప్రతి క్రీడాకారుడి గణాంకాలతో కూడిన పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు వీలుగా ఈసారి సరికొత్త సాఫ్ట్ వేర్‌ను వినియోగిస్తున్నట్లు ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. అనంతరం క్రీడాకారులకు సర్టిఫికెట్లు, కోచ్‌లకు జ్ఞాపికలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ గేమ్ డెవలప్మెంట్ జనరల్ మేనేజర్ ఎం.ఎస్.కుమార్, వీడీసీఏ అధ్యక్ష, కార్యదర్శులు పి.విష్ణుకుమార్‌రాజు, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు -
APL: సీజన్-3 కి సిద్ధం.. లీగ్ ముఖ్య ఉద్దేశం అదే: ఏసీఏ
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 నిర్వహణకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సిద్దమవుతోంది. గత రెండు ఎడిషన్లను విజయవంతంగా నిర్వహించిన ఏసీఏ ఈసారి కూడా ఆరు జట్లతో లీగ్‌ను కొనసాగించనుంది. ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగుతాయని తెలిపారు. ఈ జట్ల మధ్య కడప, విశాఖ ప్రాంతాలలో మొత్తం 19 మ్యాచ్ లు నిర్వహించనున్నట్లు గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘జోన్ లెవల్ క్రీడాకారులకి గుర్తింపు తీసుకొని రావడమే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ముఖ్య ఉద్దేశ్యం. ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ జరగడం చాలా సంతోషకరం. మూలాల నుంచి అభివృద్ధి చేసుకుంటూ వస్తేనే విజయవంతమవుతాం.మూడో సీజన్ తర్వాత నాలుగో సీజన్ కూడా సజావుగా నిర్వహించాలని భావిస్తున్నాం. మంగళగిరిలో కూడా మ్యాచ్‌లు జరపాలని ప్రణాళికలు రచిస్తున్నాం. నవనీత్ కృష్ణ ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆక్షన్ లో పాల్గొంటున్నారు.విశాఖ, కడప, మంగళగిరి లో వెయ్యి మందిని గుర్తించి స్క్రీనింగ్ చేశాం. ఇక సీజన్-1 స్టార్ స్పోర్ట్స్ తెలుగులో బ్రాడ్ కాస్టింగ్ చేశాం. కొన్ని అనివార్య కారణాల వలన సీజన్-2ను తెలుగులో ప్రసారం చేయలేకపోయాం. అయితే, ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. బీసీసీఐ గైడ్‌లైన్స్‌తో ముందుకు వెళ్తున్నాం. ఆంధ్ర ప్రదేశ్‌లో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. స్పోర్ట్స్ మెకానిక్ అనే సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకుని వస్తున్నాం’’ అని తెలిపారు. -
విశాఖలో ఇంటిగ్రేటెడ్ క్రికెట్ స్టేడియం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిం చనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథ్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న వైఎస్సార్ క్రికెట్ స్టేడియం సామర్థ్యం 27 వేల లోపు ఉందని, క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా మరో ప్రపంచ స్థాయి స్టేడియాన్ని నిర్మిస్తున్నామని, దానికి త్వరలోనే శంకుస్థాన చేస్తామని తెలిపారు. విశాఖ స్టేడియంలోని బి గ్రౌండ్లో ఇండోర్ స్టేడియం నిర్మిస్తామన్నారు. ఆయన శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ఏసీఏ క్రికెట్ మైదానాలను అభివృద్ధి చేస్తామని, ప్రతి జోన్‌కు ఒక స్టేడియం నిర్మిస్తామని తెలిపారు. మంగళగిరి స్టేడియాన్ని నెమ్మదిగా అభివృద్ధి చేస్తూ దేశవాళీ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ రూ.10 కోట్లతో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కోర్టు కేసులు పరిష్కరించి, ఇతర మౌలిక సదుపాయాలు కలి్పంచి అంతర్జాతీయ మ్యాచ్‌లకు సిద్ధం చేస్తామన్నారు. విశాఖలో మార్చిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మూడు జోన్లలోనూ ఏపీఎల్ మ్యాచ్‌లు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండు సీజన్లు విజయవంతమయ్యాయని, మూడో సీజన్‌ను విశాఖ, విజయవాడ, కడపలో మూడు జోన్లలోనూ నిర్వహిస్తామని చెప్పారు. ఏపీఎల్ ద్వారా ప్రతిభగల యువ క్రికెటర్లు వెలుగులోకి వచి్చ, ఐపీఎల్ జట్లలో స్థానం సంపాదించారన్నారు. దేశంలో తొలిసారిగా మహిళా ఏపీఎల్ నిర్వహణతో ఏపీకి ప్రత్యేక గుర్తింపు దక్కిందన్నారు. ఉమెన్ ఏపీఎల్ స్ఫూర్తితోనే బీసీసీఐ ఉమెన్ ప్రీమియర్ లీగ్‌ను ప్రవేశపెట్టిందని అన్నారు. దేశంలోనే ఏకైక మహిళా క్రికెట్ అకాడమీ ఉన్న రాష్ట్రం ఏపీ అని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే అండర్–14 ఇంటర్ క్లబ్ క్రికెట్ లీగ్‌లు ప్రారంభించామని, త్వరలో 175 నియోజకవర్గాల్లో మెగా స్కూల్ క్రికెట్ లీగ్‌లు నిర్వహిస్తామన్నారు. సుమారు 20 వేల మంది యువ క్రికెటర్లు వారి ప్రతిభను ప్రదర్శించేలా విధివిధానాలను రూపొందిస్తున్నామన్నారు. ఆ్రస్టేలియా, ఇంగ్లాండ్‌లో శిక్షణ.. ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. జాతీయ జట్టులో చోటు సంపాదించేలా ప్రతిభ గల క్రీడాకారులకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో వరల్డ్ క్లాస్ శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. క్రికెటర్లతో పాటు కోచ్‌లకు కూడా ఆటలో మెళకువలు, ఫిట్నెస్ కోసం భారత జట్టు మాజీ కెపె్టన్ రవిశాస్త్రి, మాజీ బౌలింగ్ కోచ్ శేఖర్ భరత్‌కు చెందిన ‘కోచింగ్ బియాండ్’ సంస్థతో ఏసీఏ ఒప్పందం చేసుకుందన్నారు. అకాడమీలు, కోచింగ్ క్యాంప్‌లలో శిక్షణ తీసుకున్న విద్యార్థులు పౌష్టికాహారం కోసం ఇంటి దగ్గర ఆర్థికంగా ఇబ్బంది పడకుండా నెలకు రూ.3 వేల చొప్పున 400 మంది క్రికెటర్లకు ఏటా రూ.1.50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఏసీఏ సిబ్బందితో పాటు క్రికెటర్లకు కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించామన్నారు. బీసీసీఐ పరిధిలోకి రాని రంజీ మాజీ క్రికెటర్లకు నెలకు రూ.10 వేలు చొప్పున ఏడాదికి రూ.90 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఆర్.వి.చంద్రమౌళి చౌదరి, సీఈవో శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Vizag: ఐపీఎల్ అవకాశాలు పెంచడమే లక్ష్యంగా! ఇప్పుడు లెజెండ్స్ లీగ్‌లో..
సాక్షి, విశాఖపట్నం: క్రికెట్ అభివృద్ధి కోసం అన్ని జిల్లాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణను సైతం దిగ్విజయంగా పూర్తి చేస్తున్న తాము.. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ) ఆతిథ్యంలోనూ భాగం కానున్నామని హర్షం వ్యక్తం చేశారు. దాదాపు వంద మంది క్రికెటర్లు నగరానికి క్రికెట్ ప్రమోషన్లో భాగంగా విశాఖలోని పీఎంపాలెంలో గల డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మూడు ఎల్ఎల్సీ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం నుంచి సోమవారం వరకు ఈ మ్యాచ్‌లు జరుగుతాయని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన దాదాపు వంద మంది క్రికెటర్లు టోర్నమెంట్లో పాల్గొననున్నారని గోపినాథ్‌రెడ్డి తెలిపారు. భారత్- ఆస్ట్రేలియా, భారత్- సౌతాఫ్రికా మ్యాచ్‌లు గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, సదరన్ సూపర్ స్టార్స్, అర్బన్‌రైజర్స్, హైదరాబాద్ జట్లు ఇక్కడ జరిగే మ్యాచ్‌లలో పాల్గొంటాయని వెల్లడించారు. అదే విధంగా... ఏసీఏ ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చి 19న ఇండియా – ఆస్ట్రేలియా వన్డే, నవంబర్ 23న ఇండియా – ఆస్ట్రేలియా టీ–20, గతేడాది జూన్ 14న ఇండియా- సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య టీ–20 మ్యాచ్‌లను దిగ్విజయంగా నిర్వహించామని ఈ సందర్భంగా గోపినాథ్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఐపీఎల్ అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ‘‘ఇవే గాకుండా వైజాగ్‌లో ఫ్లడ్ లైట్స్‌లో ఏపీఎల్, విజయనగరంలో డబ్ల్యూపీఎల్ టోర్నమెంట్ జరిపి ఆంధ్ర క్రీడాకారులకు ఐపీఎల్ అవకాశాలను పెంచడం జరిగింది. పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏపీలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో వరల్డ్ కప్ వన్డే మ్యాచ్ సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ కోసం ఏసీఏ ఆధ్వర్యంలో పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేశాం. క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’’ అని గోపినాథ్‌రెడ్డి తెలిపారు. లెజెండ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్.. ►డిసెంబరు- 2 సాయంత్రం 7 గంటలకు: ఇండియా క్యాపిటల్స్ – మణిపాల్ టైగర్స్ ►డిసెంబరు- 3 మధ్యాహ్నం 3 గంటలకు: గుజరాత్ జైంట్స్–సదరన్ సూపర్‌స్టార్స్ ►డిసెంబరు- 4 సాయంత్రం 7 గంటలకుః మణిపాల్ టైగర్స్–అర్బన్ రైజర్స్ హైదరాబాద్. కాగా మాజీ క్రికెటర్ల సారథ్యంలో సాగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ నవంబరు 18న మొదలైంది. ఈ టీ20 లీగ్‌లో ఫైనల్ మ్యాచ్ డిసెంబరు 9న సూరత్‌లో జరుగనుంది. చదవండి: ఆడేది 3 మ్యాచ్‌లు మాత్రమే.. 17 మంది ఎందుకు? భారత సెలక్టర్లపై ప్రశ్నల వర్షం -
ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. రేపటి నుంచి టికెట్ల విక్రయం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 23న జరుగనున్న ఇండియా, ఆస్ట్రేలియా టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కోసం 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి పేటీఎం (insider.in) లింక్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు విక్రయించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా 17, 18 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలోని ‘బి’ గ్రౌండ్, వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తామని తెలిపారు. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల 22వ తేదీ వరకు, అదేవిధంగా విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలోని ‘బి’ గ్రౌండ్ లో ఉన్న కౌంటర్ లో 23వ తేదీ వరకు రీడీమ్ చేసుకోవచ్చని తెలిపారు. టికెట్ ధరలు ఇలా.. రూ. 600/–, రూ. 1,500/–, రూ. 2000/–, రూ. 3,000/–, రూ. 3,500/–, రూ. 6000/– విలువ గల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మ్యాచ్ తేదీ: నవంబర్ 23 ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20 -
అంతర్జాతీయ క్రికెటర్లను చేయడమే లక్ష్యం
విజయవాడ స్పోర్ట్స్: ‘మన ఆంధ్రా–మన ఏపీఎల్’ సీజన్–2ను పురస్కరించుకుని ఏసీఏ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో నిర్వహించిన 3కే రన్ ఉత్సాహంగా సాగింది. వందలాది మంది క్రికెట్ అభిమానులతోపాటు ఏసీఏ కార్యదర్శి గోపీనా«థ్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎ.రాకేష్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఎన్.గీత, కేవీ పురుషోత్తం, జితేంద్రనా«థ్శర్మ, బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, ఏసీఏ మాజీ కార్యదర్శులు అరుణ్‌కుమార్, దుర్గాప్రసాద్, కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ అడ్‌హక్ కమిటీ చైర్మన్ టి.త్రినాథరాజు, కన్వినర్ రవిశంకర్, పలువురు కోచ్‌లు పాల్గొన్నారు. గోపీనాథ్‌రెడ్డి టార్చ్ వెలిగించి ఈ రన్‌ను ప్రారంభించారు. అనంతరం టార్చ్‌ను అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి ఎండీ షబనం, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యురాలు గీతకు అందజేశారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బందరు రోడ్డు, టిక్కిల్ రోడ్డు మీదుగా సిద్ధార్థ జంక్షన్ వరకు వెళ్లి, తిరిగి స్టేడియం వద్దకు ఈ రన్ చేరుకుంది. గోపీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారులను తయారు చేయడమే ఏసీఏ ప్రధాన లక్ష్యమని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో విశాఖలో ఈ నెల 16 నుంచి 27వ తేదీ వరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్–2 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పంద్రాగస్టు సందడి ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం స్వాతంత్య్ర దిన వేడుకలకు ముస్తాబవుతోంది. పరేడ్ కోసం సాధన చేస్తున్న పోలీ సులు, వివిధ రకాల శకటాలు తయారు చేస్తున్న కార్మికులతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. – సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ -
APL ముఖ్య ఉద్దేశ్యం ఇదే.. దేశం మొత్తం మన లీగ్ వైపు చూస్తుంది
-
IPL New AP Team: ఐపీఎల్లో ‘ఆంధ్రప్రదేశ్’
విశాఖ స్పోర్ట్స్:ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఐపీఎల్.. క్రికెట్ లీగ్ ప్రపంచంతో దానికున్న క్రేజ్ ప్ర త్యేకం. ఇందులో ఆడే జట్ల యాజమాన్యాలకు చాలా శక్తి సామర్థ్యాలు ఉండాలి. వనరులూ ఉండాలి. విశాఖలో వైఎస్సార్ ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియం, ప్రతిభ కలిగిన యువత, మంచి పారిశ్రామికవేత్తలు, అన్ని వనరులు ఉన్న ఏపీకి ఐపీఎల్లో ప్రాతినిథ్యం వహించే జట్టును తయారుచేయాలని సీఎం జగన్ కృత నిశ్చ యంతో ఉన్నారు. విశాఖ పీఎం పాలెంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ఆవరణలో మహానేత విగ్రహావిష్కరణ సందర్భంగా ఐపీఎల్ ఏపీ జట్టు ఏర్పాటుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కు దిశానిర్దేశం చేస్తూ రోడ్ మ్యాప్‌కు సూచనలు చేశారు. దీంతో ఐపీఎల్లో ఏపీ జట్టు కోసం ఏసీఏ కార్యాచరణకు దిగింది. బీసీసీఐ మరోసారి కొత్త ఫ్రాంచైజీలకు అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తుండటంతో బిడ్డింగ్ దక్కించుకునేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి పర్యవేక్షణలో కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి స్థానిక పారిశ్రామికవేత్తలతో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. సీఎం ఆదేశాలతో ప్రణాళిక భారత్‌లో ఐపీఎల్‌కు క్రేజ్ పెరిగిపోయింది. ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లు ఆడేందుకు యువత ఉత్సాహం చూపిస్తున్నారు. ఐపీఎల్లో ఏపీకి ఓ ఫ్రాంచైజీ జట్టు ఉంటే ఏపీలోని ఆటగాళ్లకు మంచి అవకాశాలు వస్తాయి. మరింత మంది యువ ఆటగాళ్లకు ప్రోత్సాహం అందుతుంది. ఇదే ఆలోచనను సీఎం జగన్ ఏసీఏ ముందుంచారు. దీనిపై రోడ్‌మ్యాప్ తయారు చేయాలని ఆదేశించారు. ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. కార్పొరేట్ల జట్లు ఐపీఎల్లో ఫ్రాంచైజీ పొందటం అంటే కోట్లతో వ్యవహారం. బీసీసీఐ నిబంధనల మేరకు ఇందులో ఏ గుర్తింపు సంఘం గానీ, ప్రభుత్వ ప్రమేయం గానీ ఉండకూడదు. బీసీసీఐ అనుమతితో జరిగే ప్రైవేట్ సంస్థల టోరీ్ననే ఐపీఎల్. ఆయా రాష్ట్రాల్లోని పెద్ద సంస్థలు, కార్పొరేట్లు ఫ్రాంచైజీకి పోటీపడతాయి. మరో రెండు ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లను ప్రకటించాలంటూ రాష్ట్రాల క్రికెట్ సంఘాలు బీసీసీఐని కోరుతున్నాయి. బీసీసీఐ మరిన్ని జట్లకు అనుమతిస్తే వాటిలో మన రాష్ట్ర జట్లూ ఉండేలా అన్నీ సిద్ధం చేస్తున్నాం. ఏపీకి ఎలా సాధ్యమంటే.. ఏపీ ఫ్రాంచైజీ బిడ్డింగ్ దక్కించుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీ కావాలంటే మనకి ఉండాల్సిన వసతులు, అందుకు ఎవరిని సమాయత్తం చేయాలనే విషయాలపై సీఎం జగన్‌కు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల వైఎస్సార్ విగ్రహావిష్కరణలో సూచనలు ఇస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాకారాన్ని అందిస్తామని చెప్పారు. బిడ్డింగ్ వేసేలా స్థానిక ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను ప్రోత్సహిస్తామన్నారు. వారికి కావాల్సిన మెకానిజం, ఆటగాళ్ల సాధనకు కావాల్సిన గ్రౌండ్స్ , హోమ్ గ్రౌండ్, అకాడమీ, శిక్షణావకాశాలు వంటివి ఏసీఏ సమకూర్చనుంది. ఇందుకోసం సీఎం జగన్ సూచనల మేరకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం. ఇందులో భాగంగానే మెన్, వుమెన్‌లో 20 మంది చొప్పున ఎంపిక జరిగింది. వారిని మూడు కేటగిరీలుగా విభజన చేసి, తదుపరి కార్యాచరణ చేపడుతున్నాం. ఆగస్టులో ఏపీఎల్ రెండో సీజన్‌కు అవకాశం ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) మెన్ ప్రారంభ సీజన్‌కు ఇక్కడ వివిధ ఏజ్ గ్రూప్‌లతో పాటు రంజీలు ఆడిన వారు ఏకంగా 900 మంది ఉన్నారు. వీరితోనే ఆరు జట్లుగా ఏపీఎల్ తొలి సీజన్ జరిగింది. రెండో సీజన్ ఆగస్టులో నిర్వహించేందుకు త్వరలోనే ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ శరత్‌చంద్రారెడ్డి అధ్యక్షతన విశాఖలో సమావేశం కానుంది. వైఎస్సార్ స్టేడియం హోమ్ పిచ్ విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ – వీడీసీఏ స్టేడియం ఇప్పటికే అంతర్జాతీయ టెస్ట్, వన్డే, టీ–20లాంటి అన్ని ఫార్మాట్ క్రికెట్ పోటీలకు వేదికైంది. ప్రపంచ క్రీడా పటంలో పేరు లిఖించుకుంది. క్రికెట్ ఆడే అన్ని దేశాల జట్లు ఈ స్టేడియంలో ఆడాయి. రెండు రాష్ట్రాల ఫ్రాంచైజీ జట్లు గతంలో వైఎస్సార్ స్టేడియంను హోమ్ పిచ్‌గా ప్రకటించి ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాయి. ఇప్పుడు ఏపీ జట్టుకు కూడా ఇదే హోమ్ పిచ్ అవుతుంది. అందువల్ల రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ స్థానిక కార్పొరేట్లు బిడ్డింగ్ వేస్తే ఏపీకి ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టు రావడం పెద్ద కష్టం కాదు. -
మా సినిమాను సమ్మతించారు: డైరెక్టర్
‘‘మా ‘సమ్మతమే’ చిత్రానికి యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది. మా చిత్రం పట్ల ప్రేక్షకుల స్పందన బాగుంది. వారు సినిమాని సమ్మతించారు’’ అని డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి అన్నారు. కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం ‘సమ్మతమే’. కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా ఈ నెల 24న రిలీజైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నేను ఏ కథ చెప్పినా బలమైన పాయింట్ ఉండాలనుకుంటాను. ‘సమ్మతమే’లో అలాంటి పాయింట్ ఉంది. ఈ చిత్రానికి పెట్టిన ప్రతి రుపాయీ వచ్చింది. ఇండస్ట్రీ నుండి నాకు అభినందనలొచ్చాయి.. దర్శకుడిగా రెండు మూడు అవకాశాలు కూడా వచ్చాయి’’ అన్నారు. -
ఆ సినిమాకు మొదట మిశ్రమ రివ్యూలు వచ్చాయి: హీరో
Kiran Abbavaram Speech In Sammathame Movie Success Meet: ''ప్రేక్షకుల వల్లే 'సమ్మతమే' బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇది ప్రేక్షకుల విజయం. నా 'ఎస్ఆర్ కల్యాణ మండపం' సినిమాకు కూడా మొదట్లో మిశ్రమ రివ్యూలు వచ్చాయి. ఆ తర్వాత సినిమా బ్లాక్‌బస్టర్. 'సమ్మతమే' మార్నింగ్ షో తర్వాత మిశ్రమ రివ్యూలు వినిపించాయి. అదేరోజు సాయంత్రం ఓ థియేటర్‌కు వెళ్లి చూస్తే హౌస్‌ఫుల్ అయింది.' అని తెలిపాడు కిరణ్ అబ్బవరం. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం 'సమ్మతమే'. కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా ఈ నెల 24న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో ''డబ్బులుంటే ఎవరైనా సినిమా తీస్తారు. కానీ హిట్ కొట్టండ ముఖ్యం. మా సొంత డబ్బులతో 'సమ్మతమే' తీసి, సూపర్ హిట్ కొట్టడం హ్యాపీగా ఉంది' అని గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ''సమ్మతమే' సినిమాను బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని ప్రవీణ తెలిపారు. చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట? 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. మాస్ హీరోగా గుర్తింపు దక్కింది: ఆకాష్ పూరి -
హీరోయిన్ను సెలక్ట్ చేయడానికి ఐదు నెలలు పట్టింది: హీరో
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ "సమ్మతమే". చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న "సమ్మతమే" చిత్ర విశేషాలివి. "సమ్మతమే" చిత్రానికి మీరెలా సమ్మతమయ్యారు? దర్శకుడు గోపీనాథ్, నేను నాలుగేళ్ళుగా ప్రయాణిస్తున్నాం. హైదరాబాద్‌కు వచ్చి షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పటి నుంచి గోపి నాకు పరిచయం. సినిమా పట్ల ఇద్దరికీ ఒకే అవగాహన, ప్యాషన్ వుంది. ఇద్దరం ఒక్కటిగా తిరిగి సినిమాపై ఇంకా అవగాహన పెంచుకుని, నేర్చుకున్నాం. ఈ క్రమంలో నేను 'రాజా వారు రాణి గారు', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' చేశాను. గోపి అప్పటికే ఇంకా కథని రాస్తున్నాడు. తను సమయం ఎక్కువ తీసుకుంటాడు. స్క్రిప్ట్ చాలా పగడ్బందీగా తయారైన తర్వాత 'సమ్మతమే' స్టార్ట్ చేశాం. ఇలాంటి పాయింట్‌ను ఎవరూ తీయలేదు. సమ్మతమే కథ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే? ట్రైలర్ ఓపెనింగ్‌లోనే ఒక డైలాగ్ వుంటుంది. ఇంటికి మహాలక్షి ఆడపిల్ల. ఆ ఆడపిల్ల లేని ఇల్లు బోసిపోయి వుంటుంది. ఇందులో కథానాయకుడి పేరు కృష్ణ. అతని తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. ఆ ఇంటికి మళ్ళీ ఆడపిల్ల వస్తే కళ వస్తుంది. అందుకే చిన్నప్పుడే 'నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావని'' నాన్నని అడుగుతాడు. పెళ్లిపై అంత శుభసంకల్పం వున్న ఒక క్యారెక్టర్‌కు తన పెళ్లిచూపుల్లో ఎలాంటి అమ్మాయి ఎదురైంది? దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఒక మధ్యతరగతి కుర్రాడు సిటీ నేపథ్యం ఉన్న అమ్మాయి ప్రేమలో పడితే ఎలా వుంటుంది? అనే అంశాలు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ట్రైలర్లో ఒక డైలాగ్‌కు బీప్ సౌండ్ కూడా వేశారు. యూత్‌ను ఆకర్షించడానికా? లేదండీ. ఆ పరిస్థితిలో అతని బాధ ఎక్కువగా వుంటుంది. ఆ భాదలో ఆ మాట ఎవరైనా వాడుతారు. షూటింగ్ చేసినప్పుడు ఆ పదం అవసరమని చేశాం. ట్రైలర్ లో కూడా ఆ పదం వదిలేయవచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎలాంటి ఇబ్బంది వుండకూడదని బీప్ పెట్టి విడుదల చేశాం. సినిమాలో మిగతా నటీనటుల గురించి? సినిమా లో చాలా పెద్ద కాస్ట్ వుంది. సప్తగిరి గారి ఎపిసోడ్ చాలా బావుంటుంది. చాలా మంది మంచి నటులు వున్నారు. సర్ప్రైజ్ కోసం చూపించలేదు. లిమిటెడ్ బడ్జెట్లో ఈ సినిమా చేయాలని అనుకున్నాం. తెలియకుండానే సమ్మతమే పెద్ద సినిమా అయ్యింది. 75 లైవ్ లోకేషన్స్‌లో సినిమా తీశాం. ఎక్కడా రాజీపడలేదు. మీరు చూసినప్పుడు కూడా ఆ రిచ్ నెస్ కనిపిస్తుంది. దర్శకుడు గోపితో ప్రయాణం గురించి? మేము ఇద్దరం అన్నదమ్ముల్లా వుంటాం. నా ప్రతి సినిమా రిలీజ్ కి గోపి ఫ్యామిలీ అంతా వస్తారు. మాఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనేసరికి తెలియకుండానే ఒక కంఫర్ట్ జోన్ వచ్చేసింది. మూడు నాలుగు నెలల వ్యవధిలో కొత్త సినిమాతో వస్తున్నారు కదా.. ఇలా వరుస సినిమాలతో రావడం సరైన వ్యూహమేనా ? నా వరకైతే సరైన వ్యూహమేనని చెప్తాను. హీరోలు ఎక్కువ సినిమాలు చేయడమే కరెక్ట్ అని నా వ్యక్తిగత అభిప్రాయం. వరుసగా సినిమాలు బయటికి వస్తుంటే అందరికీ పని దొరుకుతుంది. అయితే ఒక సినిమాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. నేను వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నప్పటికీ వాటికి కేటాయించే సమయం ఎక్కువ. ప్రతి సినిమాపై చాలా కేర్ తీసుకుంటాను. నా దర్శకులు, నిర్మాతలు బలంగా వుండటం నా అదృష్టం. అనుకున్న సీన్ సరిగ్గా రాకపోతే మళ్ళీ షూట్ చేయడానికి నిర్మాతలు సిద్దంగా వున్నారు. ఇప్పుడు రాబోతున్న నాలుగు సినిమాలు చాలా పెద్ద స్కేల్లో చేశాం. మీ ప్రతి సినిమా మధ్యతరగతి నేపధ్యంలో వుంటుంది కదా ? దీనికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? నాకు ఇలాంటి కథలు నచ్చుతున్నాయేమో. నేను దర్శక నిర్మాతలకు అలా కనిపిస్తున్నానేమో. నాపై ఇలాంటి కథలు చేస్తే వర్క్ అవుట్ అవుతాయని అనుకోవచ్చు. నేను కథ ఎంపిక చేసినప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ పాయింట్లకి మొగ్గు చూపను. నాకు మన మధ్య జరిగే కథలే ఇష్టం. ఇది మనోడి కథరా అనే ఫీలింగ్ ఉన్నప్పుడే నేను ఎక్కువ ఎగ్జయిట్ అవుతాను. ఇలాంటి కథలే ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడతాను. సమ్మతమే టైటిల్ చాలా సాఫ్ట్ గా వుంటుంది కదా.. అందరికీ రీచ్ అవుతుందా లేదా అని చర్చించారా? ఇలాంటి టైటిల్స్ వినగా వినగా వాల్ పోస్టర్‌పై చూడగా చూడగా ఎక్కువగా రీచ్ వుంటుంది. ఉదాహరణకి గీత గోవిందం. సమ్మతమే ఫార్మాట్ కూడా ఇలానే వుంటుంది. బొమ్మరిల్లు లాంటి సినిమాని చూసినపుడు ఎంటర్టైన్మెంట్, లవ్ ని ఫీలవుతూ ఒక మంచి ఫీలింగ్ తో బయటికివస్తాం కదా, అలాంటి వైబ్‌లోనే సమ్మతమే ఉంటుంది. సమ్మతమే టైటిల్ విన్నప్పుడే చాలా ఎగ్జయిట్ ఫీలయ్యాం. 'సమ్మతమే' ఒక అమ్మాయి ఎమోషన్ మీద నడిచే కథ అని చెప్తున్నారు కదా! హీరోయిన్ ని ఎంపిక చేయడానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి ? చాందినీని ఎంపిక చేయడనికి కారణం ? హీరోయిన్ ని ఎంపిక చేసే క్రమంలో చాలా సమయం పట్టింది. దర్శకుడు గోపి ఐదు నెలలు తీసుకున్నాడు. నేను అప్పటికీ ఇంకా తెలిసిన హీరో కాలేదు. కేవలం రాజా వారు రాణి గారు ఒక్కటే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్ కోసం చాలా ఆప్షన్స్ చూశాం. చాలా రిజక్షన్స్ కూడా అయ్యాయి. ఈ క్రమంలో తెలుగమ్మాయి చాందినీ అయితే ఇద్దరి జోడి బావుంటుందని దర్శకుడు గోపి చాందినీని ఫైనల్ చేశారు. ట్రైలర్ లో పోటాపోటీగా మీ సీన్స్ కనిపిస్తున్నాయి.. సెట్స్ లో మీ కెమిస్ట్రీ ఎలా వుండేది ? మీ కెమిస్ట్రీని స్క్రీన్ పై ఎలా బ్యాలెన్స్ చేశారు ? బయట కూడా మేము అలానే వుండటం వలన మాకు అది పెద్ద సమస్య కాలేదు. చాందినీ నాలానే కొంచెం హైపర్ యాక్టివ్ గా వుంటుంది. తన పోష్ కల్చర్ నాకు నిజంగానే తేడా వుండేది. దీంతో నటించాల్సిన అవసరం రాలేదు. (నవ్వుతూ). చాలా సహజంగా వచ్చేసింది. రెట్రో సాంగ్ పెట్టినట్లు ఉన్నారు కదా? దీని కోసం చిన్న లిబర్టీ తీసుకున్నాం. హీరో తనకు అమ్మాయి లేదనే పెయిన్లో ఉన్నపుడు కలలో వెళ్ళే ఒక స్వేచ్ఛ ఉంటుంది. అలా 90 వైబ్స్ కి తీసుకెళ్ళి చేసిన పాట అది. పాట చాలా బాగా వచ్చింది. చాందినీ, మీరు ఇద్దరూ షార్ట్ ఫిలిమ్స్ నుంచే వచ్చారు కదా.. కలసి నటించడం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది. మేము ఎక్కడి నుంచి వచ్చామో మూలాలు తెలుసు. ఆ కంఫర్ట్ జోన్ వుంది. ఆ ఫ్రెష్ నెస్ ని మీరు స్క్రీన్ పై చూస్తారు. కృష్ణ ,శాన్వీ పెయిర్ చూడముచ్చటగా వుంటుంది. ట్రైలర్ చూసి చాలా మంది ఇదే చెప్పారు. మీ కొత్త సినిమాల గురించి? ఆగస్ట్‌లో 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' రిలీజ్ వుంటుంది. సెప్టెంబర్ చివరిలో 'వినరో భాగ్యం విష్ణు కథ' గీత ఆర్ట్స్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ సినిమా వుంటుంది. ఈ ఏడాదిలోనే ఈ మూడు సినిమాలు విడుదలవుతాయి. చదవండి: జూన్ నాలుగో వారంలో విడుదలవుతున్న సినిమాల లిస్ట్ ఇదిగో! హనీమూన్‌కు చెక్కేసిన నయనతార దంపతులు -
సీఎం జగన్‌ను విమర్శించే స్థాయి లోకేష్‌కు లేదు
సాక్షి, నరసరావుపేట: జైలులో ఉన్న రౌడీషీటర్‌ను చూసేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సబ్ జైలుకు వెళ్ళటం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నరసరావుపేటలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎస్సీ మహిళైన తహసీల్దార్ వనజాక్షిని కొట్టిన చింతమనేనిని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు ప్రకటించిన వెంటనే లోకేష్ రౌడీషీటర్‌ను చూసేందుకు రావటం గమనార్హమన్నారు. దీనిని బట్టి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎటువైపు పయనిస్తోందో ప్రజలు గుర్తించాలని కోరారు. గత ప్రభుత్వానికి ముందు, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చింతమనేనిపై 18 కేసులు నమోదయ్యాయన్నారు. జైలులో ఉన్న రౌడీషీటర్ వైఎస్సార్సీపీ వారిపై 18 కేసులు పెట్టించాడన్నారు. పట్టా భూమిలో సిమెంట్ రోడ్డు వేయించాడని, 40 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్న పట్టా భూమిలో శ్మశానం కట్టించాడని చెప్పారు. టీడీపీ రంగులు వేసిన బెంచీలు పగులకొడితే మూడు కేసులు పెట్టించాడన్నారు. ఇలాంటి దౌర్భాగ్యుడి కోసం లోకేష్ జైలుకు వెళ్లి పలకరించాడని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి పులిబిడ్డ సీఎం జగన్మోహన్రెడ్డిపై లోకేష అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే గోపిరెడ్డి తీవ్రంగా ఖండించారు. జగన్మోహన్రెడ్డిని గురించి మాట్లాడే స్థాయి లోకేష్‌కు లేదని చెప్పారు. రాష్ట్రంలో దుబారా ఖర్చు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా పరిపాలన చేస్తున్న సీఎం జగన్‌పై ఈ విధంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. తన తండ్రి చంద్రబాబు రాజకీయాలను అడ్డంపెట్టుకొని లోకేష్ వచ్చాడని, అతని వల్లే పార్టీ భ్రష్టుపట్టిపోతోందని టీడీపీ వారే అనుకుంటున్నారని చెప్పారు. రాజశేఖరరెడ్డి కడుపున పులిలాంటి నాయకుడు పుట్టాడని జగన్‌ను ప్రజలు కీర్తిస్తున్నారన్నారు. -
చొక్కాలు చించుకున్న తమిళనాడు రాజకీయాలు
-
సరుకు రవాణాపై ప్రత్యేక దృష్టి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఆర్టీసీలో సరుకు రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసి దాని ద్వారా మరింత ఆదాయం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆ సంస్థ మార్కెటింగ్ అండ్ కమర్షియల్ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కె.గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో ఆయన జిల్లాలోని 8 డిపోలకు చెందిన రవాణా విభాగ అసిస్టెంట్ డిపో క్లర్క్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరుకు రవాణా వ్యవస్థ ద్వారా మూడు నెలల్లో పశ్చిమ గోదావరి రీజియన్‌లో రూ.19 లక్షల ఆదాయం పొందినట్టు చెప్పారు. సరుకు రవాణాపై ప్రజల్లో అవగాహన కల్పించి మరింత ఆదాయం తీసుకురావడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎస్.ధనుంజయరావు, మార్కెటింగ్ అండ్ కమర్షియల్ డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జీఎస్ఆర్కే మూర్తి, ఏటీఎం కమర్షియల్ సి.శివరామ్ పాల్గొన్నారు. -
తెగిన అనుబంధం
వారిది అన్యోన్య దాంపత్యం.. భర్తే లోకంగా ఆమె, భార్యే ప్రపంచంగా ఆయన బతికారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా తనయ పుట్టింది. ప్రజాసేవకు అవకాశం కలసిరావడంతో ఆయన ప్రోత్సహించారు. ఆమె ప్రజాప్రతినిధిగా ఎన్నికై తమ ప్రాంత ప్రజల కోసం నిత్యం పరితపించేవారు. అయితే ఆ దంపతులపై విధి కన్నుకుట్టింది. వారం కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భర్తను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసుకుని ఇంటికి బయలుదేరారు. మరి కాసేపటిలో ఇంటికి చేరుకుంటామనగా జరిగిన ప్రమాదంలో ఆమెను మృత్యువు కబళించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కృష్ణగిరి/ప్యాపిలి : వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొమ్మిరెడ్డిపల్లె గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్యాపిలి ఎంపీటీసీ-1 సభ్యురాలు బోరెడ్డి శ్రీలత(26) అక్కడిక్కడే దుర్మరణం చెందారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం కరిటికొండ వద్ద వారం కిందట జరిగిన బైక్ ప్రమాదంలో శ్రీలత భర్త గోపీనాథ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఆస్పత్రి నుంచి భర్తను డిశ్చార్జ్ చేసుకుని స్వగ్రామానికి వచ్చేందుకు భర్తతో కలసి ఆమె ప్యాపిలిలో ఆటో ఎక్కారు. అయితే వారు ప్రయాణిస్తున్న ఆటో మార్గమధ్యంలోని బోమ్మిరెడ్డిపల్లె సమీపానికి రాగానే డివైడర్‌ను ఢీకొని బోల్తాకొట్టింది. సంఘటనలో శ్రీలత అక్కడికక్కడే మరణించారు. అదే ఆటోలోని భర్త గోపీనాథ్‌రెడ్డి, బావ రఘునాథరెడ్డి గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న వె ల్దుర్తి ఎస్ఐ నాగేంద్ర తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను, మృతదేహాన్ని డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. చివరి చూపు కోసం.. తమ ప్రజాప్రతినిధి రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాతపడినట్లు తెలియగానే ప్యాపిలి ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. డోన్ ప్రభుత్వస్పాత్రిలో పోస్టుమార్టం అనంతరం శ్రీలత భౌతికకాయాన్ని ప్యాపిలికి తీసుకురాగానే ఆమెను కడసారి చూసుకునేందుకు జనం భారీగా తరలివచ్చారు. ప్యాపిలి సర్పంచ్ గౌసియాబేగం, ఎమ్మెల్యే రాజారెడ్డి పీఓ అంకిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజా నారాయణమూర్తి, మల్లికార్జునరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, బషీర్, సురేంద్ర, ఎస్కే వలి, రమణ తదితరులు శ్రీలతకు నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ అభిమానిగా.. ప్యాపిలికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బోరెడ్డి శ్రీరామిరెడ్డి కుమారుడు గోపీనాథరెడ్డితో కర్ణాటకలోని బళ్లారి సమీపంలో గల కొర్లగొందికి చెందిన జ్యోతి, గోవిందరెడ్డి దంపతుల కుమార్తె శ్రీలత వివాహం ఏడేళ్ల కిందట అయింది. వారికి తనయ అనే కుమార్తె పుట్టింది. వారి కుటుంబం మొత్తం వైఎస్సార్ సీపీ అభిమానులే. ఆ అభిమానమే శ్రీలతను గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేలా చేసింది. ఆమె ప్యాపిలి-1 ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఎంపీపీ రేసులో ఉన్న ఆమెకు, రాజకీయ పరిస్థితులు అనుకూలించలేకపోయాయి. తనయను చూసి తల్లడిల్లి.. రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీలతకు రెండేళ్ల కుమార్తె తనయ ఉంది. ఆమెను తాత బోరెడ్డి శ్రీరామిరెడ్డి ఎత్తుకుని బిగ్గరగా ఏడ్వడం అందరినీ కలచివేసింది. ఇక తన తల్లి రాదని తెలియని ఆ చిన్నారి బిత్తర చూపులు చూస్తుండగా, ‘కన్నా.. మీ అమ్మ ఇక రాదమ్మా’ అంటూ తాత ఆ పసి కూనను గుండెలకు హత్తుకోవడం అక్కడికి వచ్చిన వారి హృదయాలను బరువెక్కించింది. లతా.. ఒక్కసారి పలకవా.. తన కళ్లెదుటే భార్య రక్తపు మడుగులో కొట్టుకుని ప్రాణాలొదలడం చూసి శ్రీలత భర్త గోపీనాథరెడ్డి రోదించిన తీరు పిండేసింది. విగతజీవిగా మారిన భార్యను చూసి ఆయన ‘లతా.. ఒక్కసారి మాట్లాడవా.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావే.. ఒక్కదానివే ఎలా వెళ్లిపోయావురా.. ఇక మన బిడ్డ తనయకు దిక్కెవర్రా... ఆ బిడ్డ అమ్మేదని అడిగితే.. నేనేమని చెప్పగలనురా... అంటూ గోపీనాథరెడ్డి పిచ్చివాడిలా రోదించడం ప్రతి ఒక్కరి కంట కన్నీరు తెప్పించింది. అతన్ని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.