
విశాఖ స్పోర్ట్స్:ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఐపీఎల్.. క్రికెట్ లీగ్ ప్రపంచంతో దానికున్న క్రేజ్ ప్ర త్యేకం. ఇందులో ఆడే జట్ల యాజమాన్యాలకు చాలా శక్తి సామర్థ్యాలు ఉండాలి. వనరులూ ఉండాలి. విశాఖలో వైఎస్సార్ ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియం, ప్రతిభ కలిగిన యువత, మంచి పారిశ్రామికవేత్తలు, అన్ని వనరులు ఉన్న ఏపీకి ఐపీఎల్‌లో ప్రాతినిథ్యం వహించే జట్టును తయారుచేయాలని సీఎం జగన్ కృత నిశ్చ యంతో ఉన్నారు.
విశాఖ పీఎం పాలెంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ఆవరణలో మహానేత విగ్రహావిష్కరణ సందర్భంగా ఐపీఎల్ ఏపీ జట్టు ఏర్పాటుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కు దిశానిర్దేశం చేస్తూ రోడ్ మ్యాప్‌కు సూచనలు చేశారు. దీంతో ఐపీఎల్‌లో ఏపీ జట్టు కోసం ఏసీఏ కార్యాచరణకు దిగింది.
బీసీసీఐ మరోసారి కొత్త ఫ్రాంచైజీలకు అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తుండటంతో బిడ్డింగ్ దక్కించుకునేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి పర్యవేక్షణలో కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి స్థానిక పారిశ్రామికవేత్తలతో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
సీఎం ఆదేశాలతో ప్రణాళిక
భారత్‌లో ఐపీఎల్‌కు క్రేజ్ పెరిగిపోయింది. ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లు ఆడేందుకు యువత ఉత్సాహం చూపిస్తున్నారు. ఐపీఎల్‌లో ఏపీకి ఓ ఫ్రాంచైజీ జట్టు ఉంటే ఏపీలోని ఆటగాళ్లకు మంచి అవకాశాలు వస్తాయి. మరింత మంది యువ ఆటగాళ్లకు ప్రోత్సాహం అందుతుంది. ఇదే ఆలోచనను సీఎం జగన్ ఏసీఏ ముందుంచారు. దీనిపై రోడ్‌మ్యాప్ తయారు చేయాలని ఆదేశించారు. ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
కార్పొరేట్ల జట్లు
ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ పొందటం అంటే కోట్లతో వ్యవహారం. బీసీసీఐ నిబంధనల మేరకు ఇందులో ఏ గుర్తింపు సంఘం గానీ, ప్రభుత్వ ప్రమేయం గానీ ఉండకూడదు. బీసీసీఐ అనుమతితో జరిగే ప్రైవేట్ సంస్థల టోరీ్ననే ఐపీఎల్. ఆయా రాష్ట్రాల్లోని పెద్ద సంస్థలు, కార్పొరేట్లు ఫ్రాంచైజీకి పోటీపడతాయి. మరో రెండు ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లను ప్రకటించాలంటూ రాష్ట్రాల క్రికెట్ సంఘాలు బీసీసీఐని కోరుతున్నాయి. బీసీసీఐ మరిన్ని జట్లకు అనుమతిస్తే వాటిలో మన రాష్ట్ర జట్లూ ఉండేలా అన్నీ సిద్ధం చేస్తున్నాం.
ఏపీకి ఎలా సాధ్యమంటే..
ఏపీ ఫ్రాంచైజీ బిడ్డింగ్ దక్కించుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీ కావాలంటే మనకి ఉండాల్సిన వసతులు, అందుకు ఎవరిని సమాయత్తం చేయాలనే విషయాలపై సీఎం జగన్‌కు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల వైఎస్సార్ విగ్రహావిష్కరణలో సూచనలు ఇస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాకారాన్ని అందిస్తామని చెప్పారు.
బిడ్డింగ్ వేసేలా స్థానిక ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను ప్రోత్సహిస్తామన్నారు. వారికి కావాల్సిన మెకానిజం, ఆటగాళ్ల సాధనకు కావాల్సిన గ్రౌండ్స్ , హోమ్ గ్రౌండ్, అకాడమీ, శిక్షణావకాశాలు వంటివి ఏసీఏ సమకూర్చనుంది. ఇందుకోసం సీఎం జగన్ సూచనల మేరకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం. ఇందులో భాగంగానే మెన్, వుమెన్‌లో 20 మంది చొప్పున ఎంపిక జరిగింది. వారిని మూడు కేటగిరీలుగా విభజన చేసి, తదుపరి కార్యాచరణ చేపడుతున్నాం.
ఆగస్టులో ఏపీఎల్ రెండో సీజన్‌కు అవకాశం
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) మెన్ ప్రారంభ సీజన్‌కు ఇక్కడ వివిధ ఏజ్ గ్రూప్‌లతో పాటు రంజీలు ఆడిన వారు ఏకంగా 900 మంది ఉన్నారు. వీరితోనే ఆరు జట్లుగా ఏపీఎల్ తొలి సీజన్ జరిగింది. రెండో సీజన్ ఆగస్టులో నిర్వహించేందుకు త్వరలోనే ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ శరత్‌చంద్రారెడ్డి అధ్యక్షతన విశాఖలో సమావేశం కానుంది.
వైఎస్సార్ స్టేడియం హోమ్ పిచ్
విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ – వీడీసీఏ స్టేడియం ఇప్పటికే అంతర్జాతీయ టెస్ట్, వన్డే, టీ–20లాంటి అన్ని ఫార్మాట్ క్రికెట్ పోటీలకు వేదికైంది. ప్రపంచ క్రీడా పటంలో పేరు లిఖించుకుంది. క్రికెట్ ఆడే అన్ని దేశాల జట్లు ఈ స్టేడియంలో ఆడాయి.
రెండు రాష్ట్రాల ఫ్రాంచైజీ జట్లు గతంలో వైఎస్సార్ స్టేడియంను హోమ్ పిచ్‌గా ప్రకటించి ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాయి. ఇప్పుడు ఏపీ జట్టుకు కూడా ఇదే హోమ్ పిచ్ అవుతుంది. అందువల్ల రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ స్థానిక కార్పొరేట్లు బిడ్డింగ్ వేస్తే ఏపీకి ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టు రావడం పెద్ద కష్టం కాదు.
Comments
Please login to add a commentAdd a comment