విజయవాడ స్పోర్ట్స్: ‘మన ఆంధ్రా–మన ఏపీఎల్’ సీజన్–2ను పురస్కరించుకుని ఏసీఏ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో నిర్వహించిన 3కే రన్ ఉత్సాహంగా సాగింది. వందలాది మంది క్రికెట్ అభిమానులతోపాటు ఏసీఏ కార్యదర్శి గోపీనా«థ్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎ.రాకేష్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఎన్.గీత, కేవీ పురుషోత్తం, జితేంద్రనా«థ్‌శర్మ, బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, ఏసీఏ మాజీ కార్యదర్శులు అరుణ్‌కుమార్, దుర్గాప్రసాద్, కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ అడ్‌హక్ కమిటీ చైర్మన్ టి.త్రినాథరాజు, కన్వినర్ రవిశంకర్, పలువురు కోచ్‌లు పాల్గొన్నారు. గోపీనాథ్‌రెడ్డి టార్చ్ వెలిగించి ఈ రన్‌ను ప్రారంభించారు.
అనంతరం టార్చ్‌ను అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి ఎండీ షబనం, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యురాలు గీతకు అందజేశారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బందరు రోడ్డు, టిక్కిల్ రోడ్డు మీదుగా సిద్ధార్థ జంక్షన్ వరకు వెళ్లి, తిరిగి స్టేడియం వద్దకు ఈ రన్ చేరుకుంది. గోపీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారులను తయారు చేయడమే ఏసీఏ ప్రధాన లక్ష్యమని చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో విశాఖలో ఈ నెల 16 నుంచి 27వ తేదీ వరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్–2 నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పంద్రాగస్టు సందడి
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం స్వాతంత్య్ర దిన వేడుకలకు ముస్తాబవుతోంది. పరేడ్ కోసం సాధన చేస్తున్న పోలీ సులు, వివిధ రకాల శకటాలు తయారు చేస్తున్న కార్మికులతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. – సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment