
‘‘మా ‘సమ్మతమే’ చిత్రానికి యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది. మా చిత్రం పట్ల ప్రేక్షకుల స్పందన బాగుంది. వారు సినిమాని సమ్మతించారు’’ అని డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి అన్నారు. కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం ‘సమ్మతమే’. కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా ఈ నెల 24న రిలీజైంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నేను ఏ కథ చెప్పినా బలమైన పాయింట్ ఉండాలనుకుంటాను. ‘సమ్మతమే’లో అలాంటి పాయింట్ ఉంది. ఈ చిత్రానికి పెట్టిన ప్రతి రుపాయీ వచ్చింది. ఇండస్ట్రీ నుండి నాకు అభినందనలొచ్చాయి.. దర్శకుడిగా రెండు మూడు అవకాశాలు కూడా వచ్చాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment