‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించాడు యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆ వెంటనే ఎస్.ఆర్.కళ్యాణమండపం, సెబాస్టియన్ చిత్రాలతో అలరించాడు. తాజాగా ఈ యంగ్ హీరో ‘సమ్మతమే’ మూవీ నేడు(జూన్ 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తన సినిమాను ప్రతి ఒక్కరు థియేటర్లోనే చూడాలనే ఉద్దేశంతో ఫ్రి టికెట్స్ ఇస్తానని హామీ ఇచ్చాడు. ఈ మేరకు అతడు ఓ వీడియో వదిలాడు ‘అందరికి నమస్కారం. ఇప్పటి వరకు సమ్మతమే సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్క కంటెంట్‌కు మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు.
చదవండి: కవలలకు జన్మనిచ్చిన మరుసటి రోజే చిన్మయికి చేదు అనుభవం!
ఈ మధ్య నేను ప్రమోషల్లో భాగంగా మీ మధ్యకు వచ్చినప్పుడు మీరు చూపించిన ప్రేమ అంతా ఇంతా కాదు. నాకు మీరందరు సమ్మతమే సినిమా థియేటర్లోనే చూడాలని ఉంది. చాలా మంది మేం థియేటర్‌కే వెళ్లాలనుకుంటున్నాం కానీ టికెట్స్ అదీ ఇదీ అని మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఇప్పుడు సమ్మతమే సినిమాకు టికెట్స్ రేట్స్ నార్మల్‌గానే ఉన్నాయనుకుంటున్నాను. అయినా సరే టికెట్స్ రేట్స్ పరంగా సినిమా చూడలేని(ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేని) వాళ్లకు నేను ఫ్రిగా టికెట్స్ ఇస్తాను’ అని చెప్పుకొచ్చాడు. దానికి మీరు ఈ వీడియో కింద మీ ఊరు, మీ పేరు, దగ్గర్లోని థియేటర్ కామెంట్స్ పెట్టండని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment