free tickets
-
జీరో టికెట్‌పై కండక్టర్ల కన్నింగ్ ప్లాన్.. చర్యలకు TSRTC రెడీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీరో టికెట్ విషయంతో కొందరు కండక్టర్లు అత్యుత్యాహం చూపిస్తున్నారు. ఎక్కువ మందిని తీసుకెళ్తున్నామని చూపించుకోవడానికి లెక్కలు పెంచుతూ ఇష్టారీతిన టికెట్స్ కొడుతున్నారు. ఈ విషయం ఆర్టీసీ అధికారులు దృష్టికి చేరడంలో దీనిపై యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది. వివరాల ప్రకారం.. కేపీహెచ్బీలో ఓ ప్రయాణికురాలు బస్సు ఎక్కారు. ఆధార్‌కార్డు చూపించి టికెట్ ఎస్ఆర్ నగర్ వరకూ టికెట్ ఇవ్వమని కోరారు. అయితే, బస్సు కండక్టర్ మాత్రం ఆమెకు.. కోఠి వరకూ జీరో టికెట్ ఇచ్చారు. దీంతో, టికెట్‌పై అదేంటని ప్రయాణికురాలు ప్రశ్నించగా.. మీరేమీ డబ్బులు ఇవ్వలేదు కదా? అని అన్నాడు. అదే బస్సుల్లో సదరు కండక్టర్ మరొకరికి కూడా ఇలాగే టికెట్ ఇచ్చినట్టు తేలింది. కాగా, విషయాన్ని సదరు ప్రయాణికులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. ఇలాంటి ఫిర్యాదులు గ్రేటర్‌జోన్ అధికారుల దృష్టికి వెళ్లాయి. దీంతో, యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది. అయినా కండక్టర్లలో మార్పు రావడంలేదు. అయితే.. అంతకుముందు నుంచి కూడా 2850 బస్సులులే ఉండగా.. ప్రయాణికులు మాత్రం రెట్టింపు అయ్యారు. గతంలో 11లక్షల మంది ప్రయాణిస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 18లక్షలకు చేరింది. ఉదయం, సాయంత్రం బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. సీట్లు 60శాతం మహిళలతో నిండిపోతున్నాయి. 43 సీట్ల మెట్రో ఎక్స్‌ప్రెస్, 45 సీట్ల ఆర్డినరీ బస్సుల్లో వందమంది వరకూ ప్రయాణిస్తున్నారు. ఎంత పెరిగినా 2850 బస్సుల్లో 18లక్షల మంది ఎలా అవుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కువమంది ప్రయాణికుల్ని తీసుకెళ్తే డ్రైవర్, కండక్టర్లకు యాజమాన్యం నజరానాలు ప్రకటించింది. అందుకే కొంతమంది జీరో టిక్కెట్లు జారీ చేసి లెక్కలు పెంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల చేతివాటం! 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం మహిళా ప్రయాణికులు ఎక్కిన దాని కన్నా ఎక్కువ జీరో టిక్కెట్లు కొడుతున్న ఆర్టీసీ కండక్టర్లు. ఉత్తి పుణ్యానికి జీరో టిక్కెట్లు కొడుతూ ప్రభుత్వం ధనం వృధా చేస్తున్న కండక్టర్లు. మహబూబ్ నగర్ నుండి తాండూరు… pic.twitter.com/Ht6fnPZP4q — Telugu Scribe (@TeluguScribe) December 24, 2023 ఇటీవల ఓ పల్లెవెలుగులో కండక్టర్ కూడా ఇలాగే చేసినట్టు ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ప్రయాణికులు బస్సు ఎక్కకపోయినా కండక్టర్ జీరో టికెట్ కొడుతున్నారని సదరు ప్రయాణికుడు ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
'ఆర్టీసీ ఫుల్.. ఆటో నిల్' ఇదేమి ఖర్మరా మాకు! : ఆటో డ్రైవర్లు
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తుండటంతో ఆటోవాలాలు ఉపాధి కోల్పోయారు. ప్రధానంగా రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లోని ఆటో డ్రైవర్లకు ప్రయాణికుల్లేకపోవడంతో ఖాళీగానే కాలం గడుపుతున్నారు. మహిళలంతా బస్సుల్లోనే ప్రయాణించడానికి మొగ్గు చూపుతుండటంతో.. కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి తదితర ప్రాంతాలకు గిరాకీలు దొరకక పూట గడవని పరిస్థితి నెలకొందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాజీవ్ రహదారిలోని మొగ్ధుంపూర్ స్టేజీ వద్ద ఆటోలున్నా.. మహిళలు ఆర్టీసీ బస్సులో ఎక్కారు. బస్సు ఎక్కుతున్న మహిళలను చూస్తున్న ఆటో డ్రైవర్లు ఇదేమి ఖర్మరా మాకు అంటూ బిక్కమొహం వేసుకొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మూవీకి సంబంధించిన పదివేల టికెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ సంచలన ప్రకటన చేశారు. (ఇది చదవండి: 'ఆదిపురుష్' సినిమాపై వివాదం.. స్పందించిన చిత్రబృందం!) 'శ్రీరాముని ప్రతి అధ్యాయం గురించి తెలుసుకోవాలి. ఆయన అడుగు జాడల్లో మన నడవాలి. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు పది వేల టికెట్లు ఉచితంగా అందిస్తాం. టికెట్ల కోసం గూగుల్ ఫాం నింపితే చాలు. టికెట్స్ నేరుగా పంపిస్తాం. ' అని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. (ఇది చదవండి: ప్రముఖ నటుడి కుమార్తెపై ట్రోలింగ్.. గట్టిగానే ఇచ్చి పడేసింది!) #Adipurush: 10,000+ tickets would be given to the Government schools, Orphanages & Old Age Homes across Telangana for free by TKF & Karthikeya2 Producer Abhishek Agarwal! Fill the Google form with your details to avail the tickets.https://t.co/1cGGJZ5xcf pic.twitter.com/SWWomcahZ9 — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) June 7, 2023 10,000+ tickets would be given to the Government schools, Orphanages & Old Age Homes across Telangana for free by TKF & Karthikeya2 Producer Abhishek Agarwal! Fill the Google form with your details to avail the tickets. https://t.co/qUQdLJiPi4#Prabhas #Adipurush pic.twitter.com/xpyf2aVHLS — Prabhas RULES (@PrabhasRules) June 7, 2023 -
తన సినిమాకు ఫ్రీగా టికెట్స్ ఇస్తానన్న హీరో.. కానీ!
‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించాడు యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆ వెంటనే ఎస్.ఆర్.కళ్యాణమండపం, సెబాస్టియన్ చిత్రాలతో అలరించాడు. తాజాగా ఈ యంగ్ హీరో ‘సమ్మతమే’ మూవీ నేడు(జూన్ 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తన సినిమాను ప్రతి ఒక్కరు థియేటర్లోనే చూడాలనే ఉద్దేశంతో ఫ్రి టికెట్స్ ఇస్తానని హామీ ఇచ్చాడు. ఈ మేరకు అతడు ఓ వీడియో వదిలాడు ‘అందరికి నమస్కారం. ఇప్పటి వరకు సమ్మతమే సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్క కంటెంట్‌కు మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చదవండి: కవలలకు జన్మనిచ్చిన మరుసటి రోజే చిన్మయికి చేదు అనుభవం! ఈ మధ్య నేను ప్రమోషల్లో భాగంగా మీ మధ్యకు వచ్చినప్పుడు మీరు చూపించిన ప్రేమ అంతా ఇంతా కాదు. నాకు మీరందరు సమ్మతమే సినిమా థియేటర్లోనే చూడాలని ఉంది. చాలా మంది మేం థియేటర్‌కే వెళ్లాలనుకుంటున్నాం కానీ టికెట్స్ అదీ ఇదీ అని మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఇప్పుడు సమ్మతమే సినిమాకు టికెట్స్ రేట్స్ నార్మల్‌గానే ఉన్నాయనుకుంటున్నాను. అయినా సరే టికెట్స్ రేట్స్ పరంగా సినిమా చూడలేని(ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేని) వాళ్లకు నేను ఫ్రిగా టికెట్స్ ఇస్తాను’ అని చెప్పుకొచ్చాడు. దానికి మీరు ఈ వీడియో కింద మీ ఊరు, మీ పేరు, దగ్గర్లోని థియేటర్ కామెంట్స్ పెట్టండని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ద్రౌపది ముర్ముపై అనుచిత ట్వీట్, భగ్గుమన్న బీజేపీ -
'మహా నాయకుడు' టిక్కెట్లు ఫ్రీ
-
'మహా నాయకుడు' కోసం టీడీపీ తిప్పలు
సాక్షి, గుంటూరు: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన 'మహా నాయకుడు' సినిమాను ప్రమోట్ చేసేందుకు టీడీపీ నాయకులు తంటాలు పడుతున్నారు. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని సాక్షాత్తూ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో అధికార పార్టీ నాయకులకు తిప్పలు తప్పడం లేదు. అధినేత ఆదేశాలను శిరసావహించేందుకు టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వారిని ధియేటర్లకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జుల ద్వారా ఉచితంగా టికెట్లు పంపిణీ చేసి ప్రేక్షకులను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉచితంగా టిక్కెట్లు ఇచ్చినా సినిమా చూడటానికి ఆసక్తి చూపకపోవడంతో బతిమాలి జనాన్ని ధియేటర్లకు పంపుతున్నారు. అంతేకాదు జనాన్ని తరలించేందుకు వాహనాలు కూడా సమకూర్చారు. ప్రేక్షకులకు టిక్కెట్లు పంపిణీ చేస్తూ గుంటూరు ఆరండల్‌పేటలో గురువారం కొందరు టీడీపీ నాయకులు ‘సాక్షి’ కెమెరా కంటపడ్డారు. ఎన్టీఆర్ జీవిత కథను రెండు భాగాలు తెరకెక్కించి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయినట్టు వార్తలు వస్తున్నాయి. గతవారం విడుదలైన 'మహా నాయకుడు' కూడా బాక్సాఫీస్ వద్ద నిరసపడటంతో దీన్ని ప్రమోట్ చేసే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారు. తన పాత్రను సానుకూలంగా చూపించి, నాదెండ్ల భాస్కరరావు క్యారెక్టర్‌ను ప్రతికూలంగా చూపించడంతో ఈ సినిమాను ప్రమోట్ చేయాలని టీడీపీ నాయకులను చంద్రబాబు స్వయంగా ఆదేశించారు. టీడీపీ డబ్బులిస్తుంది: బచ్చుల అర్జునుడు చంద్రబాబు ఆదేశానుసారం ఎన్టీఆర్ మహనాయకుడు సినిమాకు సంబంధించి ప్రతి నియోజకవర్గ పరిధిలోని ధియోటర్లలో 50 శాతం టికెట్లు కేటాయించే విధంగా డిస్ట్రిబ్యూటర్లతో పార్టీ అధినాయకత్వం మాట్లాడటం జరిగిందని టీడీపీ నేత బచ్చుల అర్జునుడు వెల్లడించారు. పార్టీలో అన్ని విభాగాల నాయకులకు, కార్యకర్తలకు సినిమాను చూపించాలని కోరారు. 50 శాతం టిక్కెట్లకు పార్టీ డబ్బులు చెల్లిస్తుందని టీడీపీ కార్యకర్తలకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. టిక్కెట్లు సరిగా పంచుతున్నారా, లేదా అనే దానిపై విజిలెన్స్ పర్యవేక్షణ కూడా ఉంటుందని తెలిపారు. ‘యన్‌టిఆర్ మహానాయకుడు’ మూవీ రివ్యూ -
‘మహానాయకుడు’ ఇంతగా దిగజారిపోయిందా..?
పశ్చిమగోదావరి, నిడదవోలు రూరల్: ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకు ప్రజల నుంచి ఆశించినంతగా స్పందన లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి డ్వాక్రా మహిళలు, టీడీపీ నాయకులు కోసం ఉచిత షోలు వేస్తున్నారు. ఈనెల 25 ఉదయం, మ్యాట్నీ షోలతో పాటు, 26న నాలుగు షోలలో కూడా తమ పార్టీ నేతలకు, డ్వాక్రా మహిళలకు 50 శాతం టికెట్లు కేటాయించాలన్న టీడీపీ అదేశాలతో ఉషా పిక్చర్ డిస్ట్రిబ్యూటర్స్ సినిమా థియేటర్ల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆయా పట్టణాల్లోని కౌన్సిలర్లతో పాటు టీడీపీ నాయకులు, డ్వాక్రా యానిమేటర్లు, డ్వాక్రా మహిళలకు సినిమా చూపించేందుకు ఏర్పాట్లు చేశారు. సినిమాను టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రాజకీయ ప్రయోజనాల కోసం తీయడంతోపాటు చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాన్ని తెరకెక్కించకపోవడంతో సినిమా డిజాస్టర్ అయిందని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులతో జరిగిన టెలి కాన్ఫరెన్స్‌లో ఈ సినిమాను అందరికీ చూపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించటంతో టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఉచిత షోలు వేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఇప్పటికే డ్వాక్రా మహిళలను టీడీపీ కార్యక్రమాలను ప్రచారం చేసేందుకు సాధికార మిత్రలుగా నియమించారు. ఇటీవల పోలవరం, అమరావతి చూసేందుకు బస్సుల్లో తరలించగా, ఇప్పుడు సినిమాలకు తప్పనిసరిగా రావాలని ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. డ్వాక్రా గ్రూపులకు ఇచ్చిన పోస్ట్ పెయిడ్ చెక్కుల విషయంలో ఎక్కడ ఇబ్బంది పెడతారోనని తప్పని పరిస్థితుల్లో వారి మాట వినాల్సి వస్తోందని డ్వాక్రా సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఉచిత టిక్కెట్లు : జెట్ ఎయిర్వేస్ క్లారిటీ
న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాల్లో నిజాలెంత ఉంటాయో? అబద్ధాలు కూడా అంతే. ఇటీవల జెట్ ఎయిర్వేస్ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత విమాన టిక్కెట్లు ఇస్తుందంటూ మెసేజ్‌లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ మెసేజ్‌లో నిజమెంత ఉందో, అబద్ధమెంతో జెట్ ఎయిర్వేస్ తేల్చేసింది. తాము ఎటువంటి ఉచిత టిక్కెట్లు ఇవ్వడం లేదని, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశాలన్నీ పూర్తిగా అవాస్తవమేనని జెట్ ఎయిర్వేస్ బుధవారం స్పష్టంచేసింది. ఇది 100 శాతం పూర్తిగా అవాస్తవమని తెలిపింది. అధికారిక ఖాతాలను నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కస్టమర్లకు సూచించింది. ‘25 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జెట్ ఎయిర్వేస్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ రెండు టికెట్లు ఉచితంగా ఇస్తున్నట్లు వస్తోన్న సందేశాలన్నీ పూర్తిగా అవాస్తవం. అది అధికారిక సమాచారం కాదు. అలాంటి సమాచారం ఏదైనా ఉంటే ఎయిర్వేస్ అధికారిక ఖాతాల్లోనే ఉంచుతాం. దానికి బ్లూ టిక్ మార్క్ ఉంటుంది’ అని జెట్ ఎయిర్వేస్ ట్వీట్ చేసింది. 25వ వార్షికోత్సవ సందర్భంగా జెట్‌ఎయిర్‌వేస్ ప్రతి ఒక్కరికీ రెండు ఉచిత టిక్కెట్లు ఇస్తోందని, ఆ లింక్‌ను మరో 20 మందికి షేర్ చెయ్యాలని, దాంతో 48 గంటల్లో యూజర్ మెయిల్ ఐడీకి టికెట్లు అందుతాయని ఆ మెసేజ్‌లో ఉంది. అయితే అదంతా పూర్తిగా అవాస్తవమని జెట్ ఎయిర్వేస్ తేల్చేసింది. ఈ వైరల్ మెసేజ్‌పై బుధవారం క్లారిటీ ఇచ్చింది. ఎయిర్‌లైన్ ప్రకటనపై స్పందించిన చాలామంది ట్విటర్ యూజర్లు తాము ఈ మెసేజ్‌ను పొందామని, క్లిక్ కూడా చేసినట్టు పేర్కొన్నారు. #FakeAlert There's a fake link being circulated regarding ticket giveaways for our 25th Anniversary. This is not an official contest/giveaway and we advise caution. Genuine contests & giveaways are hosted only on our verified social media accounts, indicated with a blue tick. pic.twitter.com/NvJrFaq3aL — Jet Airways (@jetairways) May 23, 2018 -
విమానయాన కంపెనీల ఆఫర్ల జోరు
ప్రకటించిన ఎయిరిండియా, స్పైస్‌జెట్ న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఉచిత టికెట్లు, చౌక ధరలతో ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. నానాటికీ తీవ్రమవుతున్న పోటీని తట్టుకోవడానికి, సీట్ల ఆక్యుపెన్సీని పెంచుకోవడానికి వివిధ రకాల ఆఫర్లను అందిస్తున్నాయి. తాజాగా బుధవారం ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ కంపెనీలు ఇలాంటి ఆఫర్లనే అందుబాటులోకి తెచ్చాయి. ఎయిర్ ఇండియా బై వన్, ప్లై టూ ఆఫర్ కింద ఒక టికెట్‌ను బుక్ చేస్తే మరో టికెట్‌ను ఉచితంగా ఇస్తోంది. ఇక స్పైస్‌జెట్ సంస్థ లక్కీ సెవన్ సేల్ కింద రూ.777 ధరకే విమాన టికెట్లను (కొన్ని ఎంపిక చేసిన రూట్లలో)ఆఫర్ చేస్తోంది. ఎయిర్ ఇండియా బై వన్ ఫ్లై టు... గత రెండేళ్లుగా దేశీయ విమానయాన రంగం 20 శాతానికి పైగా వృద్ధి సాధిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు పలు విమానయాన సంస్థలు వివిధ ఆఫర్లను ముందుకు తెస్తున్నాయి. ఎయిర్ ఇండియా కంపెనీ ఒక టికెట్‌కు మరో టికెట్‌ను ఉచితంగా ఇచ్చే బై వన్ ఫ్లై టూ ఆఫర్‌ను అందిస్తోంది. మెట్రో నగరాలకు కాకుండా దేశీయ రూట్లలో ఫస్ట్‌క్లాస్, బిజినెస్ క్లాస్ టికెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. బుకింగ్‌లు, ప్రయాణానికి కూడా గడువు మే 31 వ తేదీయే. సాధారణంగా ఈ రెండు కేటగిరిల్లో 50 శాతం సీట్లే నిండుతాయని, ఈ కేటగిరిల్లో సీట్ల ఆక్యుపెన్సీ పెంచుకోవడానికి ఈ ఆఫర్‌ను అందిస్తున్నామని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు చెప్పారు. స్పైస్‌జెట్ లక్కీ సెవెన్ సేల్.. ఇక స్పైస్‌జెట్ సంస్థ లక్కీ సెవెన్ సేల్ ఆఫర్ కింద అన్నీ కలుపుకుని రూ.777కే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. దేశీయ నెట్‌వర్క్‌లో ఎంపిక చేసిన రూట్లలోనే ఒక వైపుకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ నెల 25 వరకూ టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ఈ నెల మార్చి 9 నుంచి ఏప్రిల్ 13 వరకు ప్రయాణించవచ్చని వివరించింది. విమానయాన సంస్థ డీజీసీఏ ప్రకారం, గత నెలలో 95.79 లక్షల మంది ప్రయాణికులు విమానయానం చేశారు. 25 శాతం వృద్ధి నమోదైంది. -
అవి పాటించిన వాళ్లకి ‘కబాలి’ టికెట్లు ఫ్రీ
చెన్నై: కబాలి చిత్ర ప్రమోషన్‌ను ఈ చిత్ర వర్గాలు ఎన్ని విధాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకుంటున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి. ఈ చిత్రం ఇప్పటికే ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక ఈ చిత్రానికి గ్లోబల్ ప్రచారం జరుగుతోందని ఏషియన్ విమానం మీద పోస్టర్లతోనే అర్థం అవుతోంది. ఈ నెల 15 లేదా 22న కబాలి చిత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కాగా పుదుచ్చేరిలో స్వచ్ఛభారత్ సేవా కార్యక్రమాలకు రజనీకాంత్ సహకరించాలనీ, వాణిజ్య పరంగా అభివృద్ధికి చేయూతనివ్వాలని రాష్ట్ర గవర్నర్ కిరణ్‌బేడి ఇటీవల విజ్ఞప్తి చేశారు. పాండిచ్చేరిలో కబాలి చిత్ర విడుదల హక్కులను పొందిన లెజెండ్స్ మీడియా అధినేత జీపీ.సెల్వకుమార్ ఇటీవల కిరణ్‌బేడి, ముఖ్యమంత్రి నారాయణస్వామిని కలిసి పైరసీని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పైరసీని పూర్తిగా అరికడతామని గవర్నర్ హామీ ఇచ్చారని సెల్వకుమార్ వెల్లడించారు. పాండిచ్చేరిలో తమ ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించే వారికి కబాలి టికెట్లను ఉచితంగా అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
అభిబస్ ‘సీట్ రూలెట్’
- ఉచితంగా టికెట్ పొందే అవకాశం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ బస్ టికెట్ బుకింగ్ పోర్టల్ ‘అభిబస్’ ప్రయాణికులు ఉచితంగా టికెట్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ‘సీట్ రూలెట్’ పేరుతో రూపొందించిన ఆన్లైన్ గేమ్‌లో పాల్గొనడం ద్వారా ప్రయాణీకులు ఈ ఉచిత టెకెట్‌ను పొందవచ్చు. ప్రయాణించాల్సిన గమ్యస్థానం, మొబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా ఈ పోటీలో పాల్గొనవచ్చు. సీట్ రూలెట్లో రోజుకు పదిసార్లు హిట్ చేసే అవకాశాన్ని అభిబస్ కల్పిస్తోంది. గరిష్టంగా రూ. 2,000 ఖరీదైన టికెట్లను ఈ పోటీలో గెలవచ్చని అభిబస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
దుబాయ్ జేసుదాసు కచేరీకి ఉచిత టికెట్లు
ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు కె.జె. జేసుదాసు కచేరీ అంటే.. ఎవరైనా సరే చెవి కోసుకుంటారు. మరి అలాంటి కచేరీకి టికెట్లు ఉచితంగా ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు కదా! కానీ ఖతార్‌లో శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్న దాదాపు 25 మంది విద్యార్థులకు ఈ సువర్ణావకాశం లభిస్తోంది. 'జేసుదాస్ @ దోహా' అనే ఈ కార్యక్రమం అక్టోబర్ 11వ తేదీన ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆసక్తి గల విద్యార్థులు.. తాము సంగీతం నేర్చుకుంటున్న సంస్థ నుంచి ఒక లేఖ తీసుకుని, దాన్ని కార్యక్రమ నిర్వాహకులకు దాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇలా ముందుగా వచ్చిన 25 మంది సంగీత విద్యార్థులను జేసుదాస్ కచేరీకి ఉచితంగా అనుమతిస్తారు. ఒకవేళ ఆయన అనుమతిస్తే.. జేసుదాస్ ఆశీస్సులు కూడా విద్యార్థులకు అందేలా చూస్తామని మర్జూక్ అల్ సల్మాన్ అండ్ సన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మహ్మద్ అల్ షమ్లాన్ తెలిపారు. పలు భారతీయ భాషలలో జేసుదాస్ ఇప్పటివరకు 50 వేలకు పైగా పాటలు పాడారు. ఖతార్‌లో ఉన్న తెలుగు, తమిళ, మళయాళీలు దాదాపు 2వేల మందికి పైగా ఈ కచేరీకి హాజరవుతారని అంచనా.