బస్సు ఎక్కుతున్న మహిళలను చూస్తున్న ఆటో డ్రైవర్లు
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తుండటంతో ఆటోవాలాలు ఉపాధి కోల్పోయారు. ప్రధానంగా రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లోని ఆటో డ్రైవర్లకు ప్రయాణికుల్లేకపోవడంతో ఖాళీగానే కాలం గడుపుతున్నారు. మహిళలంతా బస్సుల్లోనే ప్రయాణించడానికి మొగ్గు చూపుతుండటంతో.. కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి తదితర ప్రాంతాలకు గిరాకీలు దొరకక పూట గడవని పరిస్థితి నెలకొందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాజీవ్ రహదారిలోని మొగ్ధుంపూర్ స్టేజీ వద్ద ఆటోలున్నా.. మహిళలు ఆర్టీసీ బస్సులో ఎక్కారు. బస్సు ఎక్కుతున్న మహిళలను చూస్తున్న ఆటో డ్రైవర్లు ఇదేమి ఖర్మరా మాకు అంటూ బిక్కమొహం వేసుకొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment