అవి పాటించిన వాళ్లకి ‘కబాలి’ టికెట్లు ఫ్రీ | kabali movie tickets free in puducherry | Sakshi
Sakshi News home page

అవి పాటించిన వాళ్లకి ‘కబాలి’ టికెట్లు ఫ్రీ

Published Sat, Jul 2 2016 12:26 PM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

అవి పాటించిన వాళ్లకి ‘కబాలి’ టికెట్లు ఫ్రీ

అవి పాటించిన వాళ్లకి ‘కబాలి’ టికెట్లు ఫ్రీ

చెన్నై: కబాలి చిత్ర ప్రమోషన్‌ను ఈ చిత్ర వర్గాలు ఎన్ని విధాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకుంటున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి. ఈ చిత్రం ఇప్పటికే  ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక ఈ చిత్రానికి గ్లోబల్ ప్రచారం జరుగుతోందని ఏషియన్ విమానం మీద పోస్టర్లతోనే అర్థం అవుతోంది.

ఈ నెల 15 లేదా 22న కబాలి చిత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కాగా పుదుచ్చేరిలో స్వచ్ఛభారత్ సేవా కార్యక్రమాలకు రజనీకాంత్ సహకరించాలనీ, వాణిజ్య పరంగా అభివృద్ధికి చేయూతనివ్వాలని  రాష్ట్ర గవర్నర్ కిరణ్‌బేడి ఇటీవల విజ్ఞప్తి చేశారు.  పాండిచ్చేరిలో కబాలి చిత్ర విడుదల హక్కులను పొందిన లెజెండ్స్ మీడియా అధినేత జీపీ.సెల్వకుమార్ ఇటీవల  కిరణ్‌బేడి, ముఖ్యమంత్రి నారాయణస్వామిని కలిసి పైరసీని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పైరసీని పూర్తిగా అరికడతామని గవర్నర్ హామీ ఇచ్చారని సెల్వకుమార్ వెల్లడించారు. పాండిచ్చేరిలో తమ ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించే వారికి కబాలి టికెట్లను ఉచితంగా అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement