సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీరో టికెట్ విషయంతో కొందరు కండక్టర్లు అత్యుత్యాహం చూపిస్తున్నారు. ఎక్కువ మందిని తీసుకెళ్తున్నామని చూపించుకోవడానికి లెక్కలు పెంచుతూ ఇష్టారీతిన టికెట్స్ కొడుతున్నారు. ఈ విషయం ఆర్టీసీ అధికారులు దృష్టికి చేరడంలో దీనిపై యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది.
వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీలో ఓ ప్రయాణికురాలు బస్సు ఎక్కారు. ఆధార్‌కార్డు చూపించి టికెట్ ఎస్‌ఆర్ నగర్ వరకూ టికెట్ ఇవ్వమని కోరారు. అయితే, బస్సు కండక్టర్ మాత్రం ఆమెకు.. కోఠి వరకూ జీరో టికెట్ ఇచ్చారు. దీంతో, టికెట్‌పై అదేంటని ప్రయాణికురాలు ప్రశ్నించగా.. మీరేమీ డబ్బులు ఇవ్వలేదు కదా? అని అన్నాడు. అదే బస్సుల్లో సదరు కండక్టర్ మరొకరికి కూడా ఇలాగే టికెట్ ఇచ్చినట్టు తేలింది. కాగా, విషయాన్ని సదరు ప్రయాణికులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. ఇలాంటి ఫిర్యాదులు గ్రేటర్‌జోన్ అధికారుల దృష్టికి వెళ్లాయి. దీంతో, యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది. అయినా కండక్టర్లలో మార్పు రావడంలేదు.
అయితే.. అంతకుముందు నుంచి కూడా 2850 బస్సులులే ఉండగా.. ప్రయాణికులు మాత్రం రెట్టింపు అయ్యారు. గతంలో 11లక్షల మంది ప్రయాణిస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 18లక్షలకు చేరింది. ఉదయం, సాయంత్రం బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. సీట్లు 60శాతం మహిళలతో నిండిపోతున్నాయి. 43 సీట్ల మెట్రో ఎక్స్‌ప్రెస్, 45 సీట్ల ఆర్డినరీ బస్సుల్లో వందమంది వరకూ ప్రయాణిస్తున్నారు. ఎంత పెరిగినా 2850 బస్సుల్లో 18లక్షల మంది ఎలా అవుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కువమంది ప్రయాణికుల్ని తీసుకెళ్తే డ్రైవర్, కండక్టర్లకు యాజమాన్యం నజరానాలు ప్రకటించింది. అందుకే కొంతమంది జీరో టిక్కెట్లు జారీ చేసి లెక్కలు పెంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల చేతివాటం!
— Telugu Scribe (@TeluguScribe) December 24, 2023
100 శాతం ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం మహిళా ప్రయాణికులు ఎక్కిన దాని కన్నా ఎక్కువ జీరో టిక్కెట్లు కొడుతున్న ఆర్టీసీ కండక్టర్లు.
ఉత్తి పుణ్యానికి జీరో టిక్కెట్లు కొడుతూ ప్రభుత్వం ధనం వృధా చేస్తున్న కండక్టర్లు.
మహబూబ్ నగర్ నుండి తాండూరు… pic.twitter.com/Ht6fnPZP4q
ఇటీవల ఓ పల్లెవెలుగులో కండక్టర్ కూడా ఇలాగే చేసినట్టు ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ప్రయాణికులు బస్సు ఎక్కకపోయినా కండక్టర్ జీరో టికెట్ కొడుతున్నారని సదరు ప్రయాణికుడు ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment