మహాలక్ష్మీ స్కీమ్‌, కొత్త బస్సులపై సజ్జనార్‌ కీలక ప్రకటన | TSRTC MD VC Sajjanar Key Comments Over Mahalakshmi Scheme | Sakshi
Sakshi News home page

మహాలక్ష్మీ స్కీమ్‌, కొత్త బస్సులపై సజ్జనార్‌ కీలక ప్రకటన

Published Sun, Jan 28 2024 8:55 PM | Last Updated on Mon, Jan 29 2024 11:05 AM

TSRTC MD Sajjanar Key Comments Over Mahalakshmi Scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్‌, కొత్త ఆర్టీసీ బస్సుల గురించి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నట్టు తెలిపారు. అలాగే, మహాలక్ష్మీ స్కీమ్‌ ద్వారా 12కోట్లకుపైగా మహిళలు బస్సుల్లో ప్రయాణించినట్టు సజ్జనార్‌ చెప్పుకొచ్చారు. 

కాగా, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఈరోజు నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో బ్లైండ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్‌ లూయిస్‌ బ్రెయిలీ 215వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చరిత్రాత్మక నిర్ణయం. తెలంగాణలో 45 రోజుల్లో 12కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని అన్నారు. 

ఇదే సమయంలో సజ్జనార్‌..‘ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి. త్వరలో 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నాం. అప్పుడు కొంత వెసులుబాటు కలుగుతుంది. అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అనౌన్స్‌మెంట్‌, ఎంక్వయిరీ రూమ్‌ ఉద్యోగాల్లో అంధులకు అవకాశం కల్పిస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement