TSRTC: వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం​: సజ్జనార్‌ | TSRTC MD Sajjanar Serious Warning To Women Passengers In Telangana, See Details - Sakshi
Sakshi News home page

TSRTC: ఉచిత ప్రయాణంలో ఓవరాక్షన్‌.. సజ్జనార్‌ వార్నింగ్‌ ఇదే..

Published Thu, Dec 28 2023 11:47 AM | Last Updated on Thu, Dec 28 2023 3:05 PM

TSRTC MD Sajjanar Serious Warning To Passengers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీంతో, బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగిపోయింది. అవసరం లేకున్నా కొందరు బస్సుల్లో ప్రయాణించడంతో ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. 

ఈ క్రమంలో ప్రయాణికులకు జాగ్రత్తలు చెప్పిన ఓ మహిళా కండక్టర్‌ను కొందరు మహిళలు దూషించడంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అంతటితో ఆగకుండా ఆమెను బస్సు నుంచి దింపేశారు. ఇక, ఈ ఘటనను ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రయాణికులకు వార్నింగ్‌ ఇచ్చారు. 

ఈ ఘటనపై సజ్జనార్‌ స్పందిస్తూ..‘టీఎస్‌ఆర్టీకి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్‌ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లైనా సిబ్బందిని కొందరు దూషించడం, దాడులు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. 

ఇప్పటికే మా అధికారులు ఈ ఘటనలపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతున్నాం అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement