దుబాయ్ జేసుదాసు కచేరీకి ఉచిత టికెట్లు
ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు కె.జె. జేసుదాసు కచేరీ అంటే.. ఎవరైనా సరే చెవి కోసుకుంటారు. మరి అలాంటి కచేరీకి టికెట్లు ఉచితంగా ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు కదా! కానీ ఖతార్లో శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్న దాదాపు 25 మంది విద్యార్థులకు ఈ సువర్ణావకాశం లభిస్తోంది. 'జేసుదాస్ @ దోహా' అనే ఈ కార్యక్రమం అక్టోబర్ 11వ తేదీన ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆసక్తి గల విద్యార్థులు.. తాము సంగీతం నేర్చుకుంటున్న సంస్థ నుంచి ఒక లేఖ తీసుకుని, దాన్ని కార్యక్రమ నిర్వాహకులకు దాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
ఇలా ముందుగా వచ్చిన 25 మంది సంగీత విద్యార్థులను జేసుదాస్ కచేరీకి ఉచితంగా అనుమతిస్తారు. ఒకవేళ ఆయన అనుమతిస్తే.. జేసుదాస్ ఆశీస్సులు కూడా విద్యార్థులకు అందేలా చూస్తామని మర్జూక్ అల్ సల్మాన్ అండ్ సన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మహ్మద్ అల్ షమ్లాన్ తెలిపారు. పలు భారతీయ భాషలలో జేసుదాస్ ఇప్పటివరకు 50 వేలకు పైగా పాటలు పాడారు. ఖతార్లో ఉన్న తెలుగు, తమిళ, మళయాళీలు దాదాపు 2వేల మందికి పైగా ఈ కచేరీకి హాజరవుతారని అంచనా.