Sammathame Movie
-
ఓటీటీకి సమ్మతమే మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరో చాందిని చౌదరిలు జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం సమ్మతమే. డైరెక్టర్ గోపీనాథ్‌రెడ్డి తెరక్కించిన ఈ చిత్రం ఇటీవల జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. కొన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగా.. మరికొన్ని వర్గాల ఆడియన్స్‌ను నిరాశ పరిచింది. దీంతో ఆ మూవీ యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. చదవండి: నేను ఇంతకాలం నటించకపోవడానికి కారణం ఇదే.. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో సమ్మతమే మూవీ త్వరలో విడుదల కాబోతోంది. దీనిపై సదరు ఓటీటీ సంస్థ తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది. జూలై 15 అర్థరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందంటూ ఆహా తమ అధికారిక ట్విటర్లో వెల్లడిచింది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానరపై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి రావడం గమనార్హం. Krishnudi leelalu, Sathyabhama alakalu kathale vinamu ipativaraku kani ade role reverse aithe?#SammathameOnAHA premieres July 15.@Kiran_Abbavaram @iChandiniC #GopinathReddy #DivyaSree pic.twitter.com/DQ4v2zlCha — ahavideoin (@ahavideoIN) July 6, 2022 -
మా సినిమాను సమ్మతించారు: డైరెక్టర్
‘‘మా ‘సమ్మతమే’ చిత్రానికి యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది. మా చిత్రం పట్ల ప్రేక్షకుల స్పందన బాగుంది. వారు సినిమాని సమ్మతించారు’’ అని డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి అన్నారు. కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం ‘సమ్మతమే’. కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా ఈ నెల 24న రిలీజైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నేను ఏ కథ చెప్పినా బలమైన పాయింట్ ఉండాలనుకుంటాను. ‘సమ్మతమే’లో అలాంటి పాయింట్ ఉంది. ఈ చిత్రానికి పెట్టిన ప్రతి రుపాయీ వచ్చింది. ఇండస్ట్రీ నుండి నాకు అభినందనలొచ్చాయి.. దర్శకుడిగా రెండు మూడు అవకాశాలు కూడా వచ్చాయి’’ అన్నారు. -
ఆ సినిమాకు మొదట మిశ్రమ రివ్యూలు వచ్చాయి: హీరో
Kiran Abbavaram Speech In Sammathame Movie Success Meet: ''ప్రేక్షకుల వల్లే 'సమ్మతమే' బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇది ప్రేక్షకుల విజయం. నా 'ఎస్ఆర్ కల్యాణ మండపం' సినిమాకు కూడా మొదట్లో మిశ్రమ రివ్యూలు వచ్చాయి. ఆ తర్వాత సినిమా బ్లాక్‌బస్టర్. 'సమ్మతమే' మార్నింగ్ షో తర్వాత మిశ్రమ రివ్యూలు వినిపించాయి. అదేరోజు సాయంత్రం ఓ థియేటర్‌కు వెళ్లి చూస్తే హౌస్‌ఫుల్ అయింది.' అని తెలిపాడు కిరణ్ అబ్బవరం. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం 'సమ్మతమే'. కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా ఈ నెల 24న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో ''డబ్బులుంటే ఎవరైనా సినిమా తీస్తారు. కానీ హిట్ కొట్టండ ముఖ్యం. మా సొంత డబ్బులతో 'సమ్మతమే' తీసి, సూపర్ హిట్ కొట్టడం హ్యాపీగా ఉంది' అని గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ''సమ్మతమే' సినిమాను బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని ప్రవీణ తెలిపారు. చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట? 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. మాస్ హీరోగా గుర్తింపు దక్కింది: ఆకాష్ పూరి -
తన సినిమాకు ఫ్రీగా టికెట్స్ ఇస్తానన్న హీరో.. కానీ!
‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించాడు యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆ వెంటనే ఎస్.ఆర్.కళ్యాణమండపం, సెబాస్టియన్ చిత్రాలతో అలరించాడు. తాజాగా ఈ యంగ్ హీరో ‘సమ్మతమే’ మూవీ నేడు(జూన్ 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తన సినిమాను ప్రతి ఒక్కరు థియేటర్లోనే చూడాలనే ఉద్దేశంతో ఫ్రి టికెట్స్ ఇస్తానని హామీ ఇచ్చాడు. ఈ మేరకు అతడు ఓ వీడియో వదిలాడు ‘అందరికి నమస్కారం. ఇప్పటి వరకు సమ్మతమే సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్క కంటెంట్‌కు మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చదవండి: కవలలకు జన్మనిచ్చిన మరుసటి రోజే చిన్మయికి చేదు అనుభవం! ఈ మధ్య నేను ప్రమోషల్లో భాగంగా మీ మధ్యకు వచ్చినప్పుడు మీరు చూపించిన ప్రేమ అంతా ఇంతా కాదు. నాకు మీరందరు సమ్మతమే సినిమా థియేటర్లోనే చూడాలని ఉంది. చాలా మంది మేం థియేటర్‌కే వెళ్లాలనుకుంటున్నాం కానీ టికెట్స్ అదీ ఇదీ అని మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఇప్పుడు సమ్మతమే సినిమాకు టికెట్స్ రేట్స్ నార్మల్‌గానే ఉన్నాయనుకుంటున్నాను. అయినా సరే టికెట్స్ రేట్స్ పరంగా సినిమా చూడలేని(ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేని) వాళ్లకు నేను ఫ్రిగా టికెట్స్ ఇస్తాను’ అని చెప్పుకొచ్చాడు. దానికి మీరు ఈ వీడియో కింద మీ ఊరు, మీ పేరు, దగ్గర్లోని థియేటర్ కామెంట్స్ పెట్టండని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ద్రౌపది ముర్ముపై అనుచిత ట్వీట్, భగ్గుమన్న బీజేపీ -
Sammathame Movie Review: ‘సమ్మతమే’ మూవీ రివ్యూ
టైటిల్ : సమ్మతమే నటీనటులు : కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, గోపరాజు రమణ తదితరులు నిర్మాణ సంస్థ : యూజీ ప్రొడక్షన్స్ నిర్మాతలు: కంకణాల ప్రవీణ దర్శకత్వం : గోపినాథ్ రెడ్డి సంగీతం :శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ :సతీష్ రెడ్డి మాసం ఎడిటర్ : విప్లవ్ నైషధం విడుదల తేది :జూన్ 24,2022 కొంతమంది హీరోలు తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకుంటారు.అలాంటి వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించాడు. ఆ వెంటనే ఎస్.ఆర్.కళ్యాణమండపం, సెబాస్టియన్ చిత్రాలతో అలరించాడు. తాజాగా ఈ యంగ్ హీరో ‘సమ్మతమే’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘సమ్మతమే’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జూన్ 24) విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ(కిరణ్ అబ్బవరం) చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు. దీంతో బాల్యంలోనే చాలా అడ్డంకులు ఎదుర్కొంటాడు. ఇంట్లో ఆడవాళ్లు లేకపోవడం వల్లే ఇవన్ని ఇబ్బందులని భావించిన కృష్ణ.. తల్లిలా చూసుకునే జీవిత భాగస్వామి రావాలనుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక భార్యనే ప్రేమించాలని భావిస్తాడు. అయితే తనకు కాబోయే భార్య మాత్రం పద్దతిగా, అబద్దాలు చెప్పకుండా ఉండాలనుకుంటాడు. ఇలాంటి వ్యక్తి.. తనకు పూర్తి వ్యతిరేకమైన శాన్వీ(చాందిని చౌదరి)తో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను ఎలాగైన తన పద్దతిలోకి తెచ్చుకోవాలనుకుంటాడు. శాన్వీ కూడా కృష్ణని ప్రేమిస్తుంది. కానీ అతని అతిప్రేమ తట్టుకోలేకపోతుంది. దీంతో ఇద్దరి మధ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిని కృష్ణ ఎలా పరిష్కరించుకున్నాడు? అసలు పెళ్లికి ముందు ఎవరిని ప్రేమించను అని చెప్పిన కృష్ణ.. శాన్వీ ప్రేమలో ఎలా పడ్డాడు? తన అతిప్రేమతో శాన్వీని ఎలా ఇబ్బంది పెట్టాడు? చివరకు శాన్విని కృష్ణ పెళ్లి చేసుకున్నాడా లేదా? అనేది మిగతా కథ. ఎలా ఉందంటే..? పెళ్లి చేసుకునే ప్రతి యువకుడు తనకు కాబోయే భార్య ఇలా ఉండాలి..అలా ఉండాలని అనుకుంటారు. కన్నవాళ్లని వదులుకొని వచ్చిన భార్యకు ఆంక్షలు విధిస్తారు. అది తన భార్యపై తనకున్న ప్రేమ అని భావిస్తారు. కానీ ఆ ఆంక్షల వల్ల అమ్మాయి ఎన్ని ఇబ్బందులు పడుతుంది? పాతికేళ్లు తనకు నచ్చినట్లుగా బతికే అమ్మాయి.. పెళ్లి తర్వాత భర్తకు నచ్చినట్లుగా ఉండాలనడం ఎంతవరకు సమంజసం? తనకంటూ ఓ జీవితం ఉంటుంది కదా? ఇదే విషయాన్ని ‘సమ్మతమే’చిత్రం ద్వారా తెలియజేశాడు దర్శకుడు గోపినాథ్ రెడ్డి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ...కథనం మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా మొత్తం కృష్ణ, శాన్వీల చుట్టే తిరుగుతుంది. ప్రతిసారి కండీషన్స్ పెట్టడం.. అనుమానించడం..చివరకు సారీ చెప్పడం.. కథంతా ఇలానే సాగుతుంది. కృష్ణ హైదరాబాద్‌కు రావడం..శాన్వీని ప్రేమించడం.. తనకు నచ్చే విధంగా మార్చుకోవాలనుకోవడం..ఇలా సోసోగా ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథంతా సాగదీసినట్లుగా ఉంటుంది. కృష్ణ, శాన్వీల మధ్య ప్రేమ, గొడవలు..సారీలు చెప్పుకోవడం ఇలానే సాగుతుంది. కృష్ణ సంఘర్షనకు అసలు అర్థమే లేదనిపిస్తుంది. ఎలాంటి ట్విస్టులు లేకుండా కథంతా నీరసంగా సాగుతుంది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. అయితే చివరల్లో గోపరాజు రమణ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. చివరగా ఇది సాధారణ ప్రేమ కథే అయినప్పటికీ.. దర్శకుడి ఇచ్చిన సందేశానికి మాత్రం సమ్మతం తెలుపాల్సిందే. ఎవరెలా చేశారంటే.. కృష్ణ పాత్రలో కిరణ అబ్బవరం చక్కగా నటించాడు. నేటి తరం యువకులకు ప్రతి రూపంగా అతని పాత్ర ఉంటుంది. అయితే సినిమా మొత్తం ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో నటించడం కాస్త మైనస్. ఇక శాన్వీగా చాందిని చౌదరి అదరగొట్టేసింది. తెరపై అందంగా కనిపించడమే కాకుండా.. మోడ్రన్ అమ్మాయిగా తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తండ్రిగా గోపరాజు రమణ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. కథంతా కిరణ్, శాన్వీ పాత్రలే తిరిగినా...క్లైమాక్స్‌లో మాత్రం గోపరాజు రమణ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుడికి అలా గుర్తిండిపోతాయి. సెకండాఫ్‌లో సప్తగిరి తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. శివ నారాయణ, అన్నపూర్ణమ్మ, సద్దాం తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం శేఖర్ చంద్ర సంగీతం. పాటలతో అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. కథకు అనుగుణంగా పాటలు వస్తాయి. ఎక్కడా ఇరికించినట్లు అనిపించదు..అలా అని గుర్తిండిపోయే పాటలు కూడా కాదు. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ విప్లవ్ నైషధం తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్