Kiran Abbavaram Sammathame Movie Streaming On Aha From July 15th - Sakshi
Sakshi News home page

Sammathame OTT Release Date: అప్పుడే ఓటీటీకి సమ్మతమే మూవీ, స్ట్రీమింగ్‌ ఎ‍ప్పుడు, ఎక్కడంటే..

Published Thu, Jul 7 2022 1:48 PM | Last Updated on Thu, Jul 7 2022 3:28 PM

Kiran Abbavaram Sammathame Movie Streaming On Aha From July 15 - Sakshi

యంగ్‌ టాలెంటెడ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, హీరో చాందిని చౌదరిలు జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం సమ్మతమే. డైరెక్టర్‌ గోపీనాథ్‌రెడ్డి తెరక్కించిన ఈ చిత్రం ఇటీవల జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. కొన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగా.. మరికొన్ని వర్గాల ఆడియన్స్‌ను నిరాశ పరిచింది. దీంతో ఆ మూవీ యావరేజ్‌ టాక్‌ను తెచ్చుకుంది.

చదవండి: నేను ఇంతకాలం నటించకపోవడానికి కారణం ఇదే..

ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో సమ్మతమే మూవీ త్వరలో విడుదల కాబోతోంది. దీనిపై సదరు ఓటీటీ సంస్థ తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది. జూలై 15 అర్థరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుందంటూ ఆహా తమ అధికారిక ట్విటర్‌లో వెల్లడిచింది. యూజీ ప్రొడక్షన్స్‌ బ్యానరపై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి రావడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement