
ఉదయం 11 గంటల నుంచి district app లో విక్రయం
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతగడ్డపై ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు సంబంధించి టికెట్లను ఈరోజు ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారు. ఈనెల 23న ఉప్పల్ స్టేడియంలో జరిగే తమ తొలి లీగ్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సన్‌రైజర్స్ ఆడనుంది.
ఈ మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరుగుతుంది. అనంతరం ఈనెల 27న ఉప్పల్ స్టేడియంలోనే జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌ను రాత్రి గం. 7:30 నుంచి నిర్వహిస్తారు.
ఈ రెండు లీగ్ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్లను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మ్యాచ్‌ల అధికారిక టికెటింగ్ పార్ట్‌నర్ districtappలో district.in వెబ్‌సైట్‌లో ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment