SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా..! | IPL 2024: This Edition Has Takes Fewest Balls To Complete 1000 Sixes | Sakshi
Sakshi News home page

SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా..!

Published Wed, May 8 2024 9:14 PM | Last Updated on Wed, May 8 2024 9:22 PM

IPL 2024: This Edition Has Takes Fewest Balls To Complete 1000 Sixes

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా సిక్సర్ల మోత మోగుతుంది. ఈ సీజన్‌ మరో 18 మ్యాచ్‌లు మిగిలుండగానే 1000 సిక్సర్ల అత్యంత అరుదైన మైలురాయిని తాకింది. 

సన్‌రైజర్స్‌తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్‌లో కృనాల్‌ పాండ్యా కొట్టిన సిక్సర్‌తో ఈ సీజన్‌లో 1000 సిక్సర్లు పూర్తయ్యాయి. ఈ మైలురాయిని చేరుకునే క్రమంలో ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టింది. వెయ్యి సిక్సర్ల మార్కును అత్యంత వేగంగా చేరుకున్న సీజన్‌గా ఐపీఎల్‌ 2024 సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఐపీఎల్‌ చరిత్రలో 2022 (1062 సిక్సర్లు), 2023 (1124 సిక్సర్లు), 2024 సీజన్లలో మాత్రమే 1000కి పైగా సిక్సర్లు నమోదు కాగా.. ఈ సీజన్‌లోనే అత్యంత వేగంగా ఆ మార్కు తాకింది. 2022 సీజన్‌లో ఈ మార్కును తాకేందుకు 16269 బంతులు అవసరమైతే.. గత సీజన్‌లో 15390 బంతులు.. ఈ సీజన్‌లో అన్నిటికంటే తక్కువగా 13079 బంతుల్లోనే వెయ్యి సిక్సర్లు పూర్తయ్యాయి.

సన్‌రైజర్స్‌-లక్నో మ్యాచ్‌ విషయానికొస్తే.. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. 18 ఓవర్లు పూర్తయ్యాక లక్నో స్కోర్‌ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులుగా ఉంది. 

డికాక్‌ (2), స్టోయినిస్‌ (3), కృనాల్‌ పాండ్యా (24), రాహుల్‌ (29) ఔట్‌ కాగా.. పూరన్‌ (30), బదోని (39) క్రీజ్‌లో ఉన్నారు. భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుతమైన స్పెల్‌తో (4-0-12-3) లక్నోను దారుణంగా దెబ్బ కొట్టగా.. కమిన్స్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. కృనాల్‌ను కమిన్స్‌ అద్భుతమైన త్రోతో రనౌట్‌ చేశాడు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement