ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇవాళ (మే 8) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. విధ్వంసకర ఆటగాళ్లతో నిండిన సన్‌రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీకి సిద్దమయ్యాయి. సన్‌రైజర్స్ హోం గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగునుంది.
హైదరాబాద్‌లో నగరంలో నిన్న రాత్రి అతి భారీ వర్షం కురిసింది. ఇవాళ కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే నగరంలో ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే వరుణుడి నుంచి మ్యాచ్‌కు ఎలాంటి ముప్పు లేదని తెలుస్తుంది.
ప్రస్తుతం సన్‌రైజర్స్, ఎల్‌ఎస్‌జీ పాయింట్ల పట్టికలో సమవుజ్జీలుగా ఉన్నాయి. రెండు జట్లు చెరి 11 మ్యాచ్‌లు ఆడి ఆరింట గెలుపొందాయి. అయితే లక్నోతో పోలిస్తే సన్‌రైజర్స్ రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉండటంతో ఆ జట్టు మెరుగైన స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ నాలుగులో.. లక్నో ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి.
ఇరు జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సమానంగా ఉండటంతో ఈ మ్యాచ్ ఫలితం అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు టెన్షన్ లేకుండా తదుపరి మ్యాచ్‌కు వెళ్లవచ్చు. ఇరు జట్ల ఈ సీజన్‌లో ఇదే తొలి మ్యాచ్. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా.. అన్ని సందర్భాల్లో లక్నోనే విజయం సాధించింది.
మరో మూడేస్తే..
ఇక ఈ మ్యాచ్ ఓ భారీ మైలురాయికి వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో మరో మూడు సిక్సర్లు నమోదైతే ఈ సీజన్‌లో 1000 సిక్సర్లు (అన్ని జట్లు కలిపి) పూర్తవుతాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన సీజన్‌గా ఐపీఎల్ 2023 ఉంది.
గత సీజన్‌లో రికార్డు స్థాయిలో 1124 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇంకా 18 మ్యాచ్‌లు మిగిలుండగానే 1000 సిక్సర్లు మార్కు తాకితే ఆల్‌టైమ్ హైయెస్ట్ సిక్సర్ల రికార్డు బద్దలవడం ఖాయం. నేటి మ్యాచ్‌లో తలపడబోయే సన్‌రైజర్స్, లక్నో జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌లో కనీసం 20 సిక్సర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
సీజన్ల వారీగా సిక్సర్లు..
2008- 622
2009- 506
2010- 585
2011- 639
2012- 731
2013- 672
2014- 714
2015- 692
2016- 638
2017- 705
2018- 872
2019- 784
2020- 734
2021- 687
2022- 1062
2023- 1124
2024- 997*
Comments
Please login to add a commentAdd a comment