సెలవులపై ఇంటికొచ్చి మృత్యు ఒడికి.. విద్యుత్‌ షాక్‌తో జవాన్ మృతి.. | Mulugu Vajedu ITBP Jawan Electrocuted To Death | Sakshi
Sakshi News home page

భార్యాబిడ్డలతో గడపాలని నెల రోజులు సెలవు పెట్టి ఇంటికి.. విద్యుత్ షాక్‌తో చనిపోయిన జవాన్‌..

Published Sun, Apr 23 2023 8:31 AM | Last Updated on Sun, Apr 23 2023 10:24 AM

Mulugu Vajedu ITBP Jawan Electrocuted To Death - Sakshi

సాక్షి, ములుగు: సెలవుపై ఇంటికి వచ్చిన ఐటీబీపీ జవాన్‌ విద్యుత్‌ షాక్‌ తో మృతిచెందాడు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని శ్రీరామ్‌నగర్‌లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. తాటి మహేంద్ర కుమార్‌ (29) ఐటీబీపీ 53 బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఛత్తీ›స్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లా సోంపూర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది హనుమకొండ జిల్లాకు చెందిన ప్రసన్నతో వివాహం జరిగింది. ఈ మధ్యనే వారికి పాప పుట్టింది.

భార్యాబిడ్డలతో గడపాలని నెల రోజులపాటు సెలవు పెట్టి మార్చి 30న సొంత ఊరైన శ్రీరామ్‌నగర్‌ వచ్చాడు. శనివారం కూలర్‌లోని నీటిపంపు పనిచేయకపోవడంతో దానిని పరిశీలిస్తున్న సమయంలో విద్యుత్‌ షాక్‌కుగురై మహేంద్ర కింద పడి పోయాడు. ఈ విషయాన్ని గమనించిన ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు మహేంద్రను మొదట వాజేడు, అక్కడినుంచి ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు. మహేంద్ర కుమార్‌ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందిననట్లు తెలిపారు. బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
చదవండి: తండ్రిని చంపిన కిరాతకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement