
మృతురాలు కవిత (ఫైల్)
విజయపుర (బెంగళూరు గ్రామీణం): భర్త దేశ రక్షణ కోసం చెమటోడుస్తుంటే, ఆయన భార్యను ఓ మృగాడు వేధింపులకు గురిచేయసాగాడు. ఆ అభాగ్యురాలు చివరకు సజీవ దహనం చేసుకుని తనువు చాలించింది. ఈ విషాద ఘటన గురువారం గ్రామీణ జిల్లా దేవనహళ్లి తాలూకాలో చోటు చేసుకుంది. వివరాలు.. తాలూకాలోని కొమ్మసంద్రకు చెందిన కవిత (35)కు విజయపుర పట్టణానికి చెందిన నటరాజు జవాన్‌తో అనే వ్యక్తితో సుమారు 12 ఏళ్లక్రితం వివాహమైంది.
భర్త గౌహతిలో సైన్యంలో పనిచేస్తుంటే, ఆమె విజయపుర పట్టణంలోనే కొడుకుతో కలిసి నివసిస్తోంది. భర్త అప్పుడప్పుడు సెలవు మీద వచ్చి వెళ్తుండేవాడు. కవిత ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతుండేవారు. ఈ క్రమంలో సాయికృష్ణ అనే యువకుడు కొద్దిరోజులుగా కవితను ప్రేమిస్తున్నాను అని వేధించడం ప్రారంభించాడు. వేధింపులు తీవ్రం కావడంతో ఆమె జీవితం మీద విరక్తిచెంది బుధవారం ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా తన ఆత్మహత్యకు సాయికృష్ణ వేధింపులే కారణమని మరణ వాంగ్మూలమచ్చింది. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసింది. పట్టణ పోలీసులు సాయికృష్ణను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment