ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార ఎంట్రీ.. ఫాలో అయ్యేది ఆ ఐదుగురిని మాత్రమే | Nayanthara Makes Instagram Entry Debut | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార ఎంట్రీ.. తొలిసారి తన పిల్లల ఫోటోలు రివీల్‌

Published Thu, Aug 31 2023 3:56 PM | Last Updated on Thu, Aug 31 2023 4:05 PM

Nayanthara Makes Instagram Entry Debut - Sakshi

సౌత్‌ ఇండియా లేడీ సూపార్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న  నయనతార ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. నేడు అందరూ రాఖీ పండుగ సెలబ్రేషన్‌లో ఉండగా నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టింది. మొదటగా తన ఇద్దరు కుమారులతో (ఉయిర్, ఉలగం)  కలిసి ఉన్న స్టైలిష్ వీడియోను షేర్ చేసింది.  నయనతార ఇన్‌స్టాలో అకౌంట్‌ ఓపెన్‌ చేసిన వెంటనే భారీగా వైరల్‌ కావడంతో ఆమెను లక్షల మంది ఫాలో అయ్యారు. ఆమె పెట్టిన రీల్‌ను కూడా ఇప్పటికే ఐదు లక్షలకు పైగా లైక్‌ చేయగా.. రెండు మిలియన్‌ వ్యూవ్స్‌ వచ్చాయి.

(ఇదీ చదవండి: హీరో గోపీచంద్‌ని అసభ్య పదజాలంతో దూషించిన డైరెక్టర్‌)

ఇప్పటికే సౌత్‌ ఇండియాలో గుర్తింపు తెచ్చుకుని జవాన్‌ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నయన్‌కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్‌ ఉన్నారు. తన కుమారుల ఫోటోలను ఇప్పటి వరకు ఎక్కడా రివీల్‌ చేయని నయన్‌ తొలిసారి ఇలా షేర్‌ చేయడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. జవాన్‌తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న నయన్‌ ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆమెకు ఇప్పటి వరకు ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్ చేయలేదు. తనకు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు భర్త విఘ్నేష్ శివన్ షేర్‌ చేస్తూ వచ్చేవాడు.

(ఇదీ చదవండి: హీరోయిన్‌తో ఐఆర్ఎస్‌ అధికారి రిలేషన్‌.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు)

'జైలర్‌'లోని హుకుమ్‌ పాట బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో తన కవలలను ఎత్తుకుని మాస్‌ లెవెల్లో ఎంట్రీ ఇచ్చిన నయన్‌ తన ఇన్‌స్టాలో మాత్రం కేవలం ఐదుగురిని మాత్రం ఫాలో అవుతుంది. అందులో తన భర్త విఘ్నేశ్‌, హీరో షారుక్‌ ఖాన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌, ఒబామా భార్య మిషెల్లి ఒబామాతో పాటు తన సొంత ప్రొడక్షన్‌ సంస్థ అయిన 'ది రౌడీ పిక్చర్స్‌' ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement