పుణే: కేంద్ర ప్రభుత్వ రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) సొంతంగా అభివృద్ధి చేసిన అస్సాల్ట్ రైఫిల్ ఉగ్రమ్‌ను సోమవారం పరీక్షించింది. డీఆర్‌డీవోకు చెందిన పుణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్స్(ఏఆర్‌డీఈ)విభాగం భారత సైన్యం అవసరాలకు అనుగుణంగా దీనిని రూపొందించింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో 4 కిలోల కంటే తక్కువ బరువుండే ప్రొటోటైప్ అస్సాల్ట్ రైఫిల్‌ను సోమవారం పరీక్షించారు. ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి గత మూడేళ్లుగా అస్సాల్ట్ రైఫిల్‌ను డిజైన్ చేసినట్లు ఏఆర్‌డీఈ డైరెక్టర్ ఎ.రాజు చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రయోగాలు జరిపేందుకు ముందుగా స్వతంత్ర నిపుణుల కమిటీ పర్యవేక్షణలో ట్రయల్స్ ఉంటాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment