లాస్ ఏంజెలిస్: అమెరికాలో లోకం తెలియని పిల్లలు తుపాకులు పేల్చిపారేస్తున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. తాజాగా శుక్రవారం యూటా రాష్ట్రం కేచీ కౌంటీలో మూడేళ్ల పాప పొరపాటున రైఫిల్‌తో రెండేళ్ల వయసున్న తమ్ముడిని కాల్చేసింది. పొట్టలో తీవ్ర తూటా గాయంతో బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
ఈ ఘటన కు కాసేపు ముందు ఇంట్లోని పెద్దలు ఈ రైఫిల్‌ను వాడి లివింగ్ రూమ్‌లో ఉంచారు. ఈ నెలలో అమెరికాలో పిల్లలు తుపాకులతో పొరపాటున ఎదుటి మనుషులను చంపడం ఇది నాలుగోసారి. గురువారం దక్షిణ కరోలినాలో ఓ కారులో ప్రయాణిస్తున్న ఆరే ళ్ల బాలుడు పొరపాటున తుపాకీ కాల్చడంతో ముందు సీట్లోని మహిళ మృతిచెందింది.
మూడేళ్ల పాప కాల్పుల్లో రెండేళ్ల తమ్ముడి మృతి
Published Tue, Apr 22 2014 5:00 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement