జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. భద్రతా బలగాలు అప్రమత్తం | Terrorist Attack Again in Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. భద్రతా బలగాలు అప్రమత్తం

Published Tue, Aug 20 2024 9:59 AM | Last Updated on Tue, Aug 20 2024 10:28 AM

Terrorist Attack Again in Jammu and Kashmir

జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో తాజాగా జరిగిన ఉగ్రదాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ఇన్‌స్పెక్టర్ ఒకరు మృతిచెందారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో పాటు  జమ్ముకశ్మీర్ పోలీసులు డూడు ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఉగ్రవాదులు  సీఆర్‌పీఎఫ్‌ సైనికులపై దాడి చేశారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు అందుకు ధీటుగా సమాధానమిచ్చాయి. డూడూ ప్రాంతంలోని చీల్‌లో ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.
 

 

 ఈ ఎన్‌కౌంటర్ గురించి ఉధంపూర్ డీఐజీ రయీస్ మహ్మద్ భట్ మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ పోలీసుల జాయింట్ టీమ్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఒక సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ వీరమరణం పొందారని, ఈ దాడిలో మరో సీఆర్‌పీఎఫ్ అధికారి గాయపడ్డారని తెలిపారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. కాగా ఇటీవలి కాలంలో జమ్మూ  పరిధిలోని పీర్ పంజాల్‌లోని దక్షిణ ప్రాంతాలలో ఉగ్ర దాడులతోపాటు, ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. పీర్ పంజాల్‌లోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారని పోలీసులు భావిస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement