పుల్వామా ఎన్‌కౌంటర్‌: జవాన్‌ మృతి | CRPF Jawan Killed In Encounter In Pulwama | Sakshi
Sakshi News home page

పుల్వామా ఎన్‌కౌంటర్‌: జవాన్‌ మృతి

Published Sat, May 12 2018 12:34 PM | Last Updated on Sat, May 12 2018 12:42 PM

CRPF Jawan Killed In Encounter In Pulwama - Sakshi

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవాన్‌ మృతి చెందగా, మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. పుల్వామాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో భద్రతా దళాలు  నిన్న రాత్రి చినార్ బాగ్, మొహల్లా తకియా ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. ఉగ్రవాదులు తలదాచుకున్న ఓ ఇంటిని  చుట్టిముట్టాయి. దీంతో ఒక్కసారిగా ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపారు. తీవ్రవాదులను నిలువరించే క్రమంలో మన్‌దీప్‌ కుమార్‌ అనే జవాన్‌ ప్రాణాలను కోల్పోయారు. కాల్పుల్లో గాయపడ్డ పౌరులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్థానిక అధికారి ఒకరు వెల్లడించారు.భద్రతా దళాలు ధీటుగా ఎదురు కాల్పులు జరపడంతో.. రాళ్ల దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు చాకచక్యంగా అక్కడినుంచి పారిపోయినట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement