
శ్రీనగర్: కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. సాధారణ ప్రజానీకంపైకి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు దక్షిణ కాశ్మీర్‌లోని అనంత నాగ్‌లో అల్లరి మూకలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. బందోబస్తులో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులకు అల్లరిమూకలకు మధ్య ఘర్షణ చోటుకుంది. అల్లరిమూకలులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దీంతో అనంతనాగ్ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలికొంది.
ముగ్గురు వేర్పాటువాదులు అరెస్ట్
ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నారన్న ఆరోపణపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కశ్మీర్‌కు చెందిన వేర్పాటువాదులు షబ్బీర్‌షా, ఆసియా అంద్రబి, మసారత్ ఆలంభట్‌ను అరెస్టు చేసింది. ఆ ముగ్గురికి ఢిల్లీ కోర్టు 10 రోజుల పోలీసు కస్టడీ విధించింది. ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి హఫీజ్‌సయీద్‌కు చెందిన జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థకు కశ్మీర్ లోయ నుంచి నిధులు అందుతున్నాయన్న ఆరోపణపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఢిల్లీలో ప్రత్యేక జడ్జి రాకేశ్ సయాల్ మంగళవారం విచారణ జరిపారు. ఈ సమయంలోనే ఆ ముగ్గురిని ఎన్‌ఐఏ అరెస్టు చేసిందని నిందితుల తరఫు న్యాయవాది వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment