Ananth Nag
-
'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'సలార్' టీజర్ విడుదలైపోయింది. యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది. మొత్తం టీజర్ లో ప్రభాస్ ని 10 సెకన్లకు మించి చూపించలేదు. ఇదే అభిమానులని డిసప్పాయింట్ చేసింది. అయితే ఇదే టీజర్లో 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత మాత్రం బాగా హైలెట్ అయ్యాడు. తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఈ నటుడు ఎవరు? ఇంతకీ అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? కొత్త తాత వచ్చాడ్రోయ్ ప్రశాంత్ నీల్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది 'కేజీఎఫ్'. ఆ సినిమాలో రాకీభాయ్ గా యష్ ఎంత హైలెట్ అయ్యాడో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలానే రాకీ పాత్రకు ప్రతి సీన్ లో నెక్స్ లెవల్ ఎలివేషన్స్ ఇచ్చిన తాత కూడా మనకు తెగ నచ్చేశాడు. ఆయన కన్నడ నటుడు అనంత్ నాగ్. ఇప్పుడు ఆ తాతని బీట్ చేసేందుకు ప్రశాంత్ నీల్.. కొత్త తాతని బరిలో దింపాడు. ఆయనే 'సలార్' టీజర్ లో ప్రభాస్ కి ఎలివేషన్స్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: సేమ్ టు సేమ్..‘సలార్’ టీజర్లో ఇది గమనించారా?) తాత బ్యాక్ గ్రౌండ్ ఇదే 'సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా డేంజర్.. కానీ జురాసిక్ పార్క్‌లో కాదు.. ఎందుకంటే అక్కడ ఉండేది డైనోసార్' అనే డైలాగ్ తో 'సలార్' టీజర్ లో తాతగా కనిపించిన నటుడు టీనూ ఆనంద్. ప్రభాస్ తో అతడికి ఇది రెండో సినిమా. 'సాహో'లోనూ ఇతడు నటించాడు. అయితే తెలుగులో టీనూ ఆనంద్ మొదటగా బాలకృష్ణ 'ఆదిత్య 369' మూవీలో నటించాడు. చిరంజీవి 'అంజి'లోనూ భాటియా అనే పాత్రలో విలనిజం పండించాడు. ఫ్యామిలీ అంతా నటులే గతేడాది వచ్చిన 'సీతారామమ్'లో ఆనంద్ మెహతా అనే పాత్రలో కనిపించింది టీనూనే. ఆయన ఫ్యామిలీలో టీనూతో పాటు దాదాపు అందరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఈయన మేనల్లుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. 'పఠాన్', 'వార్', 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రాలతో బాలీవుడ్ కి బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చింది ఇతడే. సరే ఇది పక్కనబెడితే టీనూ ఆనంద్ లో నటుడితోపాటు రైటర్, డైరెక్టర్, ప్రొడ్యుసర్ కూడా ఉన్నాడండోయ్. గతంలో హిందీ సినిమాల్లో ఎక్కువగా కనిపించాడు. పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ఇప్పటి ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్నాడు. (ఇదీ చదవండి: ఫ్యాన్స్ అసంతృప్తి ..సలార్ క్యాప్షన్‌కు అర్థం తెలుసా?) -
ముందుంది ఎన్నికల సమరం.. బీజేపీలోకి కేజీఎఫ్ నటుడు!
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు, మాజీ మంత్రి అనంత్ నాగ్ బీజేపీలో చేరనున్నారు. ఎమ్మెల్యేగా, పరిషత్ సభ్యుడిగా పనిచేసిన అనంత్ నాగ్, జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 2004లో చామరాజ్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపు పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి అనంత్ నాగ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల బ్లాక్‌బస్టర్ కేజీఎఫ్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరేందుకు బీజేపీ మంత్రులు మునిరత్న, డాక్టర్ కే సుధాకర్‌లు అనంత్‌నాగ్‌ను ఒప్పించినట్లు సమాచారం. మరో వైపు రానున్న కర్టాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర నేతలు కర్ణాటకలో భారీగా ప్రచార కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళూరు, ఉడిపి, చక్కమగళూరు హాసన్ కార్యక్రమాల్లో నడ్డా పాల్గొన్నారు. ప్రధాని కూడా త్వరలో షిమోగాలో పర్యటించి మహా సమ్మేళనంలో ప్రసంగించనున్నారు. కర్టాటకలో మరో సారి గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి అతిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు.. ఇదేమైనా ఇంగ్లాండా? సీఎం నితీష్ ఆగ్రహం -
కశ్మీర్లో కాల్పులు.. మహిళ మృతి
శ్రీనగర్: కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. సాధారణ ప్రజానీకంపైకి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు దక్షిణ కాశ్మీర్‌లోని అనంత నాగ్‌లో అల్లరి మూకలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. బందోబస్తులో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులకు అల్లరిమూకలకు మధ్య ఘర్షణ చోటుకుంది. అల్లరిమూకలులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దీంతో అనంతనాగ్ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలికొంది. ముగ్గురు వేర్పాటువాదులు అరెస్ట్ ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నారన్న ఆరోపణపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కశ్మీర్‌కు చెందిన వేర్పాటువాదులు షబ్బీర్‌షా, ఆసియా అంద్రబి, మసారత్ ఆలంభట్‌ను అరెస్టు చేసింది. ఆ ముగ్గురికి ఢిల్లీ కోర్టు 10 రోజుల పోలీసు కస్టడీ విధించింది. ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి హఫీజ్సయీద్కు చెందిన జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థకు కశ్మీర్ లోయ నుంచి నిధులు అందుతున్నాయన్న ఆరోపణపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఢిల్లీలో ప్రత్యేక జడ్జి రాకేశ్ సయాల్ మంగళవారం విచారణ జరిపారు. ఈ సమయంలోనే ఆ ముగ్గురిని ఎన్ఐఏ అరెస్టు చేసిందని నిందితుల తరఫు న్యాయవాది వెల్లడించారు. -
వారి కంటే శింబు బెటర్
పెరంబూరు: రజనీకాంత్, కమలహాసన్‌ల కంటే యువ నటుడు శింబు సమయోచితంగా వ్యవహరిస్తున్నారని కన్నడ సీనియర్ నటుడు అనంతనాగ్ వ్యాఖ్యానించారు. కావేరి బోర్డు వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం తీరు, నటులు రజనీకాంత్, కమలహాసన్ వ్యాఖ్యలపై ఈయన స్పందించారు. రాజకీయ రంగప్రవేశం చేసిన తరువాత రజనీ, కమల్ల నుంచి తాను ఎంతో ఆశించానని అయితే వారు పాత విధానంలోనే రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తాను తమిళులకు వ్యతిరేకిని కానని, తమిళులు మంచి వారు, సహృదయులు అని అన్నారు. కన్నడిగులతో సన్నిహితంగా మెలుగుతారన్నారు. కర్ణాటకలో మరో నెలలో కొత్త ప్రభుత్వం రానుందని, ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయని అన్నారు. అదే విధంగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందన్నారు. తమిళనాడులో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదని, అయినా వారు ఎందుకు ఉద్రేకానికి గురవుతున్నారని ప్రశ్నించారు. నటుడు శింబు ఎలాంటి పోరాటం లేకుండా కావేరి వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు నీటిని ఇవ్వాలని కోరుతూ విజ్ఞతతో వ్యాఖ్యలు చేశారని, ఆయనలాంటి పరిణితి రజనీ, కమల్లో లేకపోవడం చూసి దిగ్భ్రాంతి చెందానన్నారు. ఆఫ్రికాలోని నైల్నది సమస్య కూడా పరిష్కరమైందని, అలాంటిది కావేరి సమస్యకు పరిష్కారం లభించాలని తమిళ ప్రభుత్వం కోరుకోవడం లేదన్నారు. కన్నడిగులు మంచి వారని, కావేరి వ్యవహారంలో తమిళ రాజకీయ నాయకుల చేతకాని తనంగా భావిస్తున్నారని, వారికి తాము తగిన రీతిలో బదులిస్తామని నటుడు అనంతనాగ్ పేర్కొన్నారు. -
అనంత్‌నాగ్ ఉప ఎన్నిక వాయిదా
-
అనంత్‌నాగ్ ఉప ఎన్నిక వాయిదా
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానానికి బుధవారం జరగాల్సిన ఉప ఎన్నిక మే 25కు వాయిదా పడింది. శాంతి భద్రతలు అదుపులో లేవని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నివేదించడంతో ఎన్నికల సంఘం (ఈసీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఉపఎన్నికకు పోలింగ్ జరగాల్సిన రెండు బూత్‌లకు దుండగులు ఆదివారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. దీంతో అనంత్‌నాగ్ నియోజకవర్గ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. -
ఆరేళ్ల మగధీరుడు..
హైదరాబాద్: చల్‌చల్ గుర్రం చలాకి గుర్రం అంటూ ఆడుకోవాల్సిన వయసులో ఈ బుడతడు అసలుసిసలైన గుర్రాన్ని దౌడు తీయిస్తున్నాడు. చిన్న వయసులోనే గుర్రపు స్వారీ నేర్చుకుని స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. కుత్బుల్లాపూర్ పరిధిలోని కొంపల్లికి చెందిన లక్ష్మయ్య కుమారుడు అనంత్ నాగ్ ఆరేళ్ల వయసులోనే గుర్రపు స్వారీలో ఆరితేరాడు. స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న అనంత్ నాగ్‌కు చిన్నప్పటి నుంచి గుర్రాలు అంటే అమితమైన ఇష్టం.. దాన్ని గుర్తించిన తండ్రి వేసవి సెలవుల్లో గుర్రపు స్వారీలో శిక్షణ ఇప్పించారు. దీంతో ఇలా గుర్రంపై దౌడుతీస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తూ, చుట్టుపక్కల వారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు ఈ చిచ్చర పిడుగు.