డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'సలార్' టీజర్ విడుదలైపోయింది. యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది. మొత్తం టీజర్ లో ప్రభాస్ ని 10 సెకన్లకు మించి చూపించలేదు. ఇదే అభిమానులని డిసప్పాయింట్ చేసింది. అయితే ఇదే టీజర్‌లో 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత మాత్రం బాగా హైలెట్ అయ్యాడు. తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఈ నటుడు ఎవరు? ఇంతకీ అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
కొత్త తాత వచ్చాడ్రోయ్
ప్రశాంత్ నీల్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది 'కేజీఎఫ్'. ఆ సినిమాలో రాకీభాయ్ గా యష్ ఎంత హైలెట్ అయ్యాడో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలానే రాకీ పాత్రకు ప్రతి సీన్ లో నెక్స్ లెవల్ ఎలివేషన్స్ ఇచ్చిన తాత కూడా మనకు తెగ నచ్చేశాడు. ఆయన కన్నడ నటుడు అనంత్ నాగ్. ఇప్పుడు ఆ తాతని బీట్ చేసేందుకు ప్రశాంత్ నీల్.. కొత్త తాతని బరిలో దింపాడు. ఆయనే 'సలార్' టీజర్ లో ప్రభాస్ కి ఎలివేషన్స్ ఇచ్చాడు.
(ఇదీ చదవండి: సేమ్ టు సేమ్..‘సలార్’ టీజర్‌లో ఇది గమనించారా?)
తాత బ్యాక్ గ్రౌండ్ ఇదే
'సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా డేంజర్.. కానీ జురాసిక్ పార్క్‌లో కాదు.. ఎందుకంటే అక్కడ ఉండేది డైనోసార్' అనే డైలాగ్ తో 'సలార్' టీజర్ లో తాతగా కనిపించిన నటుడు టీనూ ఆనంద్. ప్రభాస్ తో అతడికి ఇది రెండో సినిమా. 'సాహో'లోనూ ఇతడు నటించాడు. అయితే తెలుగులో టీనూ ఆనంద్ మొదటగా బాలకృష్ణ 'ఆదిత్య 369' మూవీలో నటించాడు. చిరంజీవి 'అంజి'లోనూ భాటియా అనే పాత్రలో విలనిజం పండించాడు.
ఫ్యామిలీ అంతా నటులే
గతేడాది వచ్చిన 'సీతారామమ్'లో ఆనంద్ మెహతా అనే పాత్రలో కనిపించింది టీనూనే. ఆయన ఫ్యామిలీలో టీనూతో పాటు దాదాపు అందరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఈయన మేనల్లుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. 'పఠాన్', 'వార్', 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రాలతో బాలీవుడ్ కి బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చింది ఇతడే. సరే ఇది పక్కనబెడితే టీనూ ఆనంద్ లో నటుడితోపాటు రైటర్, డైరెక్టర్, ప్రొడ్యుసర్ కూడా ఉన్నాడండోయ్. గతంలో హిందీ సినిమాల్లో ఎక్కువగా కనిపించాడు. పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ఇప్పటి ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: ఫ్యాన్స్ అసంతృప్తి ..సలార్ క్యాప్షన్‌కు అర్థం తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment