Producer Karthik Gowda React On KGF Chapter 2’s Climax Interconnected With Salaar Teaser - Sakshi
Sakshi News home page

Salaar Teaser KGF Connection: సంబంధం నిజమేనా? నిర్మాత రియాక్షన్ ఇదే

Published Wed, Jul 5 2023 2:49 PM | Last Updated on Wed, Jul 5 2023 3:27 PM

Salaar Teaser Kgf Connection Producer Karthik Gowda Respond - Sakshi

'సలార్' టీజర్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. టెన్షన్‌తో ఫ్యాన్స్ ఇప్పటికే మెంటలెక్కిపోతున్నారు. అది వచ్చేలోపు హైప్ తోనే పోయేలా ఉన‍్నారు. ఎందుకంటే ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' కొన్నిరోజుల ముందు థియేటర్లలోకి వచ్చింది. కానీ ఘోరంగా ఫెయిలైంది. దీంతో అభిమానుల ఆశలన్నీ 'సలార్'పైనే పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదంతా కాదన్నట్లు ఈ మూవీకి 'కేజీఎఫ్'తో కనెక్షన్ ఉందనే టాక్ ఫుల్ వైరల్ అవుతోంది. 

(ఇదీ చదవండి: 'స్పై' సినిమా ఎఫెక్ట్‌.. సారీ చెప్పిన హీరో నిఖిల్)

'కేజీఎఫ్' రెండు పార్డ్స్‌తో వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం చేస్తున్న మూవీ 'సలార్'. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ స్టోరీతో, ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాంటిదైతే కోరుకుంటున్నారో సరిగ్గా అలానే ఉండబోతుంది. అయితే సలార్ టీజర్ ని జూలై 6న ఉదయం 5:12 గంటలకు రిలీజ్ చేస్తామనడంపై ఫ్యాన్స్ రకరకాల థియరీలు అల్లేసుకున్నారు. 

'కేజీఎఫ్ 2' క్లైమాక్స్ లో రాకీభాయ్ పై సరిగ్గా ఉదయం 5:12 గంటల సమయంలోనే ఎటాక్ జరిగిందని, అందుకే 'సలార్' టీజర్ ని అదే టైమ్‌కి రిలీజ్ చేస్తున్నారని నెటిజన్స్ తెగ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడీ విషయం నిర్మాత కార్తీక్ గౌడ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయనే స్వయంగా స్పందించారు. 'ఇదంతా చూస్తుంటే మా అందరి ముఖంపై స్మైల్ వస్తోంది' అని రీట్వీట్ చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే సలార్-కేజీఎఫ్ కనెక్షన్ నిజమేనని దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న 'టక్కర్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement