సినిమా తీసే ప్రతివోడు డైరెక్టర్ కాదు! ఎందుకంటే ప్రేక్షకుడి పల్స్ తెలియాలి. ఎక్కడ ఏ సీన్ పడితే టాప్ లేచిపోద్దో తెలిసుండాలి. అయితే ఈ విషయంలో చాలామంది డిగ్రీలు చేస్తే.. మనోడు మాత్రం ఏకంగా పీహెచ్‌డీ చేసి పడేశాడు. లేకపోతే ఏంటి.. ఊరమాస్ చిత్రాలు తీయడంలో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. ఇతడు సినిమా అంటే.. ఆయా హీరోల ఫ్యాన్స్ తడిగుడ్డ వేసుకుని హాయిగా పడుకోవచ్చు. ఎందుకంటే మనోడి రేంజ్ అలాంటిది మరి. మూవీలో హీరోయిన్ ఉన్నాలేకపోయినా సరే బొగ్గు మాత్రం గ్యారంటీగా ఉండాలి. అలా బొగ్గుతో బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన వ్యక్తే డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇంతకీ మనోడు సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఇన్ని హిట్స్ ఎలా కొడుతున్నాడు?
డబ్బుల కోసం సినిమాల్లోకి
ఎవరైనా సరే పిచ్చితో సినిమాల్లోకి వస్తారు. ప్రశాంత్ నీల్ మాత్రం అనుకోకుండా, అది కూడా డబ్బులు సంపాదిద్దామని డైరెక్షన్ కోర్స్ చేశాడు. ఇందులో డెప్త్ అర‍్థమయ్యేసరికి.. కొడితే కుంభస్థలం కొట్టాలని ఫిక్సయ్యాడు. డైరెక్టర్ అయిపోయాడు. ఏ ఇండస్ట్రీలోనైనా కొత్తోళ్లకు ఛాన్సులంటే చాలా కష్టం. దీంతో మాస్టర్ స్కెచ్ వేసి.. అప్పటికే కన్నడలో హీరోగా ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్న తన బావ శ్రీమురళికి ఓ కథ వినిపించాడు. అనుభవం లేకపోవడం, స్క్రిప్ట్ పెద్దగా నచ్చకపోయేసరికి.. శ్రీమురళి దీన్ని లైట్ తీసుకున్నాడు.
(ఇదీ చదవండి: 2023 Roundup: స్టార్ డైరెక్టర్స్‌కి ఈ సినిమాలు తెగ నచ్చేశాయ్.. ఇవన్నీ ఆ ఓటీటీల్లో!)
దీంతో ప్రశాంత్ నీల్ మనసు మారింది. శ్రీమురళిని దగ్గరుండి బాగా అబ్జర్వ్ చేస్తూ 'ఉగ్రం' అనే మాస్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఇది శ్రీమురళికి నచ్చేయడంతో సినిమా మొదలైంది. కట్ చేస్తే థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. 2014లో కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ నీల్ అంటే ఎవరబ్బా? అని అందరూ మాట్లాడుకునేలా చేసింది. దీనిదెబ్బకు మనోడికి చాలా ఛాన్సులు వచ్చినా సరే యశ్ కోసం 'కేజీఎఫ్' స్క్రిప్ట్ రెడీ చేశాడు. కోలార్ గోల్డ్ గనుల గురించి అందరూ విన్నారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం దానిపై ఓ సినిమా తీయాలనుకున్నాడు. అలా 'కేజీఎఫ్'కి బీజం పడింది.
ఫేట్ మార్చిన 'కేజీఎఫ్'
ప్రశాంత్ నీల్ 'ఉగ్రం' మూవీలో మాస్ అనే పదానికి శాంపిల్ చూపించాడు. 'కేజీఎఫ్'లో ఊరమాస్ అంటే ఏంటో డెఫినిషన్ రాసిపడేశాడు. సినిమా ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్‌లో ఎండ్ కార్డ్ పడేవరకు ఎలివేషన్స్ ఎలా ఇవ్వొచ్చో అనే విషయంలో చాలామంది దర‍్శకులకు మనోడు గురువు అయిపోయాడు. సాధారణంగా మాస్ సినిమాల్లో కథకి పెద్దగా స్పేస్ ఉండదు. ఒకవేళ స్టోరీ ఉంటే ఎలివేషన్స్‌కి ప్లేస్ ఉండదు. కానీ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో ప్రశాంత్ నీల్ కింగ్ అయిపోయాడు. దీని తర్వాత ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి గానీ 'కేజీఎఫ్'ని, ప్రశాంత్ నీల్‌ని ఎవరూ మ్యాచ్ చేయలేకపోయారు. అలానే 'కేజీఎఫ్' దెబ్బకు ప్రశాంత్ నీల్ ఫేటే మారిపోయింది.
(ఇదీ చదవండి: 'సలార్' కలెక్షన్స్ రచ్చ.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు)
మందు-బొగ్గు కంపల్సరీ
ప్రశాంత్ ఇలాంటి సినిమాలు ఎలా తీస్తాడబ్బా అని చాలామందికి డౌట్. అయితే మందు తాగిన తర్వాతే ఈ స్టోరీలన్నీ రాస్తుంటానని గతంలో ఓసారి ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. స్టోరీ రాయడానికి మందు ఎలా ఇంపార్టెంటో.. కథ ఏదైనా సరే బొగ్గు కూడా అంతే ఇంపార్టెంట్. 'ఉగ్రం'లో జస్ట్ శాంపిల్‌గా ఉంటే.. 'కేజీఎఫ్', 'సలార్' మొత్తం బొగ్గే కనిపిస్తుంది. అయితే తనకున్న ఓసీడీ సమస్య వల్లే ఇలా అంతా బ్లాక్ ఉంటుందని చెప్పాడు. అయితే కలర్‌ఫుల్‌గా ఉంటేనే సినిమా చూస్తారు అనే దాన్ని కూడా ప్రశాంత్ నీల్.. బొగ్గుపై తనకున్న ఇష్టంతో బ్రేక్ చేసి పడేశాడు. అలానే హీరోని చూపించాల్సిన పనిలేకుండా హీరో పిడికిలి, నీడ లాంటి వాటితోనూ ఎలివేషన్స్ ఇవ్వొచ్చనే ఆలోచన ప్రశాంత్ నీల్‌కి సాధ్యమైందని చెప్పొచ్చు.
తెలుగోడు కాబట్టే?
ప్రస్తుతం నార్త్-సౌత్ సినిమాల్లో తెలుగోళ్ల హవా కనిపిస్తుంది. అలానే ప్రశాంత్ నీల్ మూలాలు కూడా తెలుగు నేలపైనే ఉన్నాయి. ఉమ్మడి అనంతపురంలో మడకశిర మండలంలోని నీలకంఠాపురం ఇతడి సొంతూరు. కానీ ప్రశాంత్ నీల్ పుట్టకముందే అతడి తల్లిదండ్రులు బెంగళూరులో సెటిలైపోయారు. అలా కన్నడ వ్యక్తి అయ్యాడు. కానీ దాదాపు 25 ఏళ్ల నుంచి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాడు. ఆ ప్రభావమో ఏమో గానీ మనోడి సినిమాల్లో మాస్, ఎలివేషన్స్ అన్నీ కూడా తెలుగు ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చేస్తున్నాయి. తాజాగా ప్రభాస్ 'సలార్' కూడా అలాంటి మూవీనే. ఇక ప్రశాంత్ నెక్స్ట్ మూడు సినిమాలు.. ఎన్టీఆర్, ప్రభాస్, యశ్‌తోనే. ఏదేమైనా సరే ఇలా ప్రశాంత్ నీల్ మరిన్ని మాస్ సినిమాలు తీస్తూ.. ఇండియాలో థియేటర్లన్నీ ఊగిపోయేలా చేయాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.
(ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!)
Comments
Please login to add a commentAdd a comment