'సలార్' టీజర్ అనుకున్నంతగా లేదు. కరెక్ట్‌గా చెప్పాలంటే మనలో చాలామందికి నచ్చలేదు. ఫ్యాన్స్ ఆహా ఓహో అంటున్నారు గానీ వాళ‍్లలో చాలామందికి ఓకే అనిపించింది. ప్రభాస్‌ని వేరే లెవల్లో చూపిస్తారని, ఓ రేంజ్ ఎలివేషన్స్ ఉంటాయని వాళ్లు మెంటల్‌గా ఫిక్సయ్యారు. కానీ దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. అందరూ టీజర్ నచ్చలేదు, నచ్చలేదు అంటున్నారు కానీ డైరెక్టర్‌ని మాత్రం ఓ విషయంలో కచ్చితంగా మెచ్చుకుని తీరాలి.
కావాలనే ఇలా?
'సలార్' టీజర్ చూడగానే చాలామందికి ఇది టీజర్‌లా అస్సలు అనిపించలేదు. ఎందుకంటే హీరో పాత్ర, స్టోరీ ఎలా ఉండబోతుందో చిన్న హింట్ ఇచ్చిన వీడియోలా అనిపించింది. ఇదంతా చూస్తుంటే.. దర్శకనిర్మాతలు కావాలనే ఇలా చేశారేమో అనే డౌట్ వస్తుంది. టీజర్ లేదా ట్రైలర్ లో అన్నీ చూపించేస్తే.. థియేటర్లలోకి వచ్చినవాళ్లు భారీ అంచనాల వల్ల డిసప్పాయింట్ కావొచ్చు. అందుకే టీజర్ తో ఇలా అంచనాలు తగ్గించి, బిగ్ స్క్రీన్‌పై వరసపెట్టి సర్‌ప్రైజులు ఇవ్వాలని ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: 'సలార్' టీజర్ సరికొత్త రికార్డ్.. ఏకంగా టాప్‌లోకి)
బొగ్గు.. సూపర్‌హిట్
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు మూడే సినిమాలు తీశాడు. అన్నింట్లోనూ యాక్షన్ మాత్రమే నమ్ముకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న దర్శకులు.. గ్రాఫిక్స్, అడ్వాన్స్ టెక్నాలజీ, అవి-ఇవి అని తెగ హంగామా చేస్తున్నారు. తీరాచూస్తే తుస్సుమనిపిస్తున్నారు. 'ఆదిపురుష్' విషయంలోనూ ఇలానే జరిగింది. వీళ‍్లందరితో పోలిస్తే ప్రశాంత్ నీల్ మాత్రం.. ఎంచక్కా అందరికీ తెలిసిన కథ, ఎలివేషన్స్ ఇవ్వడానికి ఓ తాత.. హీరో బాడీ మొత్తం బొగ‍్గు పూసి.. సింపుల్‌గా హిట్స్ కొడుతున్నాడు. కోట్లు కొల్లగొట్టేస్తున్నాడు. 'సలార్'తో ఇది మరోసారి జరగొచ్చు!
'కేజీఎఫ్' రెండు పార్ట్స్ లోనూ గ్రాఫిక్స్ తక్కువే ఉంటుంది కానీ యాక్షన్ మాత్రం అంతకు మించి అనేలా ఉంటుంది. ఇప్పుడు 'సలార్' సినిమా విషయంలోనూ దర్శకుడు ప్రశాంత్ నీల్ సేమ్ ఫార్ములా అప్లై చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై ఇప్పటికే బోలెడన్ని అంచనాలున్నాయి. టీజర్ లో అంటే ప్రభాస్ ని దాచేశారు. ట్రైలర్ అయితే దాయలేరుగా! ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార్, జగపతిబాబు, శ్రియారెడ్డి, శ్రుతిహాసన్ లాంటి యాక్టర్స్ కూడా ఉన్నారు. సెప్టెంబరు 28న థియేటర్లలోకి 'సలార్' వస్తుందిగా.. అప్పుడు మాట్లాడుకుందాం!
(ఇదీ చదవండి: Rangabali Review: 'రంగబలి' సినిమా రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment