సలార్‌ రిలీజ్‌ ఆ నెలలోనే.. వైరలవుతున్న ట్వీట్‌! | Prabhas starrer Salaar Release Date Pushed to November | Sakshi
Sakshi News home page

Prabhas Salaar: సలార్‌ రిలీజ్‌ అప్పుడేనా?.. సోషల్ మీడియాలో వైరల్!

Sep 3 2023 9:26 AM | Updated on Sep 3 2023 4:21 PM

Prabhas starrer Salaar Release Date Pushed to November - Sakshi

యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మూవీ రిలీజ్‌ వాయిదా పడిందనే వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా చెప్పకపోయినా రిలీజ్ వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది. సలార్‌పై తాజాగా మరో టాక్ ఊపందుకుంది.

ఈ చిత్రాన్ని నవంబర్‌లో రిలీజ్ చేయనున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. దీనిపై ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే గనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం సలార్ చిత్రబృందం పోస్ట ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే  కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. 

కాగా..'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాయి. కలెక్షన్స్ అయితే వచ్చాయి కానీ .. డార్లింగ్ ఫ్యాన్స్‌ని సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో ప్రస్తుతం ఫ్యాన్స్‌ ఆశలన్నీ 'సలార్'పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్‌ డేట్‌ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఉ‍త్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా మేకర్స్ స్పందించి రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇస్తారేమో చూద్దాం. కాగా..ఈ చిత్రంలో శృతి హాసన్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రీయా రెడ్డి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్ కిరగందూర్ సాలార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement